OTT Sci-Fi Horror Film: మనుషులు సృష్టించిన జీవికి ఆ కోరికలు.. చివరికి! OTT లో క్లైమాక్స్ అదిరిపోతుంది..

OTT Sci-Fi Horror Film: మనుషులు సృష్టించిన జీవికి ఆ కోరికలు.. చివరికి! OTT లో క్లైమాక్స్ అదిరిపోతుంది..

ఓటీటీ లో రెగ్యులర్ గా వచ్చే సినిమాలతో పాటు ఆల్రెడీ ఉన్న సినిమాలు కూడా.. ఈ మధ్య బాగానే ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక సినిమా గురించి చూసేద్దాం. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఓటీటీ లో రెగ్యులర్ గా వచ్చే సినిమాలతో పాటు ఆల్రెడీ ఉన్న సినిమాలు కూడా.. ఈ మధ్య బాగానే ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక సినిమా గురించి చూసేద్దాం. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఓటీటీ వరల్డ్ లో ఇప్పటివరకు చాలానే సినిమాలు , సిరీస్ లు వచ్చాయి. ఇక ఎప్పటికప్పుడు వచ్చిన సినిమాలన్నిటిని ప్రేక్షకులు బాగానే ఆదరిస్తూ వస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు వచ్చే సినిమాలలో ఏదైనా సినిమాలు ఇంట్రెస్టింగ్ గా లేకపోతే మాత్రం ఇంకా ఏమైనా మంచి సినిమాలు ఉన్నాయేమో అని సెర్చ్ చేసే పనిలో ఉంటున్నారు మూవీ లవర్స్. వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్స్. ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా వచ్చే సినిమాలతో పాటు.. ఆల్రెడీ ఉన్న సినిమాలు కూడా బాగానే ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. జెనెటిక్ ఇంజినీర్స్ అయిన క్లైవ్ , ఎల్సా అనే భార్య భర్తలు.. యానిమల్ డిఎన్ఏ ని ఉపయోగించి.. ఫ్రెడ్ , జింజర్ అనే రెండ్ హైబ్రీడ్స్ ను తయారు చేస్తారు. వీటి మధ్య మేటింగ్ జరిపిస్తారు. ఆ ప్రయోగం కాస్త సక్సెస్ అవుతుంది. దీనితో క్లైవ్ , ఎల్సాలు హ్యూమన్ యానిమల్ హైబ్రిడ్ ను తయారు చేయాలనీ అనుకుంటారు. కానీ దానికి వాళ్ళ బాస్ ఒప్పుకోదు. వీళ్లంతా సీక్రెట్ ఆ ఆ ప్రయోగం చేయాలనీ డిసైడ్ అవుతారు. అనుకున్నట్లుగానే ఆ ప్రయోగాన్ని పూర్తి చేసి. ఓ ఫిమేల్ హైబ్రిడ్ కు జీవం పోస్తారు ఆ దంపతులు. దానికి డ్రెన్ అని పేరు పెడతారు. ముందైతే దానిని టెర్మినేట్ చేసేయాలని అనుకుంటారు కానీ.. ఈ ప్రాణి మంచిదై ఉండొచ్చు కదా.. ఉండనిద్దాం అని ఎల్సా క్లైవ్ ను ఒప్పిస్తుంది. డ్రెన్ ను ప్రేమగా పెంచుతూ ఉంటారు. ఇక ఆ భార్య భర్తలు ఇద్దరూ.. డ్రెన్ తో బిజీగా ఉండి.. ముందు క్రియేట్ చేసిన ఫ్రెడ్ , జింజర్ ల సంగతి మర్చిపోతారు. ఆ రెండు ఒక దానిని ఒకటి కొట్టుకుని చచ్చిపోతాయి.

క్లైవ్ , ఎల్సా లు డ్రెన్ ను ఓ సీక్రెట్ ప్లేస్ లో పెంచుతూ ఉంటారు. అది పెరిగి పెద్దదవుతున్న కొద్దీ.. దాని రెక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో డ్రెన్ ఓ రోజు.. ఎల్సా పెంపుడు పిల్లిని చంపేస్తుంది. దీనితో ఎల్సాకు కోపం వస్తుంది. డ్రెన్ తోకతో ఎప్పటికైనా ప్రమాదం అనే తెలిసి.. తనకు ఇష్టం లేకపోయినా కూడా ఆ తోకను కట్ చేస్తుంది. మరో వైపు డ్రెన్ క్లైవ్ ను శారీరకంగా దగ్గర చేసుకోవాలని చూస్తుంది. వీరిద్దరూ దగ్గరవడం చూసి ఎల్సా షాక్ అవుతుంది. దీని వలన ఎన్నో ప్రమాదాలు రావొచ్చని.. ఇద్దరు కలిసి డ్రెన్ ను చంపేయాలని అనుకుంటారు. కానీ అప్పటికే డ్రెన్ లైఫ్ స్పాన్ అయిపోవడంతో అది చనిపోతుంది. దీనితో వీరిద్దరూ రిలాక్స్ అవుతారు.

కానీ అసలు కథ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. డ్రెన్ శరీరంలోనుంచి డ్రెన్ ఆత్మ బయటకు వస్తుంది. కానీ డెన్ ఇప్పుడు ఫిమేల్ కాదు మేల్. ఇప్పుడు డ్రెన్ నుంచి ఎల్సా, క్లైవ్ లకు ఎలాంటి ప్రమాదం ఉంది ! వారు డ్రెన్ ఆత్మతో ఎలా పోరాడారు ! చివరికి కథ ఎలా ముగిసింది ! ఇవన్నీ తెలియాలంటే .. “స్ప్లైస్ ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments