రేవ్ పార్టీ అంటే ఏంటి? OTTలో దాని గురించి మూవీ చూశారా?

A OTT Movie On Rave Party Culture: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మీకు రేవ్ పార్టీ అనే పేరు బాగా వినిపిస్తోంది. మరి.. ఆ కల్చర్ గురించి మీకు తెలుసా? అలాంటి కల్చర్ మీద ఓటీటీలో సినిమా కూడా అందుబాటులో ఉంది.

A OTT Movie On Rave Party Culture: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మీకు రేవ్ పార్టీ అనే పేరు బాగా వినిపిస్తోంది. మరి.. ఆ కల్చర్ గురించి మీకు తెలుసా? అలాంటి కల్చర్ మీద ఓటీటీలో సినిమా కూడా అందుబాటులో ఉంది.

రేవ్ పార్టీ.. గత రెండ్రోజులుగా పాన్ ఇండియా లెవల్లో మీకు బాగా వినిపిస్తున్న పేరు. కర్ణాటక సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు మారు మోగుతోంది. ఎందుకంటే ఇటీవల బెంగళూరు వేదికగా ఒక రేవ్ పార్టీ జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఏకంగా 100 మంది సెలబ్రిటీలను, రాజకీయ ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఆ పార్టీ గురించి చాలానే వార్తలు వచ్చాయి. ఆ పార్టీలో ఫలానా వ్యక్తులు ఉన్నారని.. వాళ్లేమో మేము హైదరాబాద్ లో ఉంటే మా గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు అంటూ వీడియోలు విడుదల కూడా చేశారు. ఈ తతంగం గత రెండ్రోజులుగా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న విషం తెలిసిందే. అయితే ఈ రేవ్ పార్టీ కల్చర్ గురించి ఒక సినిమా ఉందని మీకు తెలుసా?

బెంగళూరు వేదికగా జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఈ పార్టీని ఎవరు నిర్వహించారు? ఎవరెవరు ఈ పార్టీకి హాజరయ్యారు? అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి? అక్కడ ఏం చేస్తారు? ఇలాంటి చాలానే ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెట్టింటి ఈ రేవ్ పార్టీ గురించి ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ కల్చర్ ఏంటి? అక్కడ ఏం చేస్తారు అంటూ తెలుసుకోవాలి అని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇది చాలా హై ప్రొఫైలో గుట్టు చప్పుడు కాకుండా జరిగే పార్టీ కాబట్టి ఎవరికీ పెద్దగా అవగాహన ఉండదు. కానీ, ఈ కల్చర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఓటీటీలో దీని మీద ఏకంగా సినిమానే ఉంది. అది కూడా 2000 సంవత్సరంలోనే విడుదలైంది.

ఈ సినిమాలో కూడా ఈ రేవ్ పార్టీ కల్చర్ ని స్పష్టంగా చూపించారు. అసలు ఈ పార్టీని ఎలా నిర్వహిస్తారు? ఎవరెవరు ఈ పార్టీకి హాజరవుతారు? అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది. అనే విషయాలను క్లియర్ గా చూపించారు. అలాగే ఈ పార్టీలో మ్యూజిక్, లేజర్ లైట్స్ తో డాన్స్ ఫ్లోర్ ఉంటుంది. అలాగే తాగిన వాళ్లకు తాగినంత మద్యం దొరుకుతుంది. అంతేకాకుండా మాదకద్రవ్యాలు కూడా ఇలాంటి పార్టీల్లో అందుబాటులో ఉంటాయని ఇప్పటికే పోలీసులు వెల్లడించారు. ఇంక ఈ పార్టీలో హద్దుల దాటి శృOగారం, న్యూ*డిటీ కూడా ఉంటుందని ఈ సినిమాలో చూపించారు. ప్రస్తుతం ఈ రేవ్ పార్టీ కల్చర్ గురించి చర్చ జరగడంతో ఓటీటీలో ఈ మూవీ వెలుగులోకి వచ్చింది.

ఈ రేవ్ పార్టీ కల్చర్ మీద ఒక మూవీ ఉంది. అది ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో కూడా ఉంది. ఆ మూవీ పేరు ‘గ్రూవ్’. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే మీరు సబ్ స్క్రిప్షన్ ఉన్నా కూడా ఈ సినిమాని ఫ్రీగా చూడలేరు. ఎందుకంటే ఇది రెంట్ బేసిస్ మీద మాత్రమే అందుబాటులో ఇంది. అంటే మీరు ఈ సినిమా చూడాలి అంటే అమెజాన్ ప్రైమ్ నిర్ణయించినా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు రేవ్ పార్టీ కల్చర్ గురించి తెలుసుకోవాలి అని అంతా భావిస్తున్న నేపథ్యంలో రెంట్ కట్టి కూడా చూసేలా ఉన్నారు ప్రజలు. అయితే ఇలాంటి కల్చర్ అస్సలు సమర్థించదగినది కాదు అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. సమాజానికి ఇలాంటి పోకడలు హాని చేస్తాయని గుర్తు పెట్టుకోండి.

Show comments