iDreamPost
android-app
ios-app

Saindhav OTT: సైంధవ్ ఓటీటీ, శాటిలైట్ పార్టనర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

  • Published Jan 06, 2024 | 11:44 AM Updated Updated Jan 06, 2024 | 12:22 PM

Saindhav Streaming Platform & Satellite Rights: విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం సైంధవ్‌. ఇటీవలే ఈ ట్రైలర్ ను విడుదుల చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. అయితే, సైంధవ్‌ ఇంకా థియేటర్ లలో విడుదల కాకముందే దీని ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి.

Saindhav Streaming Platform & Satellite Rights: విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం సైంధవ్‌. ఇటీవలే ఈ ట్రైలర్ ను విడుదుల చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. అయితే, సైంధవ్‌ ఇంకా థియేటర్ లలో విడుదల కాకముందే దీని ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి.

  • Published Jan 06, 2024 | 11:44 AMUpdated Jan 06, 2024 | 12:22 PM
Saindhav OTT: సైంధవ్ ఓటీటీ, శాటిలైట్ పార్టనర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ లో ముందు ఉంటున్నాయి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్. థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసే సమయం లేని వారికీ ఈ ఓటీటీ దయ వలన.. హాయిగా ఇంట్లోనే సినిమాలను చూసేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ఓటీటీ హవా బాగా నడుస్తుంది. థియేటర్ లో విడుదల అయిన ఏ చిత్రం అయినా కొంత సమయం తర్వాత ఓటీటీలో విడుదల అవ్వాల్సిందే. ఇప్పటికే ఇటీవల సూపర్ హిట్ సాధించిన చిత్రాలు ఓటీటీలో సందడి చేస్తూ.. భారీగా దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఇంకా థియేటర్ లో విడుదల అవ్వని చిత్రాలను కూడా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ముందుగానే కొనుగోలు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం తాజాగా వెంకటేష్ దగ్గుబాటి నటించిన సైంధవ్‌ చిత్రానికి కూడా ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయానని సమాచారం.

తాజగా విడుదల చేసిన ‘సైంధవ్‌’ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్‌- శ్రద్ధా శ్రీనాథ్‌లు హీరో,హీరోయిన్లుగా నటించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో ఈ చిత్రం తెరకెక్కనుంది.కాగా ఈ చిత్రానికి ‘హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. సైంధవ్‌ చిత్రం విడుదల అవ్వడానికి ఇంకా కొద్దీ రోజులే ఉన్న కారణంగా.. చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. పైగా సైంధవ్‌ విక్టరీ వెంకటేష్ కు 75వ చిత్రం అవ్వడం విశేషం. అయితే ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ లో దర్శకుడు కథ సారాంశాన్ని క్లియర్ గా చెప్పేశాడు. ఈ సినిమా కథ మొత్తం తండ్రి కూతుళ్ళ మధ్య నడుస్తుంది. దీనిలోని నటీ నటులు కూడా తమదైన శైలిలో తమ క్యారెక్టర్స్ కు న్యాయం చేశారనిపిస్తుంది. ఇంకా విక్టరీ వెంకటేష్ నటన గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఎప్పటిలానే తన మాస్ యాంగిల్ ను అద్భుతంగా కనబరిచాడు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబంధించి టాక్ బాగానే ఉన్నా.. థియేటర్ లో విడుదుల అయిన తర్వాత ఈ చిత్రం ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి మరి.

అయితే, ‘సైంధవ్‌’ చిత్రానికి సంబంధించి ఓటీటీ రైట్స్..చిత్రం విడుదలకు ముందుగానే అమ్మడుపోయాయి. ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ సైంధవ్‌ ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేసింది. థియేటర్ లో విడుదలైన కొద్ది రోజుల తర్వాత ‘సైంధవ్‌’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారం కానుంది. అయితే, ఈ సినిమా ఆన్ లైన్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచి ఉంటుంది అన్నది మాత్రం ఇంకా మేకర్స్ ఫిక్స్ చేయలేదు. థియేటర్ లో ఈ సినిమా సంపాదించే టాక్ ను బట్టి.. ఈ స్ట్రీమింగ్ విషయాలు ఆధారపడి ఉన్నాయి. కాగా, ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు.. మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాయి. తాజాగా మూవీ నుంచి మేక‌ర్స్ ‘బుజ్జికొండవే’ లిరికల్‌ వీడియోను కూడా విడుద‌ల చేశారు.  సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. మరి, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.