OTT లోకి రానున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ‘ఆపరేషన్ రావణ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

OTT Crime Thriller- Operation Raavan Movie: క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. అందులోను అవి తెలుగులో వస్తున్నాయంటే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు . ఈ క్రమంలో ఓటీటీ లోకి ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ రాబోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ రాబోతుందో చూసేద్దాం.

OTT Crime Thriller- Operation Raavan Movie: క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. అందులోను అవి తెలుగులో వస్తున్నాయంటే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు . ఈ క్రమంలో ఓటీటీ లోకి ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ రాబోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ రాబోతుందో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో రాబోయే తెలుగు సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి. వీకెండ్ లోపు ఇంకొన్ని సినిమాలు యాడ్ అయినా ఆశ్చర్యం లేదు. ఈ క్రమంలో ఓటీటీ లోకి ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ రాబోతుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. అందులోను అవి తెలుగులో వస్తున్నాయంటే.. ఆ సినిమా ఏంటో చూడాలనే క్యూరియాసిటీ ఇంకాస్త పెరిగిపోతుంది. ఇప్పుడు ఓటీటీ లోకి రాబోయేది కూడా ఇలాంటి ఓ సినిమానే. ఆ మూవీ మరేదో కాదు పలాస 1978 ఫేమ్ రక్షిత్ అట్లూరి నటించిన.. ఓ తెలుగు క్రైమ్ ఆపరేషన్ రావణ్. మరి ఈ సినిమా ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఆపరేషన్ రావణ్.. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజుల తర్వాత.. ఓటీటీ లోకి వస్తుంది. ఈ సినిమాలో రక్షిత్ అట్లూరితో పాటు.. సంకీర్త‌న విపిన్‌, ర‌ఘు కుంచే, రాధికా శ‌ర‌త్‌కుమార్ లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. కాగా ఈ సినిమాతో వెంకట సత్య డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమా కూడా రెగ్యులర్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫార్మేట్ లోనే కొనసాగడంతో.. ప్రేక్షకులను ఈ మూవీ అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ లోకి రానుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు మేకర్స్.

ఇక ఈ మూవీ కథ విషయానికొస్తే.. ఆమని అనే ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్.. సిటీలో వరుసగా అమ్మాయిలను కిడ్నప్ చేస్తూ.. హత్యలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. ఆ కేసులో ఆమనికి అసిస్టెంట్ గా రామ్ అనే వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. రామ్ ఆమనికి తన ప్రేమను వ్యక్తం చేసే లోపే.. ఆమనిని కూడా సీరియల్ కిల్లర్ కిడ్నప్ చేస్తాడు. ఆ కిల్లర్ ను రామ్ పెట్టుకున్నాడా లేదా ? అసలు ఇలా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంది ఎవరు ? ఆ సీరియల్ కిల్లర్ గురించి ఎలాంటి విషయాలు తెలుస్తాయి? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments