OTT Releases- Chandu Champion On Prime Video: OTTలోకి వచ్చేసిన బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

OTTలోకి వచ్చేసిన బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

OTT New Releases- Karthik Aryan Chandu Champion: ఓటీటీలోకి అదిరిపోయే స్పోర్ట్స్ డ్రామా వచ్చేసింది. ఈ మూవీ చూస్తే కచ్చితంగా ఎవరికైనా కళ్లు చెమర్చాల్సిందే. అలాగే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే విషయం కూడా క్లారిటీ వస్తుంది.

OTT New Releases- Karthik Aryan Chandu Champion: ఓటీటీలోకి అదిరిపోయే స్పోర్ట్స్ డ్రామా వచ్చేసింది. ఈ మూవీ చూస్తే కచ్చితంగా ఎవరికైనా కళ్లు చెమర్చాల్సిందే. అలాగే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే విషయం కూడా క్లారిటీ వస్తుంది.

దేశంలో ఎంతో మంది గొప్ప గొప్ప ఛాంపియన్స్, రియల్ హీరోలు ఉన్నారు. అలాంటి వారి గురించి నిజానికి మనకి చాలా తక్కువ తెలిసి ఉంటుంది. కానీ, అలాంటి వాళ్ల గురించి దేశం ఎప్పుడు మాట్లాడుకుంటుంది అంటే వారి చరిత్ర మనకు బాగా తెలిసినప్పుడు. ఇప్పుడు అలాంటి ఒక బాధ్యతను సినిమా రంగం తీసుకుంది. ఇప్పటికే ఎంతో మంది అన్ సంగ్ హీరోల గురించి.. వారి జీవిత గాథల గురించి బయోపిక్స్ వచ్చాయి. ఇటీవల అలాంటి ఒక స్పోర్ట్స్ డ్రామానే వచ్చింది. అది మరెవరి జీవితమో కాదు.. మొదటి పారాలంపిక్ స్వర్ణ పతక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్.. చందూ ఛాంపియన్ మూవీ. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

చందూ ఛాంపియన్ సినిమా ఒక బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు. ఒక ఛాంపియన్ పాత్రలో నటిస్తున్నాం అంటే కచ్చితంగా ఆ బెరుకు ఉంటుంది. పైగా ఆయన స్వయంగా సెట్స్ కి వచ్చి వీళ్ల షూట్ ని కూడా చూశారు. అప్పుడు ఆయన ఒకే మాట అన్నారు అంట.. అచ్చం నాకులాగానే చేస్తున్నావ్ అని. ఆ మాట తనకు ఒక మెడల్ పొందిన ఆనందాన్ని ఇచ్చింది అంటూ కార్తీక్ ఆర్యన్ చెప్పుకొచ్చాడు. ఈ మూవీ జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాకుండా.. ఏకంగా రూ.88 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వచ్చింది.

చందు ఛాంపియన్ అనేది ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. ఈ మూవీ చూస్తే మీకు కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి. చాలా మందిని చుట్టూ ఉన్న వాళ్లు ట్రోల్ చేస్తుంటారు. నువ్వు లూజర్ అంటూ హేళన చేస్తారు. అయితే ఆ హేళన చూసి అక్కడితో ఆగిపోయే వాళ్లు కోకొల్లలు. కానీ, అలాంటి వారి నోళ్లు మూయించడానికి ఎదిగినవాడే చందూ ఛాంపియన్. తాను ఒక ఛాంపియన్ అవ్వాలి అని చిన్నప్పటి నుంచే కలలు కంటాడు. ఆ కలలను సాకారం చేసుకుని.. లెక్కకు మించిన ప్రశంసలు, పతకాలు కూడా సొంతం చేసుకుంటాడు. దేశం గర్వించే స్థాయికి ఎదుగుతాడు. అతను ఇండియన్ ఆర్మీలో చేరి యుద్ధంలో 9 బుల్లెట్లు శరీరంలో దిగి.. రెండేళ్లు పాటు కోమాలో ఉంటాడు. అయితే అక్కడితో ఆగిపోతాడు అనుకుంటారు. కానీ, తనని ఏదీ ఆపలేదు అని నిరూపిస్తాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. అయితే ప్రస్తుతానికి రెంట్ బేసిస్ మీద ఈ మూవీ అందుబాటులో ఉంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments