OTT Suggestions- Wrath Of Man: కొడుకు హత్యకు.. తండ్రి తీర్చుకున్న రివేంజ్.. OTTలో బెస్ట్ యాక్షన్ మూవీ!

కొడుకు హత్యకు.. తండ్రి తీర్చుకున్న రివేంజ్.. OTTలో బెస్ట్ యాక్షన్ మూవీ!

OTT Suggestions- Wrath Of Man: ఓటీటీలో బెస్ట్ యాక్షన్ చిత్రం చూడాలి అని మీరు అనుకుంటే మాత్రం.. ఈ చిత్రాన్ని అస్సలు మిస్ కావొద్దు. యాక్షన్ మాత్రమే కాదు.. మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. అలాగే ట్విస్టులు కూడా అద్భుతంగా ఉంటాయి.

OTT Suggestions- Wrath Of Man: ఓటీటీలో బెస్ట్ యాక్షన్ చిత్రం చూడాలి అని మీరు అనుకుంటే మాత్రం.. ఈ చిత్రాన్ని అస్సలు మిస్ కావొద్దు. యాక్షన్ మాత్రమే కాదు.. మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. అలాగే ట్విస్టులు కూడా అద్భుతంగా ఉంటాయి.

మీరు ఎంత యాక్షన్ సినిమా చూడాలి అనుకున్నా దానిలో కచ్చితంగా.. లవ్ యాంగిలో, ఎమోషన్ యాంగిలో ఉండాల్సిందే. అలా లేకుండా అచ్చంగా యాక్షన్ బేస్ మీద సినిమా నడవడం అసాధ్యం అవుతుంది. అంటే హీరో చేసే హింసాకాండకు తనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం కోసం మన హీరో పోరాడుతూ ఉండాలి. ఆ పోరాటంలో తనకు ఎదురయ్యే సవాళ్లను దాటుకుంటూ క్లైమ్యాక్స్ కి రావాలి. అలాంటి పాయింట్స్ కోరుకునే వారికోసం ఒక బెస్ట్ యాక్షన్ సినిమా తీసుకొచ్చాం. ఈ మూవీలో మీకు టన్నుల కొద్దీ యాక్షన్ ఉంటుంది. క్వింటాళ్ల కొద్దీ ఎమోషన్ ఉంటుంది. అన్నింటికి మించి ర*క్తం ఏరులైపారుతుంది.

సాధారణంగా హీరోకి ఒక లక్ష్యం ఉండాలి అని చెప్పుకున్నాం కదా? ఇందులో హీరోకి ఉన్న లక్ష్యం ఏంటంటే.. తన కుమారుడిని చంపింది ఎవరో తెలుసుకోవాలి. అందుకోసం హీరో చేయని ప్రయత్నం ఉండదు. అయితే కొంత సమాచారం అందుకున్న తర్వాత యాక్షన్ లోకి దిగుతాడు. ఒక మనీ ట్రాన్స్ పోర్ట్ వాహనంలో దొంగతనం చేస్తున్న క్రమంలో తన కుమారుడిని హత్య చేస్తారు. అలాగే హీరోకి కూడా బుల్లెట్లు తగులుతాయి. చాలా కష్టం మీద హీరో ప్రాణాలతో బయటపడతాడు. ఆ తర్వాత ఆ కిల్లర్స్ కోసం వెతుకలాట మొదలు పెడతాడు. కానీ, అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. కానీ, అందుకోసం వెనకడుగు మాత్రం వేయడు.

హీరో తన కుమారుడి హంతకులను పట్టుకునేందుకు ఒక మార్గం ఎంచుకుంటాడు. ఆ సెక్యూరిటీ వ్యాన్ సర్వీస్ ప్రొవైడర్లో చేరతాడు. లోపలి నుంచే అసలు ఆ హత్య చేసింది ఎవరు అని వెతికే పని మొదలు పెడతాడు. ఆ క్రమంలో అతనికి విస్తుపోయే విషయాలు తెలుస్తాయి. ఒకటి కాదు రెండు కాదు.. అలాంటి దోపిడీలు చాలానే జరిగాయి. అందుకు కారకులు కూడా అందులోనే ఉంటారు. అది హీరో కనిపెట్టాడా? తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా? అనేదే పాయింట్

తన కుమారుడి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడా? అనేదే కథ. ఇక్కడ సినిమాలో చాలానే యాక్షన్ ఉంటుంది. ఒకటి కాదు రెండు కాదు.. టన్నుల కొద్దీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అలాగే ఇందులో హీరో ఎవరో కాదు.. జేసన్ స్టేథం. ఈ పేరు విన్న తర్వాత మీకు ఈ మూవీ మీద కచ్చితంగా నమ్మకం పెరిగే ఉంటుంది. ఎందుకంటే జేసన్ స్టేథం సినిమాలు అన్నీ ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉంటాయి కాబట్టి. మీ అంచనాలను ఏమాత్రం ఈ మూవీ తగ్గించదు. ఈ సినిమా పేరు ‘వ్రాథ్ ఆఫ్ మెన్’. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లైన్స్ గేట్ లో అందుబాటులో ఉంది. మరి.. ఈ వ్రాత్ ఆఫ్ మెన్ సినిమా చూడాలి అనుకుంటే క్లిక్ చేయండి.

Show comments