నివేద థామస్ 35 చిన్న కథ కాదు OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే..

35 chinna katha kaadu OTT Streaming Date: ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 35 చిన్న కథ కాదు. ఇక ఇప్పుడు ఈ సినిమా నెలలోపే ఓటీటీ లోకి రానున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

35 chinna katha kaadu OTT Streaming Date: ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 35 చిన్న కథ కాదు. ఇక ఇప్పుడు ఈ సినిమా నెలలోపే ఓటీటీ లోకి రానున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలన్నీ కూడా.. థియేటర్ లో రిలీజ్ అయినా నెలలోపే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. థియేటర్ లో ఆయా సినిమాలను చూసినా కానీ.. ఆ సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం థియేటర్స్ లో చిన్న సినిమాల హావ నడుస్తుందని చెప్పి తీరాల్సిందే. గత నెలలో రిలీజ్ అయినా మీడియం బడ్జెట్ సినిమాలన్నీ కూడా భారీ రేంజ్ లో హైప్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా రిలీజ్ అయినా 35 చిన్న కథ సినిమా కూడా మంచి హిట్ టాక్ నే సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్ ఇదే అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ మూవీ ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కు రానుందో చూసేద్దాం.

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వదేవ్ , హీరోయిన్ నివేద థామస్ నటించిన సినిమా.. 35 చిన్న కథ కాదు. చాలా కాలం తర్వాత ఓ మంచి తెలుగు సినిమా చూశామన్నా ఫీల్ కలిగించింది ఆడియన్సుకు. మనసుని హత్తుకునే కథ.. నటీనటుల సహజ నటన ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులను చాలా బాగా మెప్పించింది. థియేటర్స్ లో మంచి టాక్ నే సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 27 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ రానున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారంగా ప్రకటన రావాల్సి ఉంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు ఎంచక్కా ఓటీటీ లో ఈ సినిమాను చూసేయండి. కచ్చితంగా ఓటీటీ లో కూడా ఈ మూవీ మంచి టాక్ సంపాదించుకుంటుంది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ సినిమాను డైరెక్టర్ నందకిషోర్ ఇమాని తెరకెక్కించారు. ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికొస్తే.. మ్యాథ్స్ సబ్జెక్ట్ లో పాస్ మార్క్స్ తెచ్చుకునేలా.. తన కొడుకుకు ఓ తల్లి స్ఫూర్తి కలిగించడం చుట్టూ ఈ సినిమా స్టోరీ నడుస్తుంది. సినిమా కథ చాలా సింపుల్ గా ఉంటూ ఉంటుంది. కానీ అందరి హృదయాలకు హత్తుకునేల ఉంటుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని ఈ సినిమా ఇంకాస్త బాగా మెప్పిస్తుందని నిస్సందేహంగా చెప్పొచ్చు . ప్రస్తుతం ప్రేక్షకులంతా తమకు కనెక్ట్ అయ్యే ఇలాంటి కథలనే కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి డైరెక్టర్స్ ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాలు తీసుకుని వస్తారో వేచి చూడాలి. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments