iDreamPost
android-app
ios-app

స్టార్‌ హీరోకు షాక్‌.. 2 వారాల్లోనే OTTలోకి వచ్చేసిన గిన్నిస్‌ రికార్డ్‌ మూవీ

  • Published May 22, 2024 | 10:42 AM Updated Updated May 22, 2024 | 10:42 AM

OTT Release: గిన్నిస్‌ రికార్డులు సాధించిన స్టార్‌ హీరో సినిమా ఒకటి.. ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా విడుదలైన రెండు వారాలకే.. ఆ వివరాలు..

OTT Release: గిన్నిస్‌ రికార్డులు సాధించిన స్టార్‌ హీరో సినిమా ఒకటి.. ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా విడుదలైన రెండు వారాలకే.. ఆ వివరాలు..

  • Published May 22, 2024 | 10:42 AMUpdated May 22, 2024 | 10:42 AM
స్టార్‌ హీరోకు షాక్‌.. 2 వారాల్లోనే OTTలోకి వచ్చేసిన గిన్నిస్‌ రికార్డ్‌ మూవీ

ఓటీటీలకు విపరీతమైన క్రేజ్‌ పేరుగుతోంది. ఇప్పుడైతే.. థియేటర్‌లకు వెళ్లి సినిమాలు చూసే వారి కన్నా.. ఓటీటీల్లో చూసే వారి సంఖ్యనే భారీగా పెరుగుతోంది. ఈ క్రేజ్‌కు తగ్గట్టుగానే ఓటీటీలు కూడా భారీగా ఖర్చు చేసి మరీ కొత్త కంటెంట్‌ను తీసుకొస్తున్నాయి. ఓటీటీలకు క్రేజ్‌ పెరిగిన తర్వాత.. ప్రతి సినిమా వాటిల్లో విడుదలవుతుంది. కొన్ని చిత్రాలైతే నేరుగా ఓటీటీలోకే వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు విడుదలైన వారం, రెండు వారాలకే ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా గిన్నిస్‌ రికార్డులు సృష్టించిన ఓ స్టార్‌ హీరో సినిమా.. విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఆ వివరాలు..

హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్‌ గోస్లింగ్ హీరోగా న‌టించిన‌ లేటెస్ట్‌ చిత్రం ది ఫాల్ గాయ్ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండో వారాల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేసింది. యాక్ష‌న్ కామెడీ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా మే 3న థియేట‌ర్ల‌లో రిలీజైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ వద్ద డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో.. మూవీ రిలీజైన 18 రోజులకే మేక‌ర్స్ ది ఫాల్ గాయ్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. మంగ‌ళ‌వారం నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

బార్బీ తర్వాత వచ్చిన సినిమా కావడంతో..

ర్యాన్ గోస్లింగ్ హీరోగా న‌టించిన బార్బీ మూవీ అవార్డుల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. పైగా బార్బీ సినిమాకుగాను ర్యాన్‌ గోస్లింగ్‌.. బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌గా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. భారీ విజయం సాధించిన బార్బీ తర్వాత.. ర్యాన్ గోస్లింగ్.. ది ఫాల్ గాయ్ సినిమాలో హీరోగా నటించాడు. దాంతో అభిమానులు ఈ చిత్రంపై భారీగా అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ కామెడీ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం, క‌థ‌లో లోపాల కార‌ణంగా ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ది ఫాల్ గాయ్ క‌థ మొత్తం 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంద‌ని ద‌ర్శ‌కుడు సినిమాలో చూపించారు. కానీ సీన్స్ మొత్తం నేటి కాలాన్ని త‌ల‌పిస్తూ సాగ‌డం, యాక్ష‌న్ ఎపిసోడ్స్ లాజిక్స్ మిస్స‌వ్వ‌డంతో ఫ్యాన్స్ నుంచి విమ‌ర్శ‌లొచ్చాయి.

ది ఫాల్ గాయ్‌ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నప్పటికి.. గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. యాక్ష‌న్ ఎపిసోడ్స్‌లో కెనాన్ రోల్స్ అనే స్టంట్ టెక్నిక్స్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించిన మూవీగా ది ఫాల్‌ గాయ్‌.. గిన్సిస్ బుక్‌లో ద‌క్కించుకున్న‌ది. ర్యాన్ గోస్లింగ్ ఇప్ప‌టివ‌ర‌కు మూడు సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాడు. కానీ ఒక్క‌సారి కూడా అవార్డు రాలేదు.