iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేసిన సద్గురు నటించిన హాలీవుడ్ మూవీ..

  • Published Feb 21, 2024 | 5:58 PM Updated Updated Feb 21, 2024 | 5:59 PM

Sadguru Hollywood Movie: జగ్గీ వాసుదేవ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ హాలీవుడ్ మూవీలో నటించారు. ఆ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

Sadguru Hollywood Movie: జగ్గీ వాసుదేవ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ హాలీవుడ్ మూవీలో నటించారు. ఆ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

  • Published Feb 21, 2024 | 5:58 PMUpdated Feb 21, 2024 | 5:59 PM
OTTలోకి వచ్చేసిన సద్గురు నటించిన హాలీవుడ్ మూవీ..

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి హద్దులు లేవనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే యాక్టర్స్ పరంగా కూడా ఎలాంటి పరిమితులు లేవు. మన యాక్టర్స్ కూడా హాలీవుడ్ చిత్రాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. అక్కడ కూడా మన సత్తా చాటుతున్నారు. అయితే ఈ లిస్టులోకి ప్రముఖ ఆద్యాత్మిక వేత్త జగ్గీ వాసుదేవ్ చేరారు. ఆయన ఓ హాలీవుడ్ సినిమాలో నటించిన విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అది కూడా జెన్నీఫర్ లోపెజ్ చిత్రం కావడంతో అందరూ అవాక్కవుతున్నారు.

ఈషా ఫౌండేషన్ అధినేత, జగ్గీ వాసుదేవ్ కు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు అది మరింత రెట్టింపు కాబోతోంది. ఎందుకంటే సద్గురు ఇప్పుడు హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆయన నటించిన హాలీవుడ్ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సద్గురు నటించిన “దిస్ ఈజ్ మీ నౌ: ఏ లవ్ స్టోరీ” మూవీ ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో ఆయన గెస్ట్ రోల్ ప్లే చేశారు.

ఈ మూవీలో జెన్నీఫర్ లోపెజ్ లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ మూవీకి డేవ్ మేయర్స్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో బెన్ అఫ్లెక్స్, సోఫియా వెర్గారా, కేకే పాల్మెర్, ట్రెవర్ నోహ్, పోస్ట్ మలోన్, నీల్ డి గ్రాస్సే టైసన్ వంటి ప్రముఖ యాక్టర్స్ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అలాగే జగ్గీ వాసుదేవ్ కూడా ఈ మూవీలో గెస్ట్ రోల్ ప్లే చేశారు. ఆయన నటించిన ఒక సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియాలోనే కాకుండా మరికొన్ని దేశాల్లో ఈ దిస్ ఈజ్ మీ నౌ: ఏ లవ్ స్టోరీ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

కథ ఏంటంటే?:

ఈ దిస్ ఈజ్ మీ మూవీ కథ ఎంతో కొత్తగా ఉంది. జెన్నీఫర్ లోపెజ్ పాత్ర ఆధారంగానే ఈ కథ మొత్తం నడుస్తూ ఉంటుంది. ఒక యువతి చిన్నప్పటి నుంచి తన లైఫ్ లో జరుగుతున్న అంశాలను ఎవరికీ చెప్పుకోలేక, తనలో దాచుకోలేక మదనపడిపోతూ ఉంటుంది. పెరిగి పెద్దైన తర్వాత ప్రేమను వెతుక్కోవడం మొదలు పెడుతుంది. వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరిని వివాహం చేసుకుంటూ ఉంటుంది. ఎంత మందికి బ్రేకప్ చెబుతుందో.. ఎంత మందిని వివాహం చేసుకుంటుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారాన్ని పైనున్న దేవతలు చూస్తూ అంచనాలు వేస్తూ.. కొందరు సపోర్ట్ చేస్తూ.. మరికొంత మంది వ్యతిరేకిస్తూ ఉంటారు. మరి.. సద్గురు నటించిన ఈ హాలీవుడ్ చిత్రంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş