iDreamPost
android-app
ios-app

ఇది కదా వీకెండ్ అంటే.. ఒక్కరోజే OTTలోకి ఏకంగా 10 సినిమాలు

Weekend OTT Releases: వారాంతం వస్తోంది అంటే మాత్రం అంతా ఓటీటీల్లో ఏం సినిమాలు ఉన్నాయి అని వెతుకులాట మొదలు పెడతారు. ఆ సెర్చింగ్ లో ఒక్కోసారి మంచి మూవీ దొరకచ్చు.. ఒక్కోసారి దెబ్బైపోతారు. అందుకే ఈసారి మీకోసం వీకెండ్ మూవీ లిస్ట్ మాత్రమే కాకుండా.. సజీషన్ కూడా తీసుకొచ్చాం.

Weekend OTT Releases: వారాంతం వస్తోంది అంటే మాత్రం అంతా ఓటీటీల్లో ఏం సినిమాలు ఉన్నాయి అని వెతుకులాట మొదలు పెడతారు. ఆ సెర్చింగ్ లో ఒక్కోసారి మంచి మూవీ దొరకచ్చు.. ఒక్కోసారి దెబ్బైపోతారు. అందుకే ఈసారి మీకోసం వీకెండ్ మూవీ లిస్ట్ మాత్రమే కాకుండా.. సజీషన్ కూడా తీసుకొచ్చాం.

ఇది కదా వీకెండ్ అంటే.. ఒక్కరోజే OTTలోకి ఏకంగా 10 సినిమాలు

వీకెండ్ అంటే కచ్చితంగా ఒకటి రెండు సినిమాలు చూడాల్సిందే. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ఒక ఎమోషన్. అయితే ఇప్పుడు చాలామంది కుటుంబాన్ని తీసుకుని థియేటర్ కు వెళ్లడం లేదు. ఇంట్లోనే చక్కగా భోజనం చేసి.. అందరూ కలిసి కూర్చుని ఒక మంచి సినిమా పెట్టుకుని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక బ్యాచిలర్స్ అయితే వారిది మరో లోకం.. వారంలో పెండింగ్ పనులు మొత్తం చేసుకుని వీకెండ్ మొత్తాన్ని మూవీ వీకెండ్ గా మార్చేస్తూ ఉంటారు. అయితే ఈసారి వీకెండ్ ని మూవీ మస్తీగా మార్చేయచ్చు. ఎందుకంటే ఈసారి ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి.. వాటిలో ది బెస్ట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటి? వాటిలో ఏది చూడాలి అనే విషయాలు తెలుసుకుందాం.

ఆహా:

  • మిరల్ (తెలుగు)- జూన్ 7
  • బూమర్ అంకుల్(తమిళ్)- జూన్ 7
  • 105 మినిట్స్ (తెలుగు)- జూన్ 7

జియో సినిమా:

  • ది ఎండ్ వ్యూ స్టార్ట్ ఫ్రమ్ (ఇంగ్లీష్)- జూన్ 8
  • బ్లాక్ అవుట్ (హిందీ)- జూన్ 7

సోనీ లివ్:

  • గుల్లక్ 4 (హిందీ సిరీస్)- జూన్ 7
  • వర్షంగాలక్కు శేషం- (మలయాళం)- జూన్ 7

నెట్ ఫ్లిక్స్:

  • హిట్ మ్యాన్ (ఇంగ్లీష్)- జూన్ 7
  • హైరార్కీ (కొరియన్)- జూన్ 7
  • పర్ఫెక్ట్ మ్యాచ్ సీజన్ 2 (ఇంగ్లీష్)- జూన్ 7
  • బుక్ మై షో: ఎబిగైల్ (ఇంగ్లీష్)- జూన్ 7

ఈ అన్ని చిత్రాలని మీరు ఈ వీకెండ్ కి ప్లాన్ చేయడం అంటే అయ్యే పని కాదు. కచ్చితంగా మీరు ఈ సినిమాల్లో రెండు సినిమాలు చూడగలుగుతారు. కానీ, ఆ రెండు చిత్రాలు ఏంటి? అనేది మీకు క్లారిటీ లేదు. అందుకే మీకోసం మేము ఒక రెండు సినిమాలను సజెస్ట్ చేస్తాం. అవి చూసి.. ఈ వీకెండ్ ని మూవీ మస్తీగా మార్చేసుకోండి. హాలీవుడ్ మూవీస్ మీకు ఇష్టమైతే మాత్రం హిట్ మ్యాన్ చిత్రాన్ని చూసేయచ్చు. ఇది ఒక కామెడీ యాక్షన్ డ్రామా. హన్సిక నటించిన 105 మినిట్స్ చిత్రాన్ని కూడా ట్రై చేయచ్చు. ఇందులో కేవలం హన్సిక ఒక్కతే కనిపిస్తుంది. ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం. ఆహాలో ఉన్న మిరల్ చిత్రాన్ని కూడా ఈ వీకెండ్ కి ట్రై చేయచ్చు. మరి.. ఈ చిత్రాల్లో ఏది చూడాలి అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.