iDreamPost
android-app
ios-app

OTTలో ది బెస్ట్ సైన్స్ ఫిక్షన్ సిరీస్.. స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం!

OTT Suggestions- Best Sci Fi Series The Fringe: ఓటీటీలో ఒక మంచి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ కోసం మీరు వెయిట్ చేస్తుంటే.. మీకోసం ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ తీసుకొచ్చాం. ఇది స్టార్ట్ చేస్తే మాత్రం ఆపడం కష్టం అనే చెప్పాలి.

OTT Suggestions- Best Sci Fi Series The Fringe: ఓటీటీలో ఒక మంచి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ కోసం మీరు వెయిట్ చేస్తుంటే.. మీకోసం ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ తీసుకొచ్చాం. ఇది స్టార్ట్ చేస్తే మాత్రం ఆపడం కష్టం అనే చెప్పాలి.

OTTలో ది బెస్ట్ సైన్స్ ఫిక్షన్ సిరీస్.. స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం!

ఓటీటీల్లో చాలానే సినిమాలు, వెబ్ సిరీస్లు అందుబాటులో ఉంటాయి. కానీ, వాటిలో ఏవి చూడాలో? పెద్దగా అవగాహన ఉండదు. కానీ, మీకోసం మేము సజీషన్స్ రూపంలో చాలానే సినిమాలు, వెబ్ సిరీస్లు తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఒక క్రేజీ సిరీస్ ని తీసుకొచ్చాం. మీరు ఫ్రీగా ఉన్నప్పుడే ఈ సిరీస్ ని స్టార్ట్ చేయడం మంచిది. ఎందుకంటే ఈ సిరీస్ ని స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం. అంత గొప్ప స్టోరీ ఆ అంటే.. అవును అనే చెపాల్లి. ఇది ఒక బెస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమా అనమాట. అందులోనూ భవిష్యత్తుకు, వర్తమానానికి, గతానికి మధ్య ముడిపెడుతూ సాగే ఈ సిరీస్ మీకు గూస్ బంప్స్ ఇస్తుంది. మరి.. ఆ సిరీస్ ఏది? ఎందుకు అంత స్పెషలో చూద్దాం.

సైన్స్ ఫిక్షన్ మూవీస్ అంటే కచ్చితంగా మీకు హాలీవుడ్ గుర్తొస్తుంది. అయితే ఇటీవల ఆరంభం అని తెలుగులో కూడా ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వచ్చింది. ఆ మూవీ ప్రముఖ ఓటీటీ ఆహాలో అందుబాటులో ఉంది. అయితే అలాంటి ఒక కాన్సెప్ట్ తో ఎప్పుడో ఒక సైన్స్ ఫిక్షన్ సిరీస్ వచ్చింది. ఇది ఆరంభం మూవీకంటే మీకు డబుల్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఆ వెబ్ సిరీస్ ఓటీటీలో అందుబాటులోనే ఉంది. అయితే దాని గురించి మనకు ఎక్కువగా తెలియకపోవడం వల్లే ఇంకా మన ఓటీటీ ఆడియన్స్ ఆ సిరీస్ ని చూడలేదు. కానీ, కచ్చితంగా చూడాల్సిన లిస్టులో ఆ సిరీస్ పేరు ఉంటుంది. ఇంకా మీరు ఆ సిరీస్ ని చూడకపోతే ఒకసారి కచ్చితంగా ట్రై చేయచ్చు. పైగా ఫ్రీగానే ఆ సిరీస్ ని చూడచ్చు.

ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఒక మ్యాడ్ సైంటిస్ట్ ఉంటాడు. అతను కాలంతో పోటీ పడటమే కాదు.. ఆ కాలాన్నే దేచుకుంటాడు. అంటే సమయాన్ని చీట్ చేస్తూ ఉంటాడు. ఎన్నో ప్రయోగాలు చేస్తాడు. ఎవరికీ సాధ్యంకాని ఎన్నో కేసులను కూడా సాల్వ్ చేస్తాడు. అయితే అతనికి ఒక కష్టతరమైన కేసు వస్తుంది. అది కూడా భవిష్యత్తు నుంచి వస్తుంది. అది ప్రపంచంలో ఉన్న మానవాళికి ప్రమాదంగా మారుతుంది. ఆ సైంటిస్ట్ గనుక ఆ కేసును సాల్వ్ చేయకోపోతే మానవ జాతి అంతరించి పోతుంది. అలాంటి ఒక కష్టమైన టాస్కును అతను సరిగ్గానే చేశాడా? అనేదే ఇక్కడ ప్రశ్న. ఈ వెబ్ సిరీస్ పేరు ‘ఫ్రింజ్’ ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. కానీ, భారత్ స్ట్రీమింగ్ కావడం లేదు. అయితే మీరు ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో ఈ సిరీస్ ని చూడచ్చు. ఈ సిరీస్ ని చూసేందుకు క్లిక్ చేయండి.