iDreamPost
android-app
ios-app

OTTలో బెస్ట్ లవ్ స్టోరీ.. యూత్ తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది!

OTT Suggestions Best Love Story Chemical Hearts: ఓటీటీలో చాలానే లవ్ స్టోరీలు ఉన్నాయి. కానీ, కొన్ని మాత్రం ది బెస్ట్ అనిపిస్తాయి. ఈ లవ్ స్టోరీ కూడా ఆ కోవకు చెందిందే. ముఖ్యంగా యూత్ ఈ లవ్ స్టోరీ చూడాల్సిందే.

OTT Suggestions Best Love Story Chemical Hearts: ఓటీటీలో చాలానే లవ్ స్టోరీలు ఉన్నాయి. కానీ, కొన్ని మాత్రం ది బెస్ట్ అనిపిస్తాయి. ఈ లవ్ స్టోరీ కూడా ఆ కోవకు చెందిందే. ముఖ్యంగా యూత్ ఈ లవ్ స్టోరీ చూడాల్సిందే.

OTTలో బెస్ట్ లవ్ స్టోరీ.. యూత్ తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది!

టీనేజ్, కాలేజ్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో స్వీట్ మెమొరీస్ అనే చెప్పాలి. ఎంత ఖర్చు పెట్టినా మీరు ఆ రోజులను తిరిగి తెచ్చుకోలేరు. పోయిన యవ్వనాన్ని, కాలేజ్ రోజులను మళ్లీ జీవించలేరు. కాకపోతే ఆ రోజులను సరదాగా గుర్తు చేసుకుని ఆ క్షణాన్ని ఫీల్ అవ్వడమే. అలా మళ్లీ మీ టీనేజ్ ని గుర్తు చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీకోసం ఈ మూవీ కచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఏం చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం? అనే ప్రశ్నలకు సమాధానం లేకుండా ఏదో ఒకటి చేసేసే వయసు అది. అయితే లైఫ్ లో అన్నీ మంచి పనులే చేయం కదా.. కొన్ని తప్పులు కూడా ఉంటాయి. ఇలాంటి ఒక మంచి పాయింట్ తో వచ్చిందే ఈ మూవీ.

లైఫ్ లో ఏదీ మనం అనుకున్నట్లు జరగదు. మన స్క్రీప్ట్ మనకు ఉంటే.. జరగాల్సింది జరిగిపోతూనే ఉంటుంది. లైఫ్, భవిష్యత్, జీవితం గురించి పెద్దగా ఆలోచనలు, కోరికలు, అనుమానాలు లేకుండా లీడ్ చేసే లైఫ్ కాలేజ్ లైఫ్. ఇక్కడ చదువుకోమని చాలా మంది చెప్తారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే చదువుకుంటారు. అలాంటి ఒక కాలేజ్ లైఫ్ గురించి చెప్పేదే ఈ సినిమా. మనకు, విదేశాల్లో కాలేజ్ లైఫ్ కి చాలా తేడా ఉంటుంది. అక్కడ స్వేచ్ఛ కాస్త ఎక్కువగానే ఉంటుంది.

Chemical Hearts

కానీ, అంత స్వేచ్ఛ ఉన్నా కూడా మన హీరో మాత్రం ఎందుకో వెనుకబడి పోయి ఉంటాడు. తన వయసులో అందరూ ఒక భాగస్వామిని వెతుక్కున్నా మనోడు మాత్రం సింగిల్ గానే ఉంటాడు. అలాంటి వాడి లైఫ్ లోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆమె వచ్చిన తర్వాత ఈ హీరో లైఫ్ మొత్తం మారిపోతుంది. ఆమెతో మాట కలుపుతాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమెను తన దాన్ని చేసుకోవడం కోసం చాలానే కష్టపడతాడు. కానీ, ఆమె ఒక పట్టాన హీరోని ఇష్టపడదు. ఎందుకంటే ఆమె ఒక ప్రమాదంలో తన కాలును పోగొట్టుకున్నంత పని చేస్తుంది. కర్ర సాయం లేకపోతే నడవలేని పరిస్థితి.

హీరోయిన్ గోల్ మొత్తం తన కాలును సరిచేసుకోవడం మీదే ఉంటుంది. అందుకే హీరోని పెద్దగా పట్టించుకోదు. ఈ మూవీలో ఓవరాల్ గా చెప్పదలుచుకున్న మెసేజ్ ఏంటంటే.. కాలేజ్ లైఫ్ లో చాలానే అద్భుతాలు జరుగుతాయి. అలాగే కొంత చెడు కూడా జరగచ్చు. కానీ, నీ లైఫ్ లో ఏది జరిగినా కూడా.. నీకు ఎంతో కొంత నేర్పుతుంది అనే పాయింట్ మీద వచ్చింది. ఈ మూవీ పేరు ‘కెమికల్ హార్ట్స్’. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి