iDreamPost
android-app
ios-app

OTT లోకి ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా.. ‘సారంగదరియా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Aug 28, 2024 | 2:00 AM Updated Updated Aug 28, 2024 | 2:00 AM

OTT New Release-Telugu Movie Sarangadariya: ఈ వారం ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి మరొక ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ సిద్ధం అయిపోతుంది. కాబట్టి ఈ సినిమాను కూడా అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT New Release-Telugu Movie Sarangadariya: ఈ వారం ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి మరొక ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ సిద్ధం అయిపోతుంది. కాబట్టి ఈ సినిమాను కూడా అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Aug 28, 2024 | 2:00 AMUpdated Aug 28, 2024 | 2:00 AM
OTT లోకి ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా.. ‘సారంగదరియా’..  స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ప్రతి వారం లానే ఈ వారం కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ లో సందడి చేయడానికి రెడీ అయిపోతున్నాయి. ఇక ఈ వారం ఓటీటీ లోకి వచ్చే సినిమాలలో చాలా వరకు తెలుగు సినిమాలే ఉండడం విశేషం. ఈ క్రమంలో ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ ఈ లిస్ట్ లోకి యాడ్ అవ్వబోతుంది. అయితే ఈ వీకెండ్ ఓ మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలంటే మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ బెస్ట్ సజెషన్ అని చెప్పి తీరాలి. ఈ సినిమా పేరు ‘సారంగదరియా’. మరి ఈ సినిమా ఏ ఓటీటీ లో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుంది. ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

జూలై 12న థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. ప్రేక్షకులను అనుకున్న రేంజ్ లో మెప్పించలేకపోయింది. ఈ సినిమాకు పద్మారావ్ అబ్బిశెట్టి దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో రాజారవీంద్ర ప్రధాన పాత్రలో నటించగా.. అతనితో పాటు శివచందు, యశస్వినీ, శ్రీకాంత్ అయ్యంగార్, మొయిన్ మహమ్మద్, మోహిత్ పేడాడ, కాదంబరి కిరణ్, హర్షవర్దన్, నీల ప్రియ ప్రధాన పాత్రలలో అలరించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయిపోయింది. ఆగష్టు 31 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీ లో ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో వేచి చూడాలి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. మిడిల్ క్లాస్ వారికి ఎదురయ్యే సమస్యల చుట్టూ ఈ మూవీ కథ కొనసాగుతూ ఉంటుంది. ఈ మూవీలో రాజా రవీంద్ర ఓ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతని కొడుకు అర్జున్ ప్రేమలో పడి.. విఫలం అవుతాడు. అలా మద్యానికి బానిస అవుతాడు. అతని చిన్న కొడుకు కూడా ఎలాంటి పని లేకుండా.. ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. అతను కూడా ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే అతని కూతురు మాత్రం.. చాలా పద్దతిగా ఉంటుంది. తండ్రి చెప్పినట్టే నడుచుకుంటుంది. ఈ క్రమంలో ఓ రోజు అతని కూతురు గురించి ఓ షాకింగ్ విషయం బయటపడుతుంది. అతని కుటుంబం అవమానాల పాలవుతుంది. అసలు అతని కూతురు గురించి తెలిసిన నిజం ఏంటి ? ఆ తర్వాత ఏమైంది ? అతని కొడుకులు దారిలోకి వచ్చారా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.