iDreamPost
android-app
ios-app

Tiger 3: కన్ఫ్యూజ్ చేసి సైలెంట్ గా OTTలోకి వచ్చేసిన సల్మాన్- కత్రినా మూవీ..

సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ నటించిన టైగర్ చిత్రం సైలెంట్ గా ఓటీటీలోక వచ్చేసింది. ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోందో చూడండి.

సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ నటించిన టైగర్ చిత్రం సైలెంట్ గా ఓటీటీలోక వచ్చేసింది. ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోందో చూడండి.

Tiger 3: కన్ఫ్యూజ్ చేసి సైలెంట్ గా OTTలోకి వచ్చేసిన సల్మాన్- కత్రినా మూవీ..

బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన సల్మాన్ ఖాన్ సినిమా అంటే దేశవ్యాప్తంగా ఒక అంచనా ఉంటుంది. పైగా కత్రినా కైఫ్ తో చేసిన మూవీ అనగానే ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ వచ్చేశాయి. పైగా 2023లో బాలీవుడ్ సినిమాలు జోరు మీద ఉండటంతో సల్మాన్ కూడా రికార్డులు బద్దలు కొడతాడని అందరూ భావించారు. కానీ, ఊహించిన స్థాయిలో సల్మాన్- కత్రినా అభిమానులను అలరించలేకపోయారు. టైగర్ 3 సినిమాకి అంతంత మాత్రంగానే రెస్పాన్స్ లభించింది. నిజానికి ట్రైలర్ చూసిన తర్వాత మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, థియేటర్లో మాత్రం వాటిని ఫుల్ ఫిల్ చేయలేకపోవడంతో మిక్స్డ్ టాక్ తోనే సరిపెట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం సడన్ గా ఓటీటీలోకి వచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేసింది.

ఏక్ థా టైగర్, టైగర్ జిందాహై సినిమాలకు కంటన్యూటీగా టైగర్ 3 సినిమా.. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, సల్మాన్- కత్రినా మార్కెట్ లెవల్లో మాత్రం రాణించలేదు. ఈ మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందని అంతా భావించారు. కానీ, అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం రూ.500 కోట్లలోపు వసూళ్లతోనే సరిపెట్టుకుంది. సల్మాన్ మూవీస్ లో ఓవర్సీస్ లో కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ ఉంటాయి. కానీ, టైగర్ 3 అక్కడ కూడా నిరాశే పరిచింది. ఇంక ఈ మూవీ ఓటీటీ విషయంలో కూడా కాస్త గందరగోళం నెలకొందనే చెప్పాలి. నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రం నిజానికి కాస్త ముందుగానే ఓటీటీలోకి రావాల్సింది.

SALMAN MOVIE IN OTT

జనవరి 7న ఓటీటీలో విడుదలవుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. కానీ, ఆ తర్వాత కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడింది. చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. తీరా చూస్తే సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో టైగర్ 3 మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇలా ఎందుకు చేశారు అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఓటీటీలో మాత్రం ఈ మూవీ రికార్డులను బద్దలు కొడుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే థియేటర్లకు వెళ్లే సమయంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫుల్ ప్యాక్డ్ యాక్షన్, సల్మాన్ మార్క్ కామెడీని కోరుకున్నారు.

పైగా అభిమానుల అంచనాలకు తగ్గట్లు ట్రైలర్ ఎంతో బీభత్సంగా ఉంది. దాంతో చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పైగా జోడీగా కత్రినా కైఫ్ ఉంది. ఇంకేముంది సినిమా ఇరగదీస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఆ మూవీ మాత్రం ఆడియన్స్ మాత్రమే కాకుండా ఫ్యాన్స్ ని కూడా నిరాశ పరిచింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా ఆడియన్స్ సినిమా చూస్తారు కాబట్టి కచ్చితంగా నచ్చుతుందనే అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. మరి.. సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ నటించిన టైగర్ 3 మూవీని అమెజాన్ ప్రైమ్ లో మీరు చూడబోతున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.