iDreamPost
android-app
ios-app

OTTలో తెలుగులోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

OTT New Releases- Block Buster Movie Now Streaming In Telugu: ఓటీటీలో ఒక బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులోకి వచ్చేసింది. ఒక్క్ తెలుగే కాదు.. ఇప్పుడు హిందీ సహా మలయాళం, తమిళ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ ఏంటో చూద్దాం.

OTT New Releases- Block Buster Movie Now Streaming In Telugu: ఓటీటీలో ఒక బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులోకి వచ్చేసింది. ఒక్క్ తెలుగే కాదు.. ఇప్పుడు హిందీ సహా మలయాళం, తమిళ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ ఏంటో చూద్దాం.

OTTలో తెలుగులోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

ఓటీటీలోకి చాలానే మంచి సినిమాలు, బ్లాక్ బస్టర్స్ వస్తూ ఉంటాయి. కానీ, కొన్నిసార్లు మనం బాగా చూడాలి అనుకున్న మూవీ.. బాగా హిట్టు అయిన మూవీ తెలుగులో రాకపోవచ్చు. చాలామంది సబ్ టైటిల్స్ తో సినిమా చూసేస్తూ ఉంటారు. కానీ, చాలా మంది మాత్రం తెలుగులో వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి తెలుగులోకి ఆ మూవీ రాకపోవచ్చు. కానీ, ఇప్పుడు తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇప్పుడు మరిన్ని భాషల్లోకి వచ్చేసింది. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓటీటీలో ఈ మూవీకి పాన్ ఇండియా లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. కానీ, సౌత్ భాషల్లో లేకపోవడంతో ఓటీటీ ప్రేక్షకులు కాస్త నిరాశ చెందారు. ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది.

ఇప్పుడు చెప్పుకుంటున్న సినిమా మరేదో కాదు.. అజయ్ దేవ్ గణ్ హీరోగా వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా మైదాన్ గురించి. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చి చాలా రోజులే అవుతోంది. అప్పటి నుంచి ఓటీటీలో మంచి మంచి రికార్డులు క్రియేట్ చేసింది. నిజానికి థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినప్పటికీ.. ఓటీటీలో మాత్రం చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ సౌత్ భాషల్లోకి రావడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఎందుకంటే మైదాన్ సినిమా బాగుంది అని వింటున్నారు. కానీ, హిందీలో ఉండే సరికి చూడలేకపోతున్నారు. కానీ, ఇప్పుడు హిందీ సహా.. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మైదాన్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ఈ కథ 1952 హెల్సెంకీ ఒలింపిక్స్ నాటిది. ఆ ఒలింపిక్స్ లో భారత ఫుట్ బాల్ జట్టు ఘరో పరాభవాన్ని చవిచూస్తుంది. ఆడటానికి సరైన బూట్లు కూడా లేక భారత ఆటగాళ్లు గాయాలపాలవుతారు. మరోవైపు యుగోస్లోవియా ఏకంగా 10 గోల్స్ చేస్తుంది. భారత ఫుట్ బాల్ టీమ్ గురించి పత్రికలు తీవ్ర విమర్శలు చేస్తూ వార్తలు ప్రచురిస్తాయి. ఈ నేపథ్యంలో పరాజయం నుంచి జట్టు ఎలాంటి పాఠాలు నేర్చుకుంది. కోచ్ గా సయ్యద్ అబ్దుల్ రహీమ్(అజయ్ దేవ్ గణ్) ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? జట్టుకు అండగా ఎలా నిలబడ్డాడు? అసలు జట్టును ఎలా మార్చాడు? అనే అంశాల మీద ఈ కథ నడుస్తుంది. ఇది ఒక మంచి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీని చూసేందుకు క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి