OTT Telugu Movies: ఈ వారం OTT లో ఏకంగా 6 తెలుగు సినిమాలు.. అవేంటంటే ?

This Week OTT Telugu Movies: ప్రతి వారం లానే ఈ వారం కూడా ఓటీటీ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ గా ఉన్నాయి. ఇక వాటిలో ముందుగా ఎలాగూ అందరు సెర్చ్ చేసేది తెలుగు సినిమాల కోసమే కాబట్టి.. ఈ వారం ఓటీటీ లోకి రాబోయే తెలుగు సినిమాలేంటో చూసేద్దాం.

This Week OTT Telugu Movies: ప్రతి వారం లానే ఈ వారం కూడా ఓటీటీ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ గా ఉన్నాయి. ఇక వాటిలో ముందుగా ఎలాగూ అందరు సెర్చ్ చేసేది తెలుగు సినిమాల కోసమే కాబట్టి.. ఈ వారం ఓటీటీ లోకి రాబోయే తెలుగు సినిమాలేంటో చూసేద్దాం.

అన్ని భాషల సినిమాలను కంటెంట్ ను బట్టి ఆదరించిన కానీ. ఎంతైనా తెలుగు సినిమాలంటే మాత్రం అదొక తెలియని ఎమోషన్.. కాబట్టి ప్రతి వారం ఓటీటీ లోకి ఎన్ని సినిమాలు వచ్చినా కానీ.. వాటిలో ముందుగా అందరు తెలుగు సినిమాల కోసం మాత్రమే సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ వారం కూడా ఓటీటీ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ గా ఉన్నాయి. అందులోను వినాయక చవితి రావడంతో.. పండగ వాతావరణంతో ఇళ్లన్నీ కళకళలాడుతాయి. ఇక మూవీ లవర్స్ కూడా ఖుషి అవ్వాలంటే.. ఈ వారం ఓటీటీ లోకి వచ్చే ఈ తెలుగు సినిమాలను మిస్ కాకుండా చూడాల్సిందే. మరి వాటిలో ఈ వారం అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలేంటో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో అసలు మిస్ చేయకుండా చూడాల్సిన తెలుగు సినిమాల లిస్ట్ ఇలా ఉంది.

ది ఫాల్ గాయ్:

ఇదొక హాలీవుడ్ యాక్షన్ కామెడీ చిత్రం.. ఈ మూవీ మే 3న ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ మూవీ సెప్టెంబర్ 3 నుంచి ఇంగ్లీష్ తో పాటు.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠి వెర్షన్స్ లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఎలాగూ హాలీవుడ్ సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు కాబట్టి.. ఈ సినిమాను కూడా బాగానే ఆదరించే అవకాశాలు లేకపోలేదు.

సత్య :

తమిళ సినిమా రంగోలికి తెలుగు వెర్షన్ గా వస్తున్న మూవీ.. సత్య. ఆల్రెడీ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా గురించి మాత్రం అంతగా బజ్ వినిపించలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీకెండ్ ఓ మంచి రొ*మాంటిక్ లవ్ స్టోరీ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాల్సిందే. కాబట్టి ఈ ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో ఈ మూవీ కూడా యాడ్ చేసుకోండి.

అడియోస్ అమిగో:

మలయాళ సినిమాలలో ఉండే కంటెంట్ కు ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఈ సినిమా కూడా ఓ మలయాళీ కామెడీ డ్రామానే.. థియేటర్ లో మలయాళీ వెర్షన్ మాత్రమే రిలీజైన…ఓటీటీ లో మాత్రం తెలుగు వెర్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మలయాళం , తెలుగుతో పాటు.. కన్నడ, తమిళం వెర్షన్స్ లో… సెప్టెంబర్ 6 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి ఈ సినిమాను కూడా మిస్ చేయకుండా చూసేయండి.

కమిటీ కుర్రాళ్ళు :

ఆగస్ట్ నెలలో చిన్న సినిమాగా రిలీజ్ అయినా ఈ మూవీ.. ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకోడంతో పాటు.. నోస్టాలాజిక్ హిట్ గా పేరు తెచ్చుకుంది. నిజంగా ఇది మేకర్స్ కు ఇదొక ప్రత్యేకమైన సినిమా అనే చెప్పి తీరాల్సిందే. ప్రతి ఒక్కరికి బాల్యాన్ని గుర్తుచేసే ఈ సినిమాను.. థియేటర్ లో మిస్ అయితే మాత్రం.. ఓటీటీ లో అసలు మిస్ కాకుండా చూసేయండి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది.

నింద:

కొత్త బంగారు లోకం , హ్యాపీ డేస్ తర్వాత ఆ రేంజ్ హిట్ వరుణ్ సందేశ్ కెరీర్ లో పడలేదు. ఇక కనీసం నింద సినిమా అయినా వరుణ్ కెరీర్ లో హిట్ సంపాదించి పెడుతుంది అంటే.. మిక్స్డ్ టాక్ తోనే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఇక ఆగస్ట్ లోనే ఈ మూవీ ఓటీటీ లోకి రావాల్సి ఉంది కానీ.. రాలేదు. ఇక ఇప్పుడు ఈ మూవీ సెప్టెంబర్ 6 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ మూవీ ఓటీటీ లో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

డబుల్ ఇస్మార్ట్ :

రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్ మూవీ.. భారీ అంచనాల మధ్యన థియేటర్స్ లో రిలీజ్ అయింది. మొదటి రోజు కలెక్షన్స్ లో ఊపందుకున్నాయి కూడా క్రమంగా మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సడెన్ గా ఓటీటీ లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి థియేటర్ లో ఈ మూవీని మిస్ అయినా వారు ఓటీటీ లో మిస్ కాకుండా చూసేయండి.

ఇక ఈ సినిమాలు కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు యాడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఈ సినిమా అప్ డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments