ఆ గుహలో 1 సెకండ్.. బయట 1 ఇయర్ తో సమానం.. OTT లో Sci-Fi సర్వైవల్ థ్రిల్లర్

OTT Sci-Fi Survival Thriller : కొన్ని సర్వైవల్ థ్రిల్లర్స్ ను ఎలా తీస్తారో తెలియదు కానీ.. అసలు మన లాజిక్స్ కు అందవు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. ఇదొక బెస్ట్ సర్వైవల్ డ్రామా.. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Sci-Fi Survival Thriller : కొన్ని సర్వైవల్ థ్రిల్లర్స్ ను ఎలా తీస్తారో తెలియదు కానీ.. అసలు మన లాజిక్స్ కు అందవు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. ఇదొక బెస్ట్ సర్వైవల్ డ్రామా.. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఎంత హర్రర్ , సస్పెన్స్ డ్రామాస్ చూసినా కానీ సర్వైవల్ డ్రామాస్ చూస్తే ఎదో తెలియని ఎనర్జి వస్తుంది. అసలు చెప్పాలంటే.. అసలైన సస్పెన్స్ ఈ సర్వైవల్ డ్రామాస్ లోనే ఉంటుంది. అయితే కొన్ని సర్వైవల్ థ్రిల్లర్స్ మాత్రం.. ఎలా తీస్తారో తెలియదు కానీ.. అసలు ప్రేక్షకుల లాజిక్స్ కు అందవు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిది. అయితే కొన్ని సినిమాలలో లాజిక్స్ వెతక్కుండ ఉంటేనే సినిమా అనేది అర్ధమౌతుంది. కాబట్టి ఈ సినిమాను కూడా అలానే చూసేయండి. అసలు ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా అంతా కూడా కొంతమంది స్టూడెంట్స్ , టైమ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మూవీ స్టార్టింగ్ లో హాపర్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతనికి ఇద్దరు అసిస్టెంట్స్ ఉంటారు. అతను ఓ రీసెర్చ్ కోసం ఓ అడవిలోకి వెళ్తున్నాను అని చెప్పి.. అతని డాగ్ ను తీసుకుని అడవిలోకి వెళ్తాడు. అక్కడ అతనికి ఓ గుహ కనిపిస్తుంది. ఆ గుహ నార్మల్ గా ఉండదు. అది చూస్తే అతనికి మిస్టీరియస్ గా అనిపిస్తుంది. అలాగే అక్కడ కౌ బాయ్ వేషంలో ఓ వ్యక్తి ఉంటాడు. అతనిలో ఏ చలనం ఉండదు. కేవ్ బయట ఓ వెహికిల్ ఉంటుంది. అది వాళ్ళ పేరెంట్స్ వెహికిల్.. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మాయమైపోతారు. వాళ్ళను వెతుక్కుంటూనే అతను అక్కడకు వెళ్తాడు. మెల్లగా అతను కేవ్ లోపలికి ఎంటర్ అవుతాడు. అతను వెళ్లి రెండు రోజులు అయినా కానీ.. ఇంటికి రాడు. దీనితో అతనిని వెతుక్కుంటూ.. అతని అసిస్టెంట్స్ అక్కడకు వెళ్తారు.

కట్ చేస్తే.. హాపర్ కు ఆ కేవ్ లోపలి మెల్ల మెల్లగా వెళ్తూ ఉంటాడు. ఇంతలో అతనికి అక్కడ ఏవో వింత వింత శబ్దాలు వినిపించడంతో.. వెంటనే వెనక్కు వచ్చేస్తాడు. నిజానికి అతను ఆ గుహలో ఉన్నది కేవలం ఐదు నిముషాలు మాత్రమే కానీ అతను బయటకు వచ్చిన చూస్తే మాత్రం మొత్తం చీకటి పడిపోయి ఉంటుంది. అంటే ఆ గుహలో 5 నిముషాలు గడిపితే.. బయట 5 సంవత్సరాలు గడిచిపోయినట్లు చూపిస్తారు. ఇక లోపల వాళ్ళ స్టూడెంట్స్ అతనిని వెతుకుంటూ ఉంటారు. వాళ్లకు కూడా ఏవో వింత శబ్దాలు వినిపించడంతో.. బయటకు వచ్చేదాం అనుకుంటారు. కానీ వాళ్ళు బయటకు రాలేరు. ఆ తర్వాత ఏం జరిగింది ? అసలు ఆ కేవ్ లో ఏముంది ? ఎందుకు అక్కడకు వెళ్లిన వారంతా ఇరుక్కుపోతారు? వాళ్ళు బయటకు వస్తారా లేదా ? అసలు టైమ్ కేవ్ లోపల ఒకలా కేవ్ బయట ఒకలా ఎందుకు ఉంటుంది ? ఇవన్నీ తెలియాలంటే.. “టైమ్ ట్రాప్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే.. వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. OTTలో ది బెస్ట్ సైన్స్ ఫిక్షన్ సిరీస్.. స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం!

Show comments