iDreamPost
android-app
ios-app

OTTలో తాప్సీ మూవీ.. అవమానాల నుంచి దేశం గర్వపడేలా..

OTT Suggestions- Tapsee Pannu: ఓటీటీలో ఎన్నో సినిమాలు చూసుంటారు. కానీ, ఇలాంటి స్పోర్ట్ డ్రామా చూసుండరు. తాప్సీ ఈ మూవీలో ఒక్కో సీన్ లో తన యాక్టిగ్ తో కన్నీళ్లు తెప్పించేస్తుంది.

OTT Suggestions- Tapsee Pannu: ఓటీటీలో ఎన్నో సినిమాలు చూసుంటారు. కానీ, ఇలాంటి స్పోర్ట్ డ్రామా చూసుండరు. తాప్సీ ఈ మూవీలో ఒక్కో సీన్ లో తన యాక్టిగ్ తో కన్నీళ్లు తెప్పించేస్తుంది.

OTTలో తాప్సీ మూవీ.. అవమానాల నుంచి దేశం గర్వపడేలా..

ఓటీటీలో ఉన్న సినిమాల్లో చాలా వరకు యాక్షన్, కామెడీ, డ్రామా ఓరియంటెడ్ మూవీస్ చూస్తుంటారు. ఎక్కువ అలాంటి సినిమాలే వైరల్ అవుతూ ఉంటాయి. కానీ, చాలా తక్కువ మూవీస్ రియల్ లైఫ్ ఇన్ స్పైర్డ్ సినిమాలు ఉంటాయి. అలాంటివి ఓటీటీలో ఉన్నప్పుడు తప్పకుండా ఒకసారి చూడాల్సిందే. ఎందుకంటే ఆ మూవీస్ చూడటం వల్ల మనం రియల్ లైఫ్ కూడా ఎక్కువ మోటివేట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. ఆ టైప్ సినిమా ఒకటి తాప్సీ చేసిందనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఆ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ స్పోర్ట్స్ డ్రామా చూస్తే రియల్ లైఫ్ లో అథ్లెట్లకు ఇన్ని కష్టాలు ఉంటాయా? అనే అనుమానం రాకమానదు. అసలు ఆ మూవీ ఏదంటే?

తాప్సీ పన్ను తన కెరీర్లో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసింది. వాటిలో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా ఉన్నాయి. వాటిలో ఈ మూవీ కూడా ఒకటి. తాప్సీ పన్ను చేసిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇదని చెప్పచ్చు. ఆ మూవీ మరేదో కాదు.. రష్మీ రాకెట్. ఒక అథ్లెట్ తన లైఫ్ లో పడిన కష్టాలు, కన్నీళ్లు, ఎదుర్కొన్న అవమానాల నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించారు. నిజ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న అథ్లెట్ల జీవితాల నుంచి ఇన్ స్పైర్ అయ్యి తీసిన కథ ఇది అని చెప్పారు. ఇందులో ఒక్కో సీన్ గుండెలను పిండేస్తుంది.

Tapsee

దేశానికి మెడల్ తీసుకురావడానికి కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కోవాలా? అనే ప్రశ్నలు మదిలో మెదులుతాయి. ఆకర్ష్ ఖురానా ఈ మూవీని ఎంతో ఎమోషనల్ గా తెరకెక్కించారు. వంటింటి కుందేళ్లలా ఆడవాళ్లని చూసే గ్రామం నుంచి ఒక అమ్మాయి దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు వెళ్తుంది. దేశాన్ని గర్వపడేలా చేయాలి అని ఎన్నో కలలు కన్న ఆ అమ్మాయికి ఆ దేశంలోనే చెప్పుకోలేని అవమానాలు ఎదురవుతాయి. స్త్రీ కంటే పురుష హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయని ఆమెను సస్పెండ్ చేస్తారు. తోటి అథ్లెట్లు కూడా ఘోరంగా అవమానిస్తారు. ఒకానొక సమయంలో తన కెరీర్ ని కూడా వదులుకోవాలి అనుకుంటుంది.

ఒక లాయర్ సాయంతో న్యాయ పోరాటం చేస్తుంది. దేశాన్ని, అథ్లెట్లను, కోచ్ లను ఎదిరించి నిలబడుతుంది. తన దేశానికి మెడల్ సాధించాలి అనే తన కోరికను ఎక్కడా వదిలేయకుండా పోరాటం చేస్తుంది. మరి.. ఆమె పోరాటం ఫలించిందా? అథ్లెట్ గా తన కెరీర్ కొనసాగిందా? దేశానికి మెడల్ తీసుకురావాలి అనే తన కల నెరవేరిందా? అసలు ఆమెను అంతగా అవమానించాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ 2021 అక్టోబర్ 15 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ భాషలో అందుబాటులో ఉంది. ఈ సినిమా నిడివి 2 గంటల 9 నిమిషాలుగా ఉంది.