iDreamPost
android-app
ios-app

ఒక్క సినిమాకి 7 ఆస్కార్లు.. తెలుగులో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ ని ఎలా మిస్ అయ్యారు?

OTT Suggestions: ఓటీటీలో ఎన్నో చిత్రాలు ఉంటాయి. కానీ, కొన్నింటి మాత్రం అస్సలు మిస్ కాకూడదు. ఆ లిస్ట్ లో ఈ మూవీ కూడా ఉంటుంది. ఇది ఏకంగా 7 ఆస్కార్స్ ని గెలిచిన చిత్రం. తెలుగులో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటే మీరు ఇంకా చూడలేదా?

OTT Suggestions: ఓటీటీలో ఎన్నో చిత్రాలు ఉంటాయి. కానీ, కొన్నింటి మాత్రం అస్సలు మిస్ కాకూడదు. ఆ లిస్ట్ లో ఈ మూవీ కూడా ఉంటుంది. ఇది ఏకంగా 7 ఆస్కార్స్ ని గెలిచిన చిత్రం. తెలుగులో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటే మీరు ఇంకా చూడలేదా?

ఒక్క సినిమాకి 7 ఆస్కార్లు.. తెలుగులో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ ని ఎలా మిస్ అయ్యారు?

ఓటీటీలో టైమ్ ఉంది కదా అని ఏదో ఒక సినిమా చూస్తే సరిపోతుంది అని కొంతమంది అనుకుంటారు. కానీ, టైమ్ వేస్ట్ అయినా పర్లేదు ఒక గంటసేపు వెతికి అయినా మంచి సినిమా చూడాలి అని ఇంకొంతమంది అనుకుంటారు. అలా మంచి సినిమా చూడాలి అనుకునే వారి కోసం మేము ఓటీటీ సజీషన్స్ రూపంలో అద్భుతమైన సినిమాలు సజెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు కూడా ఒక సూపర్ డూపర్ బంపర్ సినిమాని మీకోసం తీసుకొచ్చాం. ఆ మూవీ అంత తోపు అని మీరెలా చెప్తారు? అని అడిగేయకండి. ఎందుకంటే ఆ మూవీ తోపు అని ఆస్కార్ వాళ్లు 7 అవార్డులు ఇచ్చేశారు. అందుకే మేము కూడా అంత బలంగా చెప్తున్నాం. మరి.. ఆ మూవీ ఏది? అంత గొప్పగా ఏముందో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న చిత్రం పేరు ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్‘. 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానంలో మొత్తం 11 విభాగాల్లో నామినేట్ అవ్వగా.. 7 అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి ఉత్తమ నటిగా ఆస్కార్ మిషెల్ యో అందుకుంది. ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్న తొలి ఏషియన్ నటిగా మిషెల్ యో రికార్డులు సృష్టించింది. ఈ మూవీ 2023లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఈ మూవీ గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి.

ఇలాంటి చిత్రాన్ని చాలామంది మిస్ అయ్యారు. నిజానికి ఈ మూవీ చూడాలి అనుకున్నా ఇంగ్లీష్ కదా అని లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ, సోనీ లివ్ ఓటీటీలో తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది. తెలుగులో ఉండి కూడా ఇంత మంచి చిత్రాన్ని మిస్ అయితే ఎలా చెప్పండి? అందుకే మీకోసం ఈ చిత్రాన్ని ఓటీటీ సజీషన్ గా తీసుకొచ్చాం. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. మార్వెల్ సినిమాలు చూసే వారికి మల్టీవర్స్ అనే పదం బాగా తెలిసే ఉంటుంది. డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ మ్యాడ్ నెస్ చిత్రంలో ఈ కాన్సెప్ట్ గురించి ఉంటుంది.

ఈ ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్‘ మూవీలో కూడా ఇదే కాన్సెప్ట్ మీద సినిమా ఉంటుంది. ఇందులో మిషెల్ యో చైనీస్ అమెరికన్ ఇమిగ్రెట్ పాత్ర చేస్తుంది. కాలంతో పోరాడుతూ బ్లాక్ హోల్ ప్రమాదం నుంచి విశ్వాన్ని కాపాడేందుకు కృషి చేస్తూ ఉంటుంది. అలాగే ఎన్నో విభిన్నమైన పాత్రలు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అబ్బుర పరుస్తుంది. మరి.. ఇప్పటికే మీరు ఈ చిత్రాన్ని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.