OTT Suggestions-Adventure Thriller: బెలూన్ తో వేల అడుగుల ఎత్తులో ప్రయాణం! OTTలో సరికొత్త కాన్సెప్ట్ మూవీ!

బెలూన్ తో వేల అడుగుల ఎత్తులో ప్రయాణం! OTTలో సరికొత్త కాన్సెప్ట్ మూవీ!

OTT Adventure Thriller: ఇప్పటివరకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో అసలు ఈ సినిమా ఏంటో ఓ లుక్ వేసేయండి.

OTT Adventure Thriller: ఇప్పటివరకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో అసలు ఈ సినిమా ఏంటో ఓ లుక్ వేసేయండి.

ఎక్కడో ఎదో ఓ భయంకరమైన ఇన్సిడెంట్ జరిగిందంటే.. అసలు అక్కడ ఏం జరిగింది.. ఎలా జరిగింది అని తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు.ఇక అలాంటివి సినిమాల రూపంలో తీస్తే చూడడానికి ఇంకాస్త ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. పైగా రియల్ ఇన్సిడెంట్స్ నుంచి ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన కథలకు.. ఇప్పుడు బాగా క్రేజ్ కూడా ఉంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటి ఓ రియల్ స్టోరీనే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. సినిమా స్టార్టింగ్ లో 1892 లో లండన్ లో ఓ సిటీని చూపిస్తారు. ఆ సిటీలో ఎమిలియ అనే ఓ అమ్మాయి ఉంటుంది. ఆమెకు తన గతంలో చాలా విషాద సంఘటనలు జరిగి ఉంటాయి. దీనితో ఆమె ఎప్పుడు వాటిని తలుచుకుంటూ భయపడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ రోజు అక్కడికి తన సిస్టర్ వచ్చి ఆమెకు సర్దిచెప్పి.. నువ్వు ఈ ప్రయాణం చేయడం అవసరమా అని అడుగుతుంది. కానీ ఎమిలియా ఎలా అయినా ఆ పని చేయాలనీ అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ మరొక సీన్ ను చూపిస్తారు.. ఇక్కడ జేమ్స్ అనే మరొక వ్యక్తిని చూపిస్తారు. అతను ఒక సైంటిస్ట్.. అతను వరల్డ్ లోనే ఓ పెద్ద బెలూన్ ను తయారు చేసి దానిలో ట్రావెల్ చేసి.. వరల్డ్ రికార్డు కొట్టాలని డిసైడ్ అయ్యి.. జర్నీ స్టార్ట్ చేస్తాడు. అయితే ఆరోజు వాతావరణం సరిగా లేదని చెప్పి తన ఫ్రెండ్ అతనిని ఆపే ప్రయత్నం చేస్తాడు. కానీ అతను మాత్రం తన ప్రయాణాన్ని ఆపకుండా మొదలు పెడతారు.

సరిగ్గా అప్పుడె అక్కడకు ఎమిలియా వస్తుంది. ఆమె కూడా జేమ్స్ తో పాటు ఆరోజు ఆ బెలూన్ లో ట్రావెల్ చేయడానికి వస్తుంది. ఇక వారు తమ జర్నీని స్టార్ట్ చేస్తారు. అయితే ఆమెతో పాటు తన కుక్కను కూడా ఆ బెలూన్ లో ఎక్కించుకున్న ఎమిలియా.. సడెన్ గా ఆ కుక్కను పై నుంచి కిందకు విసిరేస్తుంది. చుట్టూ ఉన్న వారంతా షాక్ అవతారు. కానీ దానికి పారాచూట్ కట్టి వదిలేస్తుంది కాబట్టి అది సేఫ్ గానే ల్యాండ్ అవుతుంది. ఇక వారు ఆకాశంలో చాలా ఎత్తుకు చేరుకుంటారు. ఇక జేమ్స్ తన పనిలో తాను ఉంటాడు. అక్కడ జరిగే సంఘటనలన్నీ ఓ రిపోర్ట్ లా రాస్తూ పావురం ద్వారా కింద ఉన్న వాళ్లకు తెలియజేస్తాడు. అంత బాగానే సాగుతుంది అనుకునే సమయానికి.. సరిగ్గా అప్పుడే వాతావరణం చేంజ్ అయ్యి.. విపరీతమైన గాలి , వాన స్టార్ట్ అవుతుంది. దీనితో జేమ్స్ కళ్ళు తిరిగి పడిపోతాడు. మరి వాళ్ళు ఆ బెలూన్ లో ఎలా సర్వైవ్ అవుతారు ? అసలు ఎమిలియా కు ఉన్న గతం ఏంటి ? ఆమె ఎందుకు ఆ బెలూన్ లో ట్రావెల్ చేయాలనీ అనుకుంటుంది? చివరికి కథ ఎలా ముగిసింది? అనేదే తెలియాలంటే “ది ఏరోనాట్స్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments