Tirupathi Rao
Pekamedalu OTT Release: టాలీవుడ్ లో చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన పేకమేడలు సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.
Pekamedalu OTT Release: టాలీవుడ్ లో చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన పేకమేడలు సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.
Tirupathi Rao
చిన్న సినిమాగా వచ్చి.. పెద్ద రీసౌండ్ చేసిన మూవీస్ టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో మాత్రం పేకమేడలు చిత్రం తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఒక చిన్న మూవీగా థియేటర్లలో విడుదలై ఆ తర్వాత క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలు కాదు. ఈ సినిమా హీరో వినోద్ కిషన్ చేసిన వినూత్న ప్రచారం ఈ మూవీపై ఆసక్తిని రేకెత్తించాయి. జులై 19న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి అప్లాజ్ సొంతం చేసుకుంది. థియేటర్లో చూసిన వాళ్లు.. చూడని వాళ్లు అంతా ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. ఆ రోజు రానే వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
పేకమేడలు సినిమాకి తెలుగులో వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఈ మూవీకి ముఖ్యంగా కథ ప్రధాన బలం అని చెప్పాలి. ఆ తర్వాత హీరో వినోద్ కిషన్- హీరోయిన్ అనూష కృష్ణ అనే చెప్పాలి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇలాంటి ఒక గ్రిప్పింగ్ కథ ఉంటే కచ్చితంగా ఆడియన్స్ ని సీట్లకు అతుక్కునేలా చేయచ్చు అని నిరూపించారు. ఈ మూవీ ఇప్పుడు ఆగస్టు 15న ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ వచ్చేస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. గురువారం నుంచి ఈవీవీ విన్ లో స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు.
లక్ష్మణ్(వినోద్ కిషన్) బీటెక్ చేస్తాడు. కానీ, ఎలాంటి జాబ్ చేయకుండా.. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ రూ.కోట్లు సంపాదించాలి అని పగటి కలలు కంటూ ఉంటాడు. ఇంటిని పోషించాల్సిన భర్త పట్టించుకోకపోతే అతని భార్య వరలక్ష్మి(అనూష కృష్ణ) చిన్నాచితక పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. ఒక చిన్న బిజెనెస్ స్టార్ట్ చేసి తన కొడుకుని మంచిగా చదివించుకోవాలి అనేది ఆమె ఆశయం. మరోవైపు లక్ష్మణ్ కు ఒక ఎన్నారై మహిళ పరిచయం అవుతుంది. ఆమె ద్వారా అయినా లైఫ్ లో సెటిల్ కావాలి అనుకుంటాడు. అలాంటి లక్ష్మణ్ లైఫ్ లో సెటిల్ అయ్యాడా? వరలక్ష్మి బిజినెస్ స్టార్ట్ చేసిందా? అనేదే పేకమేడలు సినిమా మిగిలిన కథ.