OTT Suggestions- Bound Movie On Prime Video: ప్రేమ పేరుతో మోసం.. DJ టిల్లు రేంజ్ ట్విస్టులు.. OTTలో సూపర్ థ్రిల్లర్!

ప్రేమ పేరుతో మోసం.. DJ టిల్లు రేంజ్ ట్విస్టులు.. OTTలో సూపర్ థ్రిల్లర్!

OTT Suggestions- Best Thriller Bound Movie On Prime Video: మీరు ఒక మంచి రివేంజ్ డ్రామా, లవ్ స్టోరీలు చూడాలి అనుకుంటే ఈ మూవీని ట్రై చేయచ్చు. ఎందుకంటే ఇది డీజే టిల్లు రేంజ్ ట్విస్టులతో ఉంటుంది. అలాగే రాధికా అక్క కూడా ఉంటుంది.

OTT Suggestions- Best Thriller Bound Movie On Prime Video: మీరు ఒక మంచి రివేంజ్ డ్రామా, లవ్ స్టోరీలు చూడాలి అనుకుంటే ఈ మూవీని ట్రై చేయచ్చు. ఎందుకంటే ఇది డీజే టిల్లు రేంజ్ ట్విస్టులతో ఉంటుంది. అలాగే రాధికా అక్క కూడా ఉంటుంది.

ఓటీటీల్లో మీరు ప్రేమకథలు ఎన్నో చూసుంటారు. వాటిలో ఎక్కువ శాతం అబ్బాయి- అమ్మాయి మధ్య ప్రేమ.. రెండు డ్యూయట్లు, పెద్దలు ఒప్పుకోకపోవడం వీళ్లు ప్రేమను త్యాగం చేయడం.. లేదంటే పారిపోయి పెళ్లి చేసుకోవడం ఇవే చూసుంటారు. ఇటీవల టాలీవుడ్ లో అయితే స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తెచ్చిన డీజే టిల్లులో మోసం చేసే రాధికా అక్కలను కూడా చూసుంటారు. అయితే ఇప్పుడు మీకు రాధికా వాళ్ల సీనియర్స్ ని పరిచయం చేయబోతున్నాం. వాళ్లని చూస్తే మీరు కూడా ఆ మాట నిజమమి ఒప్పుకొని తీరతారు. ఎందుకంటే వాళ్లుచేసే పనులు.. చూపించే ప్రేమ.. చేసే మోసాలు ఆ రేంజ్ లో ఉంటాయి కాబట్టి.

ఈ మూవీలో ఒక హీరోయిన్ ఉంటుంది. ఆమెకు ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అతనిపై వల్లమాలిన ప్రేమ చూపిస్తుంది. అతను లేకపోతే తన జీవితం లేదు అనే స్థాయిలో నటించేస్తూ ఉంటుంది. ఆ ప్రేమ నిజమే అనుకుని.. ఆ వ్యక్తి కూడా తెగ సంబరపడిపోతూ ఉంటాడు. అయితే వాళ్లు లైఫ్ లో సెటిల్ కావడానికి ఒక ప్రయత్నం చేస్తాడు. అదేంటంటే ఒక మాఫియా డాన్ ని బురిడీ కొట్టించడం. అతనికి చెందిన 2 మిలియన్ డాలర్లను ఈ వ్యక్తి దొంగిలిస్తాడు. రక్తంలో నానిపోయిన ఆ డబ్బును తీసుకుని హీరోయిన్ దగ్గరకు పరుగులు పెడుతు వస్తాడు. తర్వాత వాళ్లు ఆ డబ్బును తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టి భద్ర పరుస్తారు. అయితే ఈ లోగా ఆ మాఫియా డాన్ తన సొమ్ము కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.

ఈ వ్యక్తి ఆ డబ్బును ఎలా దాచిపెట్టాలా? ఎలా తప్పించుకోవాలా? అని ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో అతనికి కొత్త సమస్య ఎదురవుతుంది. అదేంటంటే.. ప్రేమించిన అమ్మాయి కూడా డబ్బు రాగానే మాటలు మార్చేస్తుంది. అతని డబ్బుపై కన్నేస్తుంది. ఆ 2 మిలియన్ డాలర్లు సొంతం చేసుకుని లైఫ్ సెట్ చేసుకోవాలి అని భావిస్తుంది. ఆమెకు మరో యువతి సాయం చేసేందుకు ఉంటుంది. ఈమె ఈ ప్లాన్ అనుకున్నప్పుడే మరో యువతితో సంబంధం పెట్టుకుంటుంది. ఆమె చాలా మొరటుగా, ఎంత కష్ణమైన పనైనా చేయగల యువతిని లైన్లో పెడుతుంది. ప్రేమ పేరుతో ఆమెకు డబ్బు ఆశ చూపిస్తుంది. వాళ్లిద్దరు కలిసి ఆ డబ్బు దొంగిలించేందుకు ప్లాన్ చేస్తారు. ఈ మూవీ పేరు ‘బౌండ్’ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రూ.119కు రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీని ఫ్రీగా చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments