Tirupathi Rao
Payal Rajput Rakshana Movie OTT Release: పాయల్ రాజ్ పుత్ నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు 15 రోజులు కూడా కాక ముందే ఓటీటీలోకి వస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి.
Payal Rajput Rakshana Movie OTT Release: పాయల్ రాజ్ పుత్ నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు 15 రోజులు కూడా కాక ముందే ఓటీటీలోకి వస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి.
Tirupathi Rao
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలకు గాయం చేసిన పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ భామ ఆ తర్వాత కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. లవ్ స్టోరీలు, క్రైమ్ కథలు, నెగిటివ్ రోల్స్ అన్నీ ట్రై చేసిన పాయల్ రాజ్ పుత్ ఇటీవల పోలీస్ పాత్రతో అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు ఓటీటీలోకి ఒక కొత్త సినిమాలో పాయల్ రాజ్ పుత్ రాబోతోంది. ఇటీవల విడుదలైన పాయల్ చిత్రం రక్షణ మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఈ మూవీలో పాయల్ పోలీస్ పాత్రలో కనిపించింది. ఆ మూవీనే ఓటీటీలోకి రాబోతోంది.
ఈ రక్షణ మూవీ కచ్చితంగా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే పాయల్ రాజ్ పుత్ తెలుగులో మొదటిసారి పోలీసు పాత్రలో చేసింది. ఈ మూవీకి ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వం వహించాడు. నిజానికి ఈ సినిమాపై చాలానే కాంట్రవర్సీ జరిగింది. ఎప్పుడో చేసిన సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారని.. రెమ్యూనరేషన్ కూడా ఇవ్వకుండా ప్రమోషన్స్ కి రావాలని కోరుతున్నారంటూ పాయల్ రాజ్ పుత్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఆమెపై చిత్రబృందం కూడా నిర్మాతల కౌన్సిల్ కి ఫిర్యాదు చేసింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరిన విషయం కూడా తెలిసిందే. ఎట్టకేలకు ఆ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
అయితే ఈ రక్షణ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన కేవలం 15 రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా కూడా.. అతి త్వరలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. కాస్త గట్టిగానే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ రక్షణ మూవీ కథ విషయానికి వస్తే.. ఉన్నత చదువులు చదివిన అమ్మాయిలు లైఫ్ లో బాగా సెటిల్ అవుతారు. అలాంటి కొందరు అమ్మాయిలో సిటీలో వరుసగా హత్యలకు గురవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పాయల్ రాజ్ పుత్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ ఫ్రెండ్ కూడా హత్యకు గురవుతుంది.
సిటీలో జరుగుతున్న ఆ హత్యల వెనుక ఒక సైకో ఉన్నాడు అని ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ భావిస్తుంది. అలా మానస్ నాగులపల్లి చేసిన ఒక నెగిటివ్ రోల్ ని కిరణ్ సైకోగా అనుమానిస్తుంది. అయితే అతను ఆత్మహత్య చేసుకోవడంతో కిరణ్ పై సస్పెన్షన్ వేటు పడుతుంది. ఆ తర్వాత అసలు ఏం జరిగింది? అసలు ఆ హత్యలు ఎవరు చేశారు? వారి మోటో ఏంటి? అనే ఇంట్రెస్టిగ్ పాయింట్స్ తో కథ ముందుకు వెళ్తుంది. ఈ మూవీలో పాయల్ యాక్టింగ్ కు మంచి మార్కులే వచ్చాయి. అయితే థియేటర్లలో అంత ఆదరణ దక్కకపోవడంతో.. ఓటీటీలో మాత్రం కచ్చితంగా మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.