iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేసిన.. టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక హాలీవుడ్ చిత్రం

  • Published Feb 20, 2024 | 10:04 PM Updated Updated Feb 20, 2024 | 10:04 PM

Mean Girls 2024 Streaming In OTT: అవంతిక వందనపు టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి.. ఇప్పుడు హాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ఆమె నటించిన మీన్ గర్ల్స్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Mean Girls 2024 Streaming In OTT: అవంతిక వందనపు టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి.. ఇప్పుడు హాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ఆమె నటించిన మీన్ గర్ల్స్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

  • Published Feb 20, 2024 | 10:04 PMUpdated Feb 20, 2024 | 10:04 PM
OTTలోకి వచ్చేసిన.. టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక హాలీవుడ్ చిత్రం

ఓటీటీలు వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులు కూడా హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అంటూ తేడాలు లేకుండా సినిమాలు చూసేస్తున్నారు. ఈమధ్య కొరియన్, జాపనీస్ సినిమాలను కూడా వదిలిపెట్టడం లేదు. అలాంటి వారికి ఒక ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. అదేంటంటే.. ఆ మూవీలో లీడ్ రోల్ ప్లే చేసిన నటి.. తెలుగులో టైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఆమెకు సంబంధించిన డాన్సులు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ కూడా అయ్యాయి. అదే ఆ అమ్మాయి మరెవరో కాదు.. అవంతిక వందనపు. ఆ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

అవంతిక వందనపు.. టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలు చేసింది. మహేశ్ బాబు అభిమానిగా సూపర్ స్టార్ తో చేసిన చిట్ చాట్ వీడియో అందరూ చూసే ఉంటారు. వెరీ వెరీ లైట్ అంటూ ఓ కుకింగ్ ఆయిల్ యాడ్ తో కూడా చాలా పాపులర్ అయ్యింది. తర్వాత ఆ పాప టాలీవుడ్ లో కనిపించకుండా పోయింది. అందరూ కూడా ఆ విషయాన్ని గమనించలేదు.. మర్చిపోయారు కూడా. కానీ, ఇటీవల సడెన్ గా ఒకరోజు నెట్టింట ఒక సినిమాలోని సాంగ్ వీడియో వైరల్ అయ్యింది. తీరా చూస్తే అందులో ఉంది అవంతిక వందనపు అనేశారు.

ఎవరికీ కాసేపు ఏమీ అర్థం కాలేదు. అప్పుడెప్పుడో టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన అమ్మాయి ఈమేనా? అంటూ నోరెళ్లబెట్టారు. ఆ తర్వాత ఆ మూవీ వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఓటీటీని దున్నేస్తోంది. ఈ మీన్ గర్ల్స్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. అదేంటంటే.. ఈ మూవీని ఇండియాలో చూడటం కుదరదు. ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో రిలీజ్ చేస్తారా? చేయరా? చేస్తే ఎప్పుడు చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు అయితే ప్రస్తుతానికి సమాధానాలు లేవు.

ఈ మీన్ గర్ల్స్ మూవీ మీద క్రియేట్ అయిన హైప్ దృష్ట్యా అమెజాన్ ప్రైమ్ వీడియో దీనిని ఇండియాలో కూడా స్ట్రీమ్ చేసేందుకు ఏమైనా ఏర్పాట్లు చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ మీన్ గర్ల్స్ చిత్రం.. 2004లో వచ్చిన మీన్ గర్ల్స్ అనే టీన్ కామెడీ మూవీ ప్లాట్ లో ఈ మీన్ గర్ల్స్ 2024 మ్యూజికల్ టీన్ కామెడీ మూవీని తీసుకొచ్చారు. ఈ రెండు చిత్రాలకు కథ అందించింది ఫే అనే రైటర్. మరి.. టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు నటించిన మీన్ గర్ల్స్ చిత్రాన్ని ఇండియాలో కూడా స్ట్రీమ్ చేయాలి అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş