iDreamPost

ఆ ఫ్యామిలీని చూస్తే సిటీనే వణికిపోతుంది.. OTTలో బెస్ట్ కొరియన్ డ్రామా!

OTT Suggestions- Best Korean Drama In Telugu: మీరు ఇప్పటివరకు చాలానే కొరియన్ డ్రామాలు చూసుంటారు. అందులో ఎక్కువగా లవ్ స్టోరీలు ఉండి ఉంటాయి. కానీ, ఒక యాక్షన్ థ్రిల్లర్ చూశారా? ఈ కొరియన్ డ్రామా సిరీస్ చూస్తే వావ్ అనేస్తారు.

OTT Suggestions- Best Korean Drama In Telugu: మీరు ఇప్పటివరకు చాలానే కొరియన్ డ్రామాలు చూసుంటారు. అందులో ఎక్కువగా లవ్ స్టోరీలు ఉండి ఉంటాయి. కానీ, ఒక యాక్షన్ థ్రిల్లర్ చూశారా? ఈ కొరియన్ డ్రామా సిరీస్ చూస్తే వావ్ అనేస్తారు.

ఆ ఫ్యామిలీని చూస్తే సిటీనే వణికిపోతుంది.. OTTలో బెస్ట్ కొరియన్ డ్రామా!

మీరు ఒక మాటను అయితే బాగా వినే ఉంటారు. అదే.. కే డ్రామా. అదేనండి కొరియన్ డ్రామా. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా అంతా ఈ కొరియన్ డ్రామాలనే చూస్తున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే కొరియన్ కూడా మాట్లేడుస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ కే డ్రామాలకు అడిక్ట్ అయిపోతున్నారు. అలాంటి వారి కోసం ఒక బెస్ట్ కే డ్రామా తీసుకొచ్చాం. ఇది బెస్ట్ ఎందుకంటే కే డ్రామా రెగ్యులర్ ఫార్మాట్ లో ఉండే లవ్ స్టోరీ కాదు ఇది. ఇది ఒక సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. ఒక కుటుంబం చుట్టూ తిరిగే యాక్షన్ డ్రామా ఇది. మూడు తరాలు ఆ సిటీని తమ గుప్పిట్లో పెట్టుకుంటాయి. మరి.. ఆ సిరీస్ ఏది? ఆ కథ ఏంటో చూద్దాం.

కొరియన్ డ్రామాలు అంటే చాలా క్రేజ్ పెరిగిపోయింది. అమ్మాయిలు ఎక్కువగా చూసేస్తున్నారు. తెలుగులో లేకపోయినా కూడా డైరెక్ట్ కొరియన్ లోనే చూస్తున్నారు. అయితే మీకోసం తెలుగలో అందుబాటులో ఉన్న ఒక బెస్ట్ కొరియన్ డ్రామా తీసుకొచ్చాం. ఈ డ్రామాలో హైలెట్ పాయింట్ ఏంటంటే.. కథ మొత్తం ఒక కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ కుటుంబం ఒక సిటీనే శాసిస్తూ ఉంటుంది. ఆ సిటీ మొత్తం ఈ కుటుంబాన్ని చూస్తే వణికిపోతుంది. అలాంటి కుటుంబంలో చాలానే సీక్రెట్స్ ఉంటాయి. సాధారణంగా ఒక కుటుంబం చేతిలో పవర్ ఉంది అంటే.. ఆ కుటుంబంలో వాళ్లే దాని కోసం కొట్లాడుతూ ఉంటారు.

ఈ కుటుంబం పేరు జాంగ్. ఈ జాంగ్ కుటుంబం బక్చియోన్ సిటీన్ ఏకంగా మూడు జనరేషన్స్ గా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ సిటీలో ఏం జరగాలి అన్నా ఆ కుటుంబం కనుసన్నల్లోనే జరగాలి. అలాంటి కుటుంబంలో పొరపొచ్చాలు ఉన్నాయని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ కుటుంబంలో పవర్ మాత్రమే కాదు.. సీక్రెట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఒకరంటే ఒకరికి అసూయ, ఈర్ష్య, ముఖ్యంగా అధికార దాహం అనేవి ఉంటాయి. అధికారం కోసం ఆడే ఆటలు ఎక్కువ ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. ఇది ఒక వెబ్ సిరీస్. దీని పేరు ‘అన్ టచబుల్స్’. ఇది సౌత్ కొరియా వెబ్ సిరీస్. కానీ, తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ యాక్షన్ థ్రిల్లర్ కచ్చితంగా నచ్చుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే సస్పెన్స్ ఎలిమెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. మరి.. ఈ అన్ టచబుల్ కొరియన్ సిరీస్ గనుక చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి