Swetha
OTT Best Suspense Thriller : వారం వారం ఓటీటీ లో ఎన్ని సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అయినా కానీ.. ముందు అందరు వాటిలో తెలుగు సినిమాలు ఎమున్నాయా అని సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకునేది కూడా ఇలాంటి ఓ తెలుగు సినిమా గురించే..
OTT Best Suspense Thriller : వారం వారం ఓటీటీ లో ఎన్ని సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అయినా కానీ.. ముందు అందరు వాటిలో తెలుగు సినిమాలు ఎమున్నాయా అని సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకునేది కూడా ఇలాంటి ఓ తెలుగు సినిమా గురించే..
Swetha
లాక్ డౌన్ పుణ్యామా అని అప్పటినుంచి.. ఇప్పటివరకు కూడా ఓటీటీ లకు బాగా ఆదరణ పెరిగిపోయింది. ఇతర భాషల సినిమాలు ఎలా ఉన్నా కానీ ముఖ్యంగా తెలుగు సినిమాలకు ఆదరణ బాగా లభిస్తుంది. థియేటర్ ప్రేక్షకులను మెప్పిచలేని ఎన్నో సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను మాత్రం ఇట్టే మెప్పించేశాయి. ఊహించని రేంజ్ లో సినిమాలు హిట్ అవ్వడంతో.. ఇంకా ప్రేక్షకులను మెప్పించడానికి ఎప్పటికప్పుడు ఓటీటీ లో కొత్తకొత్త సినిమాలు, సిరీస్ లు పుట్టుకొస్తూ ఉన్నాయి. థియేటర్ లోనే కాకుండా.. నేరుగా ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లు కూడా పెరిగిపోయాయి. ఇక వారం వారం ఓటీటీ లో ఎన్ని సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అయినా కానీ.. ముందు అందరు వాటిలో తెలుగు సినిమాలు ఎమున్నాయా అని సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకునేది కూడా ఇలాంటి ఓ తెలుగు సినిమా గురించే.. మరి ఈ సినిమాను మీరు చూసారో లేదో ఓ లుక్ వేసేయండి.
అసలు ఈ సినిమా ఏంటో తెలుసుకునే ముందు ఈ సినిమా కథేంటో చూసేద్దాం.. బుచ్చినాయుడు కండ్రిగ: తూర్పు వీధి అనే గ్రామం ఉంటుంది. ఆ ఊరిలో బాలు అనే ఓ అబ్బాయి తన ఎదురింట్లో ఉండే స్వప్న అనే అమ్మాయిని చిన్నప్పటినుంచి ఇష్టపడుతూ ఉంటాడు. అతను కాలేజ్ కు వెళ్లే వయస్సు వచ్చేసరికి ఆమెతో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో స్వప్న కూడా బాలుని ఇష్టపడుతుంది. అయితే స్వప్న తండ్రికి మాత్రం కుల పిచ్చి ఉంటుంది. తన కూతురు కేవలం తమ కులానికి చెందిన వారితోనే స్నేహం చేయాలనీ అనుకుంటాడు. ఇక మరో వైపు తన కొడుకును రైల్వే స్టేషన్ మాస్టర్ చేయాలనీ.. కలలు కంటూ ఉంటాడు బాలు తండ్రి. కొడుకు కోసం ఏమైనా చేయాలి అనుకుంటాడు. బాలు , స్వప్న మాత్రం ఇంట్లో తెలీకుండా ప్రేమలో ఉంటారు. కట్ చేస్తే.. స్వప్న తండ్రి ఆమెకు.. తన మేనమామ తో పెళ్లి నిశ్చయం చేస్తాడు. దీనితో బాలు , స్వప్న ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది ! పరువు కోసం ప్రాణాలు తీయడానికి కూడా లెక్కచేయని.. స్వప్న తండ్రి ఏం చేశాడు? కొడుకు కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడిన బాలు తండ్రి ఎం చేశాడు ? స్వప్న , బాలు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్లారు ? చివరికి ఈ కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
కులం , పరువు పేరుతో.. కన్న బిడ్డల ప్రేమను అర్ధం చేసుకోకుండా.. పరువు హత్యలు చేస్తున్న ఘటనలు మన చుట్టూ చాలానే చూస్తున్నాము. ఇలాంటి కథాంశంతో వచ్చిన సినిమానే ఇది కూడా. ఈ సినిమా పేరు “బుచ్చినాయుడు కండ్రిగ: తూర్పు వీధి”. ఇది ఒక సింపుల్ కథ. కానీ, దర్శకుడు కథను చూపించిన తీరు ప్రేక్షకులను చివరి వరకు ఈ సినిమా చూసేలా చేస్తుంది. పరువు హత్యల నేపథ్యంలో ఈ మధ్య పరువు అనే ఓ వెబ్ సిరీస్ కూడా వచ్చింది. ఈ జోనర్ సినిమాలు , సిరీస్ లు అన్ని ఒకటే ప్లాట్ లో ఉన్న కూడా.. దర్శకులు కథను ముందుకు తీసుకుని వెళ్లే తీరుని బట్టి.. ఆ సినిమా కథ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.