iDreamPost
android-app
ios-app

ప్రేమ పేరిట హత్యలు.. OTTలో బెర్లిన్ సిండ్రోమ్ మూవీకి పిచ్చెక్కిపోతారు..

OTT Suggestions- Best Thriller Berlin Syndrome Movie: ఈ మధ్యకాలంలో ఓటీటీ ఆడియన్స్ అభిరుచులు మారిపోతున్నాయి. లవ్ స్టోరీలు మాత్రమే కాకుండా.. మంచి థ్రిల్లర్స్ అంటే మక్కువ చూపిస్తున్నారు. అలాంటి వారికి లవ్ స్టోరీ ఎలిమెంట్స్ తో ఉన్న ఒక బెస్ట్ థ్రిల్లర్ తీసుకొచ్చాం.

OTT Suggestions- Best Thriller Berlin Syndrome Movie: ఈ మధ్యకాలంలో ఓటీటీ ఆడియన్స్ అభిరుచులు మారిపోతున్నాయి. లవ్ స్టోరీలు మాత్రమే కాకుండా.. మంచి థ్రిల్లర్స్ అంటే మక్కువ చూపిస్తున్నారు. అలాంటి వారికి లవ్ స్టోరీ ఎలిమెంట్స్ తో ఉన్న ఒక బెస్ట్ థ్రిల్లర్ తీసుకొచ్చాం.

ప్రేమ పేరిట హత్యలు.. OTTలో బెర్లిన్ సిండ్రోమ్ మూవీకి పిచ్చెక్కిపోతారు..

ఓటీటీలో ఒక మంచి లవ్ స్టోరీ కోసం మీరు వెతుకుంటే మీకోసం మాత్రం కాదు ఈ మూవీ. ఒక గ్రిప్పింగ్ స్టోరీ నరేషన్, వెన్నులో వణుకుపుట్టే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, షాకుల మీద షాకులు కావాలి అంటే మాత్రం ఈ మూవీ మీరు అస్సలు మిస్ కాకూడదు. ఎందుకంటే ఈ సినిమా చూడటానికి ఎంతో అందంగా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎంతో వైలెంట్ గా మారిపోతుంది. థ్రిల్లర్స్, హారర్ చిత్రాలు చూసే వారికి కూడా ఈ మూవీ కాస్త కంగారు పుట్టిస్తుంది. ఇన్నాళ్లు ఓటీటీలో ఉన్నా కూడా మీరు దీనిని చూసుండరు. ఇందులో ప్రతి సీన్ మిమ్మల్ని మంత్రముగ్ధులను చేయడమే కాకుండా.. ఒకవైపు నుంచి భయపెడుతూ కూడా ఉంటుంది. మరి.. అలాంటి మూవీ ఏది? ఎక్కడే స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

ఈ సినిమా ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా స్టార్ట్ అవుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా.. ఆ తరహాలో ఉంటుంది. కానీ, అసలు కథ ఆ తర్వాతే ప్రారంభం అవుతుంది. ఈ సినిమా మొత్తం ఒక ఆస్ట్రేలియన్ ఫొటో జర్నలిస్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ లేడీ జర్నలిస్ట్ హాలిడే కోసం బెర్లిన్ కి వస్తుంది. అక్కడ తనకు నచ్చిన బిల్డింగులు, పక్షులు, ప్రదేశాలను ఫొటోలు తీస్తూ ఉంటుంది. అలా పొరపాటున ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అతను ఎంత మాటకారి అంటే.. పరిచయం అయిన కాసేపటికే మాటల్లో పెట్టేసి ఆమెకు ముద్దు కూడా పెట్టేస్తాడు. ఆ తర్వాత ఆమెను తన ఫ్లాట్ కి తీసుకెళ్తాడు. ఆ రాత్రికి అక్కడే నిద్రపోతుంది.

ఆ జర్నలిస్ట్ ఉదయాన్నే నిద్రలేస్తుంది. అప్పుడు అతను ఆ ఫ్లాట్ లో ఉండడు. అయితే రూమ్ లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే.. తనకు ఒక ఆల్బమ్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి అందులో ఉన్న ఫొటోలు చూస్తూ ఉంటుంది. అందులో కొందరు అమ్మాయిల ఫొటోలు కూడా ఉంటాయి. వాటిని చూసి ఆమె బిత్తరపోతుంది. అతని మీద అనుమానం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వా ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలి అని ప్రయత్నిస్తే.. అంతా లాక్ చేసి ఉంటుంది. కనీసం కిటికీ కూడా ఓపెన్ కాదు. తాను ట్రాప్ చేయబడ్డాను అని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత ఆమె జీవితంలో ఎన్ని కష్టాలు పడింది? అసలు అతను అమ్మాయిలతో ఏం చేస్తున్నాడు? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు.. ట్రాప్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా కథ మారిపోతుంది. ఈ సినిమాలో సీనుకో ట్విస్ట్.. ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమా పేరు ‘బెర్లిన్ సిండ్రోమ్’. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. ఈ చిత్రాన్ని ఒంటరిగా చూడటం కాస్త బెటర్. ఈ మూవీని చూసేందుకు క్లిక్ చేయండి.