Swetha
Reason Behind Manamey Movie OTT Late Entry: దాదాపు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా నెల, రెండు నెలల లోపే ఓటీటీ లోకి వచ్చేస్తూ ఉంటాయి. కానీ అదేంటో తెలియదు కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈ లిస్ట్ లోకి మనమే మూవీ కూడా యాడ్ అయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం అవ్వడానికి రీజన్ ను చెప్పారు మేకర్స్.
Reason Behind Manamey Movie OTT Late Entry: దాదాపు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా నెల, రెండు నెలల లోపే ఓటీటీ లోకి వచ్చేస్తూ ఉంటాయి. కానీ అదేంటో తెలియదు కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈ లిస్ట్ లోకి మనమే మూవీ కూడా యాడ్ అయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం అవ్వడానికి రీజన్ ను చెప్పారు మేకర్స్.
Swetha
సినిమా థియేటర్ లో హిట్ అయినా ప్లాప్ అయినా.. అటు ఇటుగా రెండు నెలల లోపే ఓటీటీ లోకి వస్తున్నాయి. 90 శాతం సినిమాలన్నీ నెలలోపే ఓటీటీ ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఎక్కడో 10 శాతం సినిమాలు మాత్రం ఆలస్యం అవుతుంటాయి. అవన్నీ కూడా థియేటర్ లో బోల్తా పడిన సినిమాలే. ఇప్పుడు ఈ లేట్ ఓటీటీ ఎంట్రీ లిస్ట్ లో.. శర్వానంద్ నటించిన మనమే మూవీ కూడా యాడ్ అయింది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ డేట్, స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ విషయంలో.. చాలా వార్తలు వింటూ వస్తున్నాము. అదిగో ఇదిగో అనడమే కానీ ఇప్పటివరకు ఓటీటీ లోకి రాలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కి ఎందుకు లేట్ అవుతుందో.. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడారు. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.
మనమే సినిమా జూన్ 7 న థియేటర్ లో విడుదల అయింది. రొమాంటిక్ కామెడీ జోనర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ గురించైతే అంతా మర్చిపోయారు. ఈ క్రమంలో తాజాగా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్.. మూవీ ఓటీటీ రిలీజ్ ఎందుకు ఆలస్యం అవుతుందో వెల్లడించారు. మనమే నాన్ థియేట్రికల్ తాము మోసపోయాం అని .. ఓ సంస్థకు నాన్ థియేట్రికల్ హక్కులు ఇవ్వగా.. ఆ సంస్థ అనేక కారణాలు చెప్తూ.. ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కు ఈ సినిమా హక్కులను అమ్మలేదని.. దీని వలన వారికి భారీ నష్టం జరిగిందని.. అందుచేతనే ఓటీటీ స్ట్రీమింగ్ లేట్ అవుతుందని చెప్పుకొచ్చారు. సో ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ కోసం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను మొదట అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపించింది. కానీ అసలు ఆ డీల్ జరగలేదని.. నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడైతే ఆగస్ట్ 26న ఈ మూవీ ఓటీటీ లోకి రానుందనే వార్తలు వినిపిస్తున్న.. దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. కాగా ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శర్వానంద్ , కృతి శెట్టితో పాటు.. రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, సీరత్ కపూర్, వెన్నెల కిశోర్, శివ కందుకూరి ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పుడు థియేటర్ లో మెప్పించని సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కాబట్టి ఈ సినిమా విషయంలో ఇలా జరిగే అవకాశం లేకపోలేదు. మరి ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.