ఒక తప్పు కవర్ చేయడానికి.. ఇంకో తప్పు చేయాల్సిందే.. OTTలో క్రేజీ మూవీ!

OTT Suggestions- Anukunnadi Okkati Ayindi Okkati: ఓటీటీ లో ఉన్న సినిమాలన్నీ చూసేసి.. ఇంకా ఇంట్రెస్టింగ్ సినిమాలు చూడాలని సెర్చ్ చేసే వారి కోసం ఈ మూవీ సజ్జెషన్. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఓ లుక్ వేసేయండి.

OTT Suggestions- Anukunnadi Okkati Ayindi Okkati: ఓటీటీ లో ఉన్న సినిమాలన్నీ చూసేసి.. ఇంకా ఇంట్రెస్టింగ్ సినిమాలు చూడాలని సెర్చ్ చేసే వారి కోసం ఈ మూవీ సజ్జెషన్. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఓ లుక్ వేసేయండి.

వారం వారం ఓటీటీ లో వచ్చే సినిమాలన్నిటిని కూడా ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. పైగా వాటిలో ఏ సినిమాలు చూడాలో ఏ సినిమాలో వీకెండ్ కు బెస్ట్ సజ్జెషన్ అని కూడా.. ఎప్పటికప్పుడు ఓటీటీ మూవీస్ కు సంబంధించిన అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు వచ్చే సినిమాలను చూస్తూ.. ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న ఇంట్రెస్టింగ్ సినిమాలను మిస్ చేసేస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ సినిమా గురించే సినిమా వచ్చినట్లు కూడా దాదాపు ఎవరికీ తెలీదు. కానీ ఈ సినిమాను చూసిన తర్వాత మాత్రం.. ఇలాంటి సినిమాను ఎలా మిస్ చేశాం అనే ఫీలింగ్ వస్తుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ముందు ఈ సినిమా కథేంటో చూసేద్దాం.. ఈ సినిమా కథేంటంటే.. ఈ మూవీ కథ ఓ నలుగురు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందులో ముగ్గురు అమ్మాయిలో చక్కగా జాబ్స్ చేసుకుంటూ.. వాళ్లకు నచ్చినట్లు లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటారు. ఇంకొక అమ్మాయి సిద్ది మాత్రం పెళ్లి చేసుకుని.. అసంతృప్తితో బ్రతికేస్తుంది. ఇక ఈ నలుగురు స్నేహితులు తమ ఫ్రెండ్ పెళ్లి కోసమని గోవా వెళ్తారు. చక్కగా తమ ఫ్రెండ్ పెళ్ళిలో ఎంజాయ్ చేద్దాం అనుకునే వారికి.. కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురౌతాయి. అక్కడ వారు ఒకరిని హత్య చేయాల్సి వస్తుంది. సరదాగా సమయాన్ని గడుపుదాం అనుకునే వారు ఎందుకు హత్య చేయాల్సి వస్తుంది? వారు హత్య చేసింది ఎవరిని ? వారిని బ్లాక్ మెయిన్ చేసిన వ్యక్తి ఎవరు ? హత్య చేసి ఆ డెడ్ బాడీ ని వారు ఏం చేస్తారు ? ఈ విషయం పోలీసులకు తెలుస్తుందా ? చివరకు అసలు ఏం జరిగింది ? ఈ సంఘటన వలన వారి జీవితాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా మరేదో కాదు.. ధన్యా బాలకృష్ణ, కోమలీ ప్రసాద్, త్రిధా చౌదరి , సిద్ది ఇద్నానీ కలిసి నటించిన “అనుకున్నది ఒకటి అయింది ఒకటి” మూవీ . ఈ సినిమా ప్రస్తుతం ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఇలాంటి మర్డర్ మిస్టరీ , సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చాలానే వచ్చాయి కానీ.. నలుగురు అమ్మాయిలు కలిసి ఓ మర్డర్ చేసి.. దాని నుంచి ఎలా తప్పించుకున్నారు అనే కాన్సెప్ట్ మాత్రం.. ఈ సినిమాను చివరి వరకు కదలకుండా కూర్చుని చూసేలా చేస్తుంది. అక్కడక్కడ కాస్త బో*ల్డ్ డైలాగ్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా క్రైమ్ కామెడీ మూవీస్ చూడాలనుకునే వారికి ఈ మూవీ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments