Tirupathi Rao
OTT New Releases- Kung Fu Panda 4: ఎంత ఎదిగినా కూడా ఇంకా యానిమేటెడ్ సినిమాలను చూసే అభిమానులు అయితే కోట్లలోనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ సంఖ్య బాగానే అలాంటి వారికోసం కుంగ్ ఫూ పాండా 4 గురించి అదిరిపోయే న్యూస్ తీసుకొచ్చాం.
OTT New Releases- Kung Fu Panda 4: ఎంత ఎదిగినా కూడా ఇంకా యానిమేటెడ్ సినిమాలను చూసే అభిమానులు అయితే కోట్లలోనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ సంఖ్య బాగానే అలాంటి వారికోసం కుంగ్ ఫూ పాండా 4 గురించి అదిరిపోయే న్యూస్ తీసుకొచ్చాం.
Tirupathi Rao
ఎంత ఎదిగినా కూడా ఇప్పటికీ యానిమేషన్ సినిమాలు అంటే చెవి కోసుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా 90స్ కిడ్స్ అయితే యానిమేటెడ్ సినిమాలు అంటే ప్రాణం పెట్టేస్తారు. ఎందుకంటే వారి చైల్డ్ హుడ్ మొత్తం అలాంటి కార్టూన్స్, సినిమాలు చూసి పెరిగారు కాబట్టి. అలాంటి 90స్ కిడ్స్ కి ఈ కుంగ్ ఫూ పాండా సినిమా అంటే కూడా ఎంతో ఇష్టం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఈ మూవీని చూసి ఇష్టపడ్డారు. అందుకే ఈ సినిమా ఒక ఫ్రాంచైజ్ గా మారిపోయింది. సినిమాలే కాదు.. యానిమేటెడ్ టెలివిజన్ సిరీస్ కూడా స్టార్ట్ చేశారు. అలాంటి ఫ్రాంచైజ్ నుంచి సీక్వెల్ లో భాగంగా కుంగ్ ఫూ పాండా సీజన్ 4 వచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఓటీటీలో మాత్రం ఫ్రీగా స్ట్రీమింగ్ కి రాలేదు.
కుంగ్ ఫూ పాండాని థియేటర్లో మిస్ అయిన వాళ్లు.. థియేటర్లో చూసినా కూడా ఓటీటీలో చూడాలి అని వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు ఇది భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. కానీ, రెంట్ బేసిస్ మీద అందుబాటులో ఉంచారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మొదట రూ.299కు అందుబాటులోకి తీసుకురాగా.. ఇప్పుడు మాత్రం రూ.199కు అందుబాటులో ఉంది. అయితే ఇన్ని రోజులు అయినా ఫ్రీ స్ట్రీమింగ్ కి రాలేదు. కానీ, ఇప్పుడు మరో కొత్త ఓటీటీలోకి ఈ కుంగ్ ఫు పాండా 4 సినిమా అందుబాటులోకి రాబోతోంది. అది కూడా ఫ్రీగా స్ట్రీమింగ్ కి. అంటే వారి సబ్ స్క్రిప్షన్ కలిగి ఉంటే మీరు చూసేయచ్చు.
ఇప్పుడు కొత్తగా రాబోతోంది జియో సినిమాలోకి. జులై నెల 15 నుంచి ఈ మూవీ జియో సినిమాలో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే మీకు జియో సినిమా సబ్ స్క్రిప్షన్ లేకపోయినా కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే జియో సినిమా సబ్ స్క్రిప్షన్ నెలకు చాలా నామినల్ గానే ఉంటుంది. కాబట్టి మీరు కుంగ్ ఫూ పాండా సినిమా లవర్స్ అయితే మాత్రం కచ్చితంగా ఆ మూవీని తక్కువ ప్రీమియంతోనే చూసేయచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో అందుబాటులో ఉంచారు.
ఆ ప్రకారం చూస్తే.. జియో సినిమాలో కూడా ఈ మూవీ తెలుగులో ఉండేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి నచ్చిన సినిమాని మీరు మీకు నచ్చిన భాషలో చూసేయచ్చు. ఇన్నాళ్లు ఫ్రీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూసిన అందరికీ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి.. మీరు ఈ కుంగ్ ఫూ పాండా సినిమాని చూడాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ విషయాన్ని మీకు తెలిసిన కుంగ్ ఫూ పాండా లవర్స్ కి షేర్ చేయండి.