iDreamPost
android-app
ios-app

OTTలో బుర్రపాడు చేసే చిత్రం.. పిల్లలు- హార్ట్ పేషెంట్స్ చూడొద్దు!

OTT Suggestions- Best Horror Movie Low Lifes: ఒక మంచి హారర్ చిత్రం చూడాలి అనుకుంటున్నారు. అయితే మీకోసం ఒక బుర్రపాటు హారర్ చిత్రం తీసుకొచ్చాం. ఇది దెయ్యాలు ఉండే హారర్ చిత్రం కాదండోయ్.. వెన్నులో వణుకు పుట్టించే హారర్ చిత్రం.

OTT Suggestions- Best Horror Movie Low Lifes: ఒక మంచి హారర్ చిత్రం చూడాలి అనుకుంటున్నారు. అయితే మీకోసం ఒక బుర్రపాటు హారర్ చిత్రం తీసుకొచ్చాం. ఇది దెయ్యాలు ఉండే హారర్ చిత్రం కాదండోయ్.. వెన్నులో వణుకు పుట్టించే హారర్ చిత్రం.

OTTలో బుర్రపాడు చేసే చిత్రం.. పిల్లలు- హార్ట్ పేషెంట్స్ చూడొద్దు!

సాధారణంగా చాలా మంది హారర్ చిత్రాలు అంటే ఇష్టపడుతూ ఉంటారు. కానీ, అలాంటి వాళ్లు కూడా ఈ సినిమా చూడాలి అంటే కచ్చితంగా కాసేపు ఆలోచించాల్సిందే. ముందే మాట్లాడుకుందాం. ఈ సినిమాని పిల్లలతో చూడొద్దు. హార్ట్ పేషెంట్స్ అయితే అస్సలు చూడొద్దు. ఎందుకంటే చూసి తట్టుకునే అంత గుండెధైర్యం ఉంటేనే ఈ చిత్రాన్ని చూడాలి. ఇందులో వచ్చే ట్విస్టులు.. జరిగే సన్నివేశాలు చూస్తే అల్లాడిపోతారు. ఒక్కోసారి అరె బాప్ ఏ క్యా హోగయా అంటూ నోరెళ్లబెట్టాల్సిందే. మరి.. ఆ సినిమా ఏది? అసలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అంత బుర్రపాడు చేసేలా ఇందులో ఏం కథ ఉంది అనే విషయాలు తెలుసుకుందాం.

ఈ కథ ఒక కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భార్యాభర్తలు.. వారికి ఒక అబ్బాయి – ఒక అమ్మాయి ఉంటారు. ఆ కుటుంబానికి ఏడాదికి ఒకసారి వెకేషన్ కి వెళ్లే అలవాటు ఉంటుంది. అలాగే మరోసారి వాళ్లు వెకేషన్ కు వెళ్తారు. వాళ్ల వెకేషన్ ను ఎంతో బాగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ, వారికి ఒక ఇద్దరు కుర్రాళ్లు తగులుతారు. వారిని ఊరికే విసిగిస్తూ ఉంటారు. ఒకసారి కాదు.. రెండుసార్లు వాళ్లను ఇబ్బంది పెట్టాలి అని చూస్తారు. రెండోసారి ఆ కుర్రాళ్ల కార్ ట్రబుల్ ఇస్తుంది. వారిలో ఒకరు ఈ కుటుంబంతో కలిసి బస్ ఎక్కుతాడు. అక్కడే కథ అసలు మలుపు తిరుగుతుంది.

ఆ కుర్రాడు మాటల్లో తన కుటుంబం గురించి పూర్తి వివరాలు చెప్తాడు. అలాగే ఆ కుటుంబంలో కుర్రాడిని కాస్త ఇబ్బంది పెడతాడు. ఇంకేముంది.. అతడిని హత్య చేస్తారు. అసలు అప్పటి వరకు ఆ కుటుంబం అంటే ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు. వాళ్లని చూస్తే జాలి కూడా వేస్తుంది. అరె ఇలాంటి ఇన్నోసెంట్ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారే అనే భావన కలుగుతుంది. కానీ, వాళ్ల నిజ స్వరూపం చూసిన తర్వాత కాసేపు బుర్ర పాడు అవుతుంది. మరి.. అంత మంచి పాయింట్ చెప్పి స్పాయిల్ చేశాను అని కంగారు పడకండి.

ఈ సినిమాలో అలాంటి ట్విస్టులు, చిత్రవిచిత్రాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. ఒక్కో సీన్ కి మీకు మైండ్ బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇందులో వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొట్టుకోటాలు ఏమీ ఉండవు. నేరుగా చంపుకోవడమే. గొడ్డలి తీసుకుని ఒక్కో వేటుకు ఒకరిని లేపేస్తూ ఉంటారు. అందుకే ఈ సినిమాకి పిల్లలను దూరంగా ఉంచండి అని చెప్పింది. అలాగే హార్ట్ పేషెంట్స్ కూడా ఈ చిత్రాన్ని చూడకపోవడమే చాలా మంచిది. ఈ సినిమా పేరు “లో లైఫ్స్”. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇండియాలో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాదు. కాబట్టి మీరు యూట్యూబ్ లో కూడా ఈ సినిమా పేరు సెర్చ్ చేసి చూడచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి