OTT లో ఈ ట్రెషర్ హంట్ మూవీ మిస్ చేశారా! ఇదొక మాస్టర్ పీస్!

OTT Best Treasure hunt Movie: ట్రెషర్ హంట్ గేమ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ గేమ్ ఆడడానికే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాంటిది ఇలాంటివి సినిమాలలో చూపిస్తే.. అవి ఇంకాస్త కిక్ ఇస్తాయి. మరి ఇప్పుడు చెప్పుకోబోయే మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Treasure hunt Movie: ట్రెషర్ హంట్ గేమ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ గేమ్ ఆడడానికే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాంటిది ఇలాంటివి సినిమాలలో చూపిస్తే.. అవి ఇంకాస్త కిక్ ఇస్తాయి. మరి ఇప్పుడు చెప్పుకోబోయే మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఇప్పటివరకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ , హర్రర్ మిస్టరీస్ ఇంకా చెప్పాలంటే.. నిజ జీవిత కథల నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుని రూపొందించిన సినిమాలను కూడా చూసి ఉంటారు. కానీ ఇలాంటి సినిమాను మాత్రం చూసి ఉండరు. ఎందుకంటే ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ… అందరికి ట్రెషర్ హంట్ గేమ్ గురించి తెలిసే ఉంటుంది. చాలా మంది ఈ గేమ్ ను ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఆడుతూ ఉంటారు. అలాంటిది ఓ మూవీ మొత్తం ఇలాంటి కాన్సెట్ ఏ ఉంటే.. ఇంకా చివరి వరకు ఈ సినిమాను కదలకుండా కూర్చుని చూస్తారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటి.. ఈ సినిమాను మీరు చూశారా లేదా .. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఈ మూవీ కథ విషయానికొస్తే.. ఒక పాడుపడిన అంతఃపురంలో.. ఓ వ్యక్తి వెలకట్టలేని పూర్వకాలం వస్తువులను వేలం వేస్తూ ఉంటాడు. అది కూడా కేవలం త్రాగడం కోసమే ఆ వస్తువులను చాలా తక్కువ ధరకు అమ్ముతూ ఉంటాడు. వాటిలో ఓ తల్వార్ ఉంటుంది. దానిని ఇలాంటి పురాతన వస్తువుల మీద రీసెర్చ్ చేసే సోమనాధ్ అనే వ్యక్తి కొంటాడు. పైగా ఆ రాజు వంద రూపాయలకే ఇచ్చేస్తాను అన్నా సరే.. వెయ్యి రూపాయలు పెట్టి దానిని కొంటాడు. ఆ తల్వార్ విలువ రాజుకి తెలియకపోయినా.. అతనికి మాత్రం బాగా తెలుసు. ఇక ఈ విషయాన్నీ సిటీ లో ఉండే తన ఫ్రెండ్ కు చెప్పగానే అతని ముఖం వెలిగిపోతుంది. కట్ చేస్తే సోమనాథ్ ఇంటికి ఓ స్మగ్లర్ వస్తాడు. అతను కూడా ఆ తల్వార్ కోసమే అక్కడకు వస్తాడు. కానీ సోమనాథ్ దానిని ఇవ్వనంటే ఇవ్వను అని అంటాడు. అయితే ఈ స్మగ్లర్ ను పట్టుకోడానికి ఓ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అతనిని కూడా స్మగ్లర్ చంపేస్తాడు. ఈ హత్యను సోమనాథ్ చూడడంతో.. అతనిని కూడా చంపేస్తాడు ఆ స్మగ్లర్.

కట్ చేస్తే ఇప్పుడు మూవీ ప్రెసెంట్ లో చూపిస్తాడు. ఇక్కడ సోమనాథ్ ఫ్రెండ్ అతని కూతురుని చూపిస్తాడు. ఇతని ఇంటికి స్కాలర్ షిప్ కోసం హీరో వస్తాడు. హీరోకు కూడా చరిత్ర మీద చాలా పట్టు ఉంటుంది. అయితే అతను సోమనాథ్ గురించి హీరోకు చెప్తాడు. సోమనాథ్ చనిపోయే ముందు అతని కోసం ఓ నిధి దాచాడని కానీ అది రాబట్టాలంటే ఓ చిక్కు ప్రశ్నను సాల్వ్ చేయాలనీ చెప్తాడు. దీనితో హీరో సోమనాథ్ ఫ్రెండ్ కు హెల్ప్ చేస్తాడు. అసలు అక్కడ ఏమైంది ? ఆ నిధిని కనుక్కోడం వెనుక హీరోకు ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి ? అతను వాటిని ఎలా సాల్వ్ చేస్తాడు ? సోమనాథ్ అతని ఫ్రెండ్ కోసం ఎలాంటి నిధిని దాచి ఉంచుతాడు ? చివరికి హీరో ఈ మిస్టరీని ఎలా చేధించాడు? ఇవన్నీ తెలియాలంటే.. “అలీనగరేర్ గోలోకధాధ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేస్ లో అందుబాటులో ఉంది. అలాగే యూట్యూబ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే.. వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. OTT లో బెస్ట్ 10 మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. వీటిని కానీ మిస్ చేశారా?

Show comments