OTT Telugu Movie: డైరెక్ట్ గా OTT లోకి సుమంత్ ఎమోషనల్ డ్రామా ‘అనగనగా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Telugu Movie - Anaganaga: ఆల్రెడీ ప్రస్తుతం ఓటీటీ లకు పెరుగుతున్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని.. వెండితెర నటి నటులు ఓటీటీ ల వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సుమన్ కొత్త మూవీ కూడా డైరెక్ట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

OTT Telugu Movie - Anaganaga: ఆల్రెడీ ప్రస్తుతం ఓటీటీ లకు పెరుగుతున్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని.. వెండితెర నటి నటులు ఓటీటీ ల వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సుమన్ కొత్త మూవీ కూడా డైరెక్ట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

టాలీవుడ్ హీరో సుమంత్.. ఇప్పుడు ఈ హీరో గురించి అంతగా బజ్ వినిపించడం లేదు కానీ.. ఒకప్పుడు ఈ హీరో సినిమాలు ప్రేక్షకులను బాగానే మెప్పించేవి. అలా సుమంత్ హిట్స్ , ప్లాప్స్ తో సంబందం లేకుండా.. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ.. కొత్త ప్రయోగాలు చేస్తుంటాడు సుమంత్. ఇక ఇప్పుడు .ఓటీటీ లకు పెరుగుతున్న ఆదరణను చూస్తూ.. వెండి తెర నటి నటులు ఓటీటీ లవైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సుమంత్ కొత్త మూవీ కూడా డైరెక్ట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో… దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

సుమంత్ నటిస్తున్న కొత్త సినిమా పేరు ‘అనగనగా’.. ఈ సినిమాకు.. సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నారు .తాజాగా టీచర్స్ డే సంధర్బంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో సుమంత్ టీచర్ పాత్రలో నటించనున్నారు. ఒక స్కూల్ బ్యాక్డ్రాప్ లో ఈ మూవీ కొనగబోతున్నమాట. ఇక గ్లిమ్ప్స్ లో వినిపించిన ‘చిన్న‌ప్పుడు మ‌నం చాలా క‌థ‌లు వినేవాళ్లం క‌దా…ఇప్పుడు ఆ క‌థ‌లు మ‌రోసారి విందామా’ అనే మాటలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో.. ఈ సినిమా కచ్చితంగా అందరిని మెప్పించేస్తుంది అనిపిస్తుంది. ఇప్పుడు అందరు ఒక్కసారి వెనక్కు వెళ్లి వారు గడిపిన సమయాలను గుర్తు చేసుకుంటూ.. నోస్టాలాజిక్ డేస్ ను ఫీల్ అయ్యే కథలను ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ సినిమా కూడా అదే లిస్ట్ లో యాడ్ అవ్వబోతుంది. ఈ సినిమా డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్ .

ఇక ఆల్రెడీ ఈటీవీ విన్ ఒరిజినల్ తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను తెగ మెప్పించేస్తుంది. ఇప్పటికే ఇలాంటి స్కూల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన #90’s ఎలాంటి సక్సెస్ ను అందుకుందో చూశాము. ఇక ఆ తర్వాత ఈటీవీ విన్ లో చాలానే సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. తాజాగా ఈ నెలలో రిలీజ్ కాబోయే సినిమాల లిస్ట్ ను కూడా అనౌన్స్ చేసింది ఈటీవీ విన్ ప్లాట్ ఫార్మ్. దీనితో ఓటీటీ లవర్స్ కంటెంట్ విషయంలో ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఇక ఈ మూవీ అనగనగా మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments