iDreamPost
android-app
ios-app

OTTలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ! ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం!

OTT Suggestions- Best Love Story Float Movie: ఓటీటీల్లో ఒక మంచి లవ్ స్టోరీ చూడాలి అని మీరు అనుకుంటుంటే మాత్రం కచ్చితంగా మీకు ఈ మూవీ నచ్చేస్తుంది. నిజానికి హాలీవుడ్ మూవీ అయినా కూడా.. కథలో మాత్రం తెలుగు మూవీని గుర్తు చేస్తుంది. ఇందులో మంచి ఎమోషన్ కూడా ఉంటుంది.

OTT Suggestions- Best Love Story Float Movie: ఓటీటీల్లో ఒక మంచి లవ్ స్టోరీ చూడాలి అని మీరు అనుకుంటుంటే మాత్రం కచ్చితంగా మీకు ఈ మూవీ నచ్చేస్తుంది. నిజానికి హాలీవుడ్ మూవీ అయినా కూడా.. కథలో మాత్రం తెలుగు మూవీని గుర్తు చేస్తుంది. ఇందులో మంచి ఎమోషన్ కూడా ఉంటుంది.

OTTలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ! ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం!

తెలుగు ప్రేక్షకులకు ప్రేమకథలు అంటే పిచ్చి. కచ్చితంగా ఓటీటీల్లో లవ్ స్టోరీలను తెగ చూసేస్తూ ఉంటారు. అంటే ఈ మధ్య ఎక్కువగా రావడం లేదు కాబట్టి.. ఎవప్పటివో కూడా వెతికి వెతికి చూసేస్తున్నారు. అలాంటి అలవాటు మీకు కూడా ఉంటే మాత్రం మీరు ఈ ప్రేమకథను కచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే ఇది మామూలు ప్రేమకథ కాదు.. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది. పైగా ఇది హాలీవుడ్ నుంచి వచ్చిన కథ. కానీ, మీకు ఎక్కడా కూడా తెలుగు సినిమాకి తక్కువ కాదు. ఒకానొక పాయింట్లో ఇది టాలీవుడ్ ప్రేమకథలను కూడా మరిపించే స్థాయికి వెళ్లిపోతుంది. కథ పరంగా ఇది మాత్రం అదిరిపోయే లవ్ స్టోరీ అనే చెప్పాలి.

సాధారణంగా ప్రేమకథలు ఇష్టపడే వారికి కథ స్లోగా.. మంచి పాయింట్ మీద సాగాలి అని కోరుకుంటారు. ఇది సరిగ్గా అలాగే సాగుతుంది. ఏదో సరదాగా సమ్మర్ వెకేషన్ కి తన ఆంటీ ఇంటికి వచ్చిన అమ్మాయి.. అక్కడ ఉండే ఒక అబ్బాయి ప్రేమలో పడిపోతుంది. ఇంతకన్నా ఎంగేజింగ్ పాయింట్ ఏముంటుంది చెప్పండి. ఎందుకంటే ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అయ్యేది కాబట్టి. ఆ ఊరిలో ఆ సమ్మర్ గడిపేసి వెళ్లిపోవాలి అనుకుంటుంది. కానీ, అక్కడ ఆ కుర్రాడితో ఏర్పడిన పరిచయం ఆమెను ఆ ఊరు వదిలి వెళ్లనివ్వదు. ఫ్రెండ్స్ తో కలిసి ఒక సరస్సు దగ్గరకు వెళ్తారు. అక్కడ అనుకోకుండా హీరోయిన్ ని సరసులో తోసేస్తారు. పైకి వస్తుందిలే అనుకుంటారు. కానీ, ఆమెకు ఈత రాదు. వెంటనే హీరో ఆమెను కాపాడతాడు.

హీరోయిన్ కు ఈత రాదని తెలుసుకుని.. ఆమెకు ఈత నేర్పించేందుకు సిద్ధమవుతాడు. ఎందుకంటే ఆమెతో కలిసి టైమ్ స్పెండ్ చేయచ్చు అని. హీరోయిన్ కూడా అడుగుతుంది ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావ్ అని. అందుకు నీతో ఉండచ్చు కదా అని చెప్తాడు. అలాగే వాళ్లిద్దరు ప్రేమలో పడిపోతారు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా. అయితే ఇక్కడే అసలు ట్విస్టు వస్తుంది. వేరే సిటీలో హీరోయిన్ కి డాక్టర్ కోర్సులో సీటు వస్తుంది. మరి.. అక్కడి నుంచి వెళ్లిపోతుందా? అతడిని వదిలేస్తుందా? అసలు వారి ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనేది మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. చూస్తున్నంతసేపు మాత్రం మిమ్మల్ని మీరు మర్చిపోతారు. అయితే ఇది స్విమ్మింగ్ బేస్డ్ కాబట్టి.. పిల్లలతో కలిసి చూడొద్దు. ఈ మూవీ పేరు ‘ఫ్లోట్’. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో రూ.149కి రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది.