iDreamPost
android-app
ios-app

మనుషులను వేటాడే మృగాలు.. OTTలో వణికించే సూపర్ న్యూచురల్ సిరీస్!

OTT Suggestions- The Grimm web Series: ఓటీటీలో మీరు ఒక మంచి వెబ్ సిరీస్.. అది కూడా సూపర్ న్యూచరల్ కాన్సెప్ట్ తో ఉండేది చూడాలి అనుకుంటే మాత్రం మీరు ఈ సిరీస్ ని అస్సలు మిస్ కావొద్దు. పైగా మీరు ఈ సిరీస్ ని ఫ్రీగానే చూసేయచ్చు.

OTT Suggestions- The Grimm web Series: ఓటీటీలో మీరు ఒక మంచి వెబ్ సిరీస్.. అది కూడా సూపర్ న్యూచరల్ కాన్సెప్ట్ తో ఉండేది చూడాలి అనుకుంటే మాత్రం మీరు ఈ సిరీస్ ని అస్సలు మిస్ కావొద్దు. పైగా మీరు ఈ సిరీస్ ని ఫ్రీగానే చూసేయచ్చు.

మనుషులను వేటాడే మృగాలు.. OTTలో వణికించే సూపర్ న్యూచురల్ సిరీస్!

చాలా మందికి సోషియో ఫాంటసీ, సూపర్ న్యూచురల్, మిస్టరీ థ్రిల్లర్స్ కథలంటే చాలా ఇష్టం ఉంటుంది. నిజానికి ఆ కథలు అన్నీ వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయి. అలాంటి అసలు రియల్ లైఫ్ లో జరిగే ఆస్కారం కూడా ఉండదు. అలాంటి కథలు మీకు కూడా ఇష్టం ఉంటే.. మీకోసమే ఈ వెబ్ సిరీస్. ఇది అలాంటి ఇలాంటి సిరీస్ కాదండోయ్.. స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం. పైగా ఇందులో ఏకంగా 6 సీజన్స్ ఉన్నాయి. 2011లో స్టార్ట్ అయిన ఈ సిరీస్ 2017 వరకు సాగింది. ఇందులో ట్విస్టులు, నరాలు తెగే ఉత్కంఠ.. ఇలాంటివి చాలానే ఉంటాయి. మరి.. ఆ సిరీస్ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

హాలీవుడ్ నుంచి వచ్చే సిరీస్లు అంటే ఇండియాలో.. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే మీకు కూడా హాలీవుడ్ యాక్షన్, మిస్టరీ, సూపర్ న్యూచురల్ సిరీస్లు ఇష్టం అయితే కచ్చితంగా ఈ సిరీస్ ని చూసేయండి. ఎందుకంటే ఇందులో ఉండే స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది. మనుషులు లాగానే.. మనుషుల మధ్యనే కొన్ని మృగాలు సంచరిస్తూ ఉంటాయి. వాటిని సామాన్య మానవులు చూడటం చాలా కష్టం. కానీ, గ్రిమ్ అనే కొందరు మాత్రం వాటిని గుర్తించగలరు. ఆ మృగాల్లో కూడా కొన్ని సాదు జీవులు.. కొన్ని మాత్రం మనుషులను వేటాడేవి ఉంటాయి.

ఈ గ్రిమ్స్ అనే వాళ్లు వాటి నుంచి మనుషులను రక్షిస్తూ ఉంటారు. ఆ మృగం తన కంట్రోల్ ని కోల్పోయినప్పుడు దాని స్వరూపాన్ని బయటకు చూపిస్తుంది. అది కేవలం గ్రిమ్ మాత్రమే చూడగలడు. ఈ సిరీస్ లో హీరోనే ఆ గ్రిమ్. వాళ్ల సంతతిలో అతనే ఆఖరి వాడు. అతను పోలీస్ డిపార్టుమెంట్ లో ఉంటాడు. మొదట తనకి ఏం జరుగుతోంది అనే విషయం తనకి తెలిసేది కాదు. అదంతా ఒక భ్రమగా ఫీలవుతాడు. కానీ, అతను గ్రిమ్ అని తెలుసుకుంటాడు.

తనకున్న సూపర్ పవర్స్ తో ఆ సిటీలో జరిగే ఎన్నో కేసులను సాల్వ్ చేస్తాడు. ఇలా ఈ సిరీస్ లో ఎపిసోడ్ కి ఒక కొత్త కేస్ వస్తుంది. ఆ కేసులో చాలానే ట్విస్టులు ఉంటాయి. అలాగే ప్యార్లల్ గా తన ఫ్లాష్ బ్యాక్, తన వ్యక్తిగత జీవితం, అతనికి ఎదురయ్యే ప్రమాదాలు, అతను చేసే సాహసాలను చూపిస్తూ ఉంటారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండేది. కానీ, ఇప్పుడు ఇండియాలో స్ట్రీమింగ్ కావడం లేదు. కానీ, మీరు ఈ గ్రిమ్ అనే సిరీస్ ని ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో చూడచ్చు. ఈ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.