OTT లో టెన్షన్ పెంచే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘డీ బ్లాక్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

OTT Suspense Thriller In Telugu: ఓటీటీ లో సడెన్ గా కొన్ని సినిమాలు ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది.

OTT Suspense Thriller In Telugu: ఓటీటీ లో సడెన్ గా కొన్ని సినిమాలు ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ వారం ఓటీటీ లో చూడదగిన సినిమాలేంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే లిస్ట్ ను ఆల్రెడీ చూసేసి ఉంటారు. అయితే ప్రతి వారం ఆల్రెడీ ముందు వచ్చిన అప్ డేట్స్ తో పాటు.. కొన్ని కొత్త సినిమాలు కూడా సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతూ.. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. పైగా అలాంటి సినిమాలే ట్రెండింగ్ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇలా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ క్రమంలో తాజగా మరొక ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే ఈ మధ్య ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్ గానే చూస్తున్నారు. అందులోను అవి తెలుగులో ఉంటే ఆ సినిమాలు చూసేందుకే మరింత ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు తెలుగు సినిమాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. వేరే లాంగ్వేజ్ లో ఎప్పుడో రిలీజ్ అయినా సినిమాలను కూడా.. ఇప్పుడు తెలుగు స్ట్రీమింగ్ కు తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్న సినిమా కూడా ఇలాంటిదే. ఈ సినిమా పేరు “డీ బ్లాక్” . ఈ సినిమా 2022 లో తమిళంలో రిలీజ్ అయింది. ఆ సమయంలో ఈ సినిమా ప్రేక్షకులను బాగానే మెప్పించింది. ముఖ్యంగా యూత్ కు ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ వీకెండ్ ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలంటే ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాల్సిందే.

ఇక డీ బ్లాక్ సినిమా కథ విషయానికొస్తే.. అరుళ్ , విజయ్ అనే ఇద్దరూ ఇంజినీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి వస్తారు. ఆ కాలేజ్ అడవి మధ్యలో ఉండడంతో.. సాయంత్రం 5 దాటిన తర్వాత ఎవరు హాస్టల్ దాటి బయటకు రావొద్దని.. ముఖ్యంగా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని అక్కడి కాలేజ్ లెక్చరర్స్ చెప్తారు. ఇక అరుళ్ , విజయ్ వాళ్ళ ఇంజినీరింగ్ లైఫ్ ను ఎలా అయినా ఎంజాయ్ చేయాలనీ ఫిక్స్ అవుతారు. ఈ క్రమంలో ఓ రోజు డీ బ్లాక్ లో ఉండే లేడీస్ హాస్టల్ వార్డెన్.. ఫస్ట్ ఇయర్ లో ఉండే అమ్మాయిలందరిని పిలిచి.. ఒంటరిగా ఎవరు తిరగొద్దని.. సాయంత్రం హాస్టల్ గేట్ దాటొద్దని హెచ్చరిస్తుంది. కట్ చేస్తే అప్పటినుంచి వారికి ఆ హాస్టల్ లో ప్రతి రోజు వారికీ ఎదో ఒక వింత సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. అసలు ఆ హాస్టల్ లో ఏముంది? వారికి ఆ హాస్టల్ వలన ఏదైనా ప్రమాదం ఉంటుందా ? ఎందుకు అక్కడి వారంతా సాయంత్రం బయటకు రావద్దని చెప్తారు ? ఆ తర్వాత ఏమైంది ? అనేది తెలియలాంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments