డైరెక్ట్ గా OTT లోకి కీర్తి సురేష్ కామెడీ మూవీ ‘రఘు తాత’ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Recent Comedy Drama Raghu Thatha In Telugu OTT: ఇపుడు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ త్వరగానే ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి.ఈ క్రమంలో తాజాగా కీర్తి సురేష్ నటించిన ఓఓఓ సినిమా థియేటర్ లో కాకుండా తెలుగులో డైరెక్ట్ గా ఓటీటీ లోకి రానున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.

Recent Comedy Drama Raghu Thatha In Telugu OTT: ఇపుడు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ త్వరగానే ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి.ఈ క్రమంలో తాజాగా కీర్తి సురేష్ నటించిన ఓఓఓ సినిమా థియేటర్ లో కాకుండా తెలుగులో డైరెక్ట్ గా ఓటీటీ లోకి రానున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.

ఇప్పడు ఓటీటీ లకి బాగానే క్రేజ్ నడుస్తుంది. ఇతర భాషల సినిమాలను కూడా… థియేటర్ లో కాకుండా నేరుగా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు. పైగా ఆ సినిమాలు స్ట్రీమింగ్ స్టార్ట్ అయినా కొద్దీ గంటల్లోనే మంచి వ్యూస్ ను సంపాదించుకుంటున్నాయి. దీనితో మేకర్స్ కూడా దీనిని మంచి అవకాశంగా భావించి.. ప్రేక్షకుల ముందుకు మంచి కంటెంట్ ను తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా కీర్తి సురేష్ తమిళంలో నటించిన ‘రఘు తాత’ అనే సినిమా… తెలుగులో థియేటర్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ లోకి వస్తున్నట్లు సమాచారం. మరి ఈ మూవీ ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

కీర్తి సురేష్ తాజాగా నటించిన సినిమా ‘రఘు తాత’.. ఆగష్టు 15న తమిళంలో రిలీజ్ అయింది. దీనిని తెలుగులో కూడా రిలీజ్ చేద్దాం అని భావించారు . అయితే అదే సమయంలో తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు రిలీజ్ కావడంతో.. దీనిని పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ ను డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేయనున్నారని సమాచారం. తమిళంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 సొంతం చేసుకోగా.. త‌మిళం, తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాషల్లో సెప్టెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ కు తీసురానున్నట్లు సమాచారం . త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు మేకర్స్.

ఇక రఘు తాత సినిమా కథ విషయానికొస్తే.. హిందీ రూల్స్ కు వ్యతిరేకంగా కాయల్ విజి పోరాటం చేస్తూ… కాపాండియన్ అనే మారు పేరుతో రచనలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె జీవితంలోకి తమిళ్ సెల్వన్ అనే వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. అప్పటినుంచి ఆమె జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అసలు ఆ తమిళ్ సెల్వన్ ఎవరు ? ఎందుకు ఆమె హిందీ భాషను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తుంది ? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన కష్టాలు ఎదురయ్యాయి ? తర్వాత ఏం జరుగుతుంది ? అనేది మిగిలిన కథ. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments