iDreamPost
android-app
ios-app

OTT లో మరో కామెడీ థ్రిల్లర్ .. కడుపుబ్బా నవ్వాల్సిందే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Jul 19, 2024 | 11:46 AM Updated Updated Jul 19, 2024 | 11:46 AM

OTT Comedy Movie : ఇప్పుడు కామెడీ మూవీస్ కు పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే ఓటీటీ లో మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ డ్రామా సైలెంట్ గా స్ట్రీమింగ్ అయిపోతుంది. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Comedy Movie : ఇప్పుడు కామెడీ మూవీస్ కు పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే ఓటీటీ లో మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ డ్రామా సైలెంట్ గా స్ట్రీమింగ్ అయిపోతుంది. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Jul 19, 2024 | 11:46 AMUpdated Jul 19, 2024 | 11:46 AM
OTT లో మరో కామెడీ థ్రిల్లర్ .. కడుపుబ్బా నవ్వాల్సిందే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

ఈ వారం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఓటీటీ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు బాగానే ఉన్నాయి. పైగా వాటిలో తెలుగు కంటెంట్ ఉన్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక వీటితో పాటు ఆల్రెడీ ముందస్తు ఇంఫార్మేషన్ తో వచ్చిన సినిమాలే కాకుండా.. సైలెంట్ గా కూడా కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో కామెడీ సినిమాలకు ఎలాంటి క్రేజ్ లభిస్తుందో చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కాబట్టి ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి మరొక మూవీ రెడీ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా మరేదో కాదు .. కన్నడ లో సూపర్ హిట్ సక్సెస్ సాధించిన.. పొలిటికల్ కామెడీ మూవీ “మూరనే కృష్ణప్ప”. ఈ సినిమా మే నెలలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అటు కమర్షియల్ గా కూడా భారీ హిట్ నే అందుకుంది. కాగా ఈ సినిమాలో రంగాయ‌న ర‌ఘు, సంప‌త్ మైత్రేయ‌, శ్రీప్రియ ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాకు న‌వీన్ నారాయ‌ణ్ ఘ‌ట్టా దర్శకత్వం వహించారు. పల్లెటూర్లలో రాజకీయాలు ఎలా ఉంటాయి అని.. ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు మేకర్స్. థియేటర్ ఆడియన్సును మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ సినిమా జూలై 19 నుంచి సైలెంట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఓటీటీ లో ఈ మూవీ ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

ఇక ఈ మూవీ కథ విషయానికొస్తే.. అనేకల్ అనే గ్రామా పంచాయితీకి.. వీరన్న అనే అతను ప్రెసిడెంట్ గా ఉంటాడు. అతను పదవీకాలం ముగిసిపోవడంతో మరొక సారి ఎన్నికల్లో పోటీపడి.. గెలవాలని అనుకుంటాడు. దీనితో ఊరిలో కొత్తగా నిర్మించిన గుడికి ఓ స్టార్ హీరోను పిలిపించి.. తన పలుకుబడిని చూపించాలని అనుకుంటాడు. మరో మూడు రోజుల్లో గుడి ఓపెనింగ్ ఉందనగా ఆ హీరో చనిపోతాడు. దీనితో అతని ప్లేస్ లో మరొక హీరోను తీసుకురావాలని అనుకుంటాడు. కానీ అది వీలు కాదు… దీనితో సెలెబ్రిటీలతో లాభం లేదని ఏకంగా సీఎం నే ఆ ఊరికి రప్పించాలని అనుకుంటాడు. మరి అతని ప్రయత్నాలు ఫలించాయా ? ఆ తర్వాత ఏం జరిగింది ? అతను ఎన్నికలలో గెలిచాడా లేదా ?చివరికి కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే.. ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş