iDreamPost
android-app
ios-app

OTT వీకెండ్ సజీషన్.. ఈ 4 చిత్రాలను అస్సలు మిస్ కాకండి..!

OTT Weekend Suggestions: మీరు ఈ వీకెండ్ ని మూవీస్, వెబ్ సిరీస్లతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం.. మీకోసం కొన్ని రికమెండేషన్స్ తీసుకొచ్చాం. ఏ మూవీ చూడాలి అని కన్ఫ్యూజన్ లో ఉంటే వీటిని మాత్రం ఒకసారి ట్రే చేయండి. మరి.. ఆ మూవీస్ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? చూద్దాం.

OTT Weekend Suggestions: మీరు ఈ వీకెండ్ ని మూవీస్, వెబ్ సిరీస్లతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం.. మీకోసం కొన్ని రికమెండేషన్స్ తీసుకొచ్చాం. ఏ మూవీ చూడాలి అని కన్ఫ్యూజన్ లో ఉంటే వీటిని మాత్రం ఒకసారి ట్రే చేయండి. మరి.. ఆ మూవీస్ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? చూద్దాం.

OTT వీకెండ్ సజీషన్.. ఈ 4 చిత్రాలను అస్సలు మిస్ కాకండి..!

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లెక్క చాలా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఓటీటీల్లో సినిమాలు చూడటానికి చాలా అలవాటు పడిపోయారు. అయితే అన్ని ఓటీటీలు వచ్చిన తర్వాత వారం వారం రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య కూడా పెరిగిపోయింది. అలాంటప్పుడు వాటిని మీరు ఒక వీకెండ్ లో కవర్ చేయడం సాధ్యం కాదు. ఉదాహరణకు ఈ వీకెంట్ కి ఓటీటీలోకి ఏకంగా 25 సినిమాలు, సిరీస్లు వస్తున్నాయి. వాటిని కవర్ చేయాలి అంటే కనీసం నెల పడుతుంది. అలా అని ఏదీ చూడకుండా కూడా ఉండలేరు. అందుకే మీకోసం వాటిలో బెస్ట్ సినిమాలు, సిరీస్లను రికమెండ్ చేస్తున్నాం. మీకు వీకెండ్ లో ఓటీటీ మూవీస్ చూసే అలవాటు ఉంటే.. ఈ సినిమాలతో మీ వీకెండ్ ని అద్భుతంగా ఎంజాయ్ చేయచ్చు.

మూవీస్ అనగానే అందరికీ యాక్షన్, ఎమోషన్, డ్రామా, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలా చాలానే గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్న సినిమాల్లో దాదాపుగా ఇంగ్లీష్ ని అవాయిడ్ చేసి.. తెలుగులో అందుబాటులో ఉన్న సినిమాల గురించి తెలుసుకుందాం. వాటిలో ముందుగా తెప్ప సముద్రం సినిమా గురించి చెప్పుకోవాలి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఆగస్టు 3 నుంచి స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ మూవీలో మీకు మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ కథ మొత్తం ఆడ పిల్ల అపహరణ, వారి హత్యల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇందులో ఎవరినీ చూసినా కూడా హంతకుడిలాగే కనిపిస్తూ ఉంటారు. ట్రైలర్ తోనే ఈ మూవీపై భారీ అంచనాలను పంచేశారు. ఇప్పుడు ఓటీటీలో కచ్చితంగా ఈ మూవీని ట్రై చేయచ్చు. ఇంక హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవాళ్లు.. డ్యూన్ పార్ట్ 2 జియో సినిమాలో తెలుగు డబ్బింగ్ తో అందుబాటులోకి వచ్చింది. తెలుగులో లేదు అని ఈ చిత్రాన్ని లైట్ తీసుకున్న వాళ్లు కచ్చితంగా ఈ మూవీని ఈ వీకెండ్ ఎంజాయ్ చేసేయచ్చు.

This week OTT best movies

ఇంక కొందరికి వీకెండ్ లో వెబ్ సిరీస్లు చూడాలి అనిపిస్తుంది. ఒకసారి స్టార్ట్ చేస్తే సిరీస్ ని ఆపకుండా పూర్తి చేసే ప్రేక్షకులు కూడా ఉంటారు. అలాంటి వారి కోసం నెట్ ఫ్లిక్స్ నుంచి ఒక మర్డర్ సస్పెన్స్ సిరీస్ అందుబాటులో ఉంది. ఆ సిరీస్ పేరు ‘ఏ గుడ్ గర్ల్స్ గైడ్ టూ మర్డర్’. టీనేజ్ గర్ల్స్ చుట్టూ ఈ సిరీస్ తిరుగుతూ ఉంటుంది. ఇందులో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నుంచి 51 నిమిషాల వరకు ఉంటుంది. ఐఎండీబీలో 6.7 రేటింగ్ సొంతం చేసుకుంది. ఇంక ఇంకో హాలీవుడ్ యాక్షన్ సినిమా తెలుగు డబ్బింగ్ తో హాట్ స్టార్ లోకి వచ్చేసింది. అదే కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. ఈ మూవీ ఫ్రాంచైజ్ ఫాలో అయ్యేవాళ్లు దీనిని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇంక ఇవి కాకుండా.. ఆహాలో పాయల్ రాజ్ పుత్ రక్షణ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ ట్రై చేయచ్చు. జియో సినిమాలో ‘దస్ జూన్ కి రాత్’ అనే హిందీ సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. హిందీ వచ్చిన వాళ్లు ఆ సిరీస్ ని కూడా ట్రై చేయచ్చు. ఈ చిత్రాలతో మీ వీకెండ్ ని ఎంజాయ్ చేసేయండి.