iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేసిన థ్రిల్లింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఇటీవల కాలంలో ఇండియాలో సర్వైవల్ థ్రిల్లర్స్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు కానీ.. ఇలాంటి సినిమాలను మొదలు పెట్టింది మాత్రం హాలీవుడ్. ఇప్పుడు మరో థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది.

ఇటీవల కాలంలో ఇండియాలో సర్వైవల్ థ్రిల్లర్స్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు కానీ.. ఇలాంటి సినిమాలను మొదలు పెట్టింది మాత్రం హాలీవుడ్. ఇప్పుడు మరో థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది.

OTTలోకి వచ్చేసిన థ్రిల్లింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

వెరైటీ కాన్సెప్టులతో థ్రిల్లింగ్ సినిమాలను తెరకెక్కించడంతో హాలీవుడ్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా లైఫ్ అండ్ డెత్ మీద ఎన్నో సినిమాలను తెరకెక్కించింది. ఓ జంతువు మనుషుల్ని వేటాడం ఎన్నో చిత్రాలు చూశాం. అంతరించిపోయిన డైనోసార్స్.. గాడ్జిల్లా నుండి అనకొండ, మొసళ్లు, షార్క్స్, వింత ఆకారాలు.. చివరకు వైరస్ నుండి ప్రజలను కాపాడేందుకు హీరో హీరోయిన్లు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి కాన్సెప్టుతో వచ్చిందో మూవీ.. అండర్ వాటర్ సర్వైవల్ థ్రిల్లరే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందని క్యూరియాసిటీని రేకెత్తిస్తుంది. అదే అండర్ పారిస్..

ఓ షార్క్ పారిస్ నగరాన్ని వచ్చి ఎలా విధ్వంసం సృష్టించింది అనేది కథ. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను వివిధ భాషల్లో విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే గతంలో ఇదే తరహాలో అనేక సినిమాలు వచ్చాయి. అందుకే ఈ సినిమా వన్ టైం వాచబుల్‌గా మిగిలింది. జేవియర్ జెన్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నసీమ్ లైస్, బెరెన్సీ బెజో, లీ లేవియంట్, అన్నే మారివిన్ తదితరులు నటిచారు. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెక్ట్ ఫిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. జూన్ 5 నుండి అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ కేవలం ఇంగ్లీషు మాత్రమే కాదు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..

సోఫియా ( బెరెనిస్ బెజో) ఓ సుముద్ర పరిశోధకురాలు. అయితే ఆమె పారిస్ నగరంలో ఉన్న కాలువలోకి షార్క్ వచ్చినట్లు గుర్తిస్తుంది. అంతలో అక్కడ వాటర్ స్పోర్ట్స్ జరుగుతుంటాయి. అక్కడకు వెళ్లాక షార్క్ ఒక్కరిని చీల్చి చెండాతూ ఉంటుంది. అది ఎక్కడ ఉంది కనిపెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంతకు పారిస్ నగరంలోకి ఆ షార్క్ ఎందుకు వచ్చింది అనేది మిగిలిన కథ. ప్రస్తుత పర్యావరణ పరిరక్షణ గురించి పెద్ద చర్చే జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని చర్చిస్తున్నారు. ప్రకృతిలో జరుగుతున్న పెను మార్పులు వల్లే.. జంతువులు అడవుల వీడి నివాస స్థలాల్లోకి వస్తున్నట్లే.. ఇది కూడా ఆ అంశం చుట్టూనే కథ తిరుగుతుంది. మొత్తానికి ఆలోచింప చేసేటట్లు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి.