Swetha
OTT Best Suspense Thriller: కొరియన్ సినిమాలకు బాగా డిమాండ్ పెరుగుతున్న విషయం తెలియనిది కాదు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓటీటీ లోకి ఓ ఇంట్రెస్టింగ్ కొరియన్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదో ఓ లుక్ వేసేయండి.
OTT Best Suspense Thriller: కొరియన్ సినిమాలకు బాగా డిమాండ్ పెరుగుతున్న విషయం తెలియనిది కాదు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓటీటీ లోకి ఓ ఇంట్రెస్టింగ్ కొరియన్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదో ఓ లుక్ వేసేయండి.
Swetha
కొన్ని సినిమాలు చూసిన తర్వాత ఎదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేసినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సినిమాలను అసలు మిస్ చేయకుండా చూడాలి. ఇప్పుడు చెప్పుకునేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. ఇక ఈ మధ్య కాలంలో కొరియన్ సినిమాలకు బాగా డిమాండ్ పెరిగిన సంగతి తెల్సిందే. కొరియన్ డ్రామాస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా ఉన్నారు. కొరియన్ సినిమాలను ఇష్టపడే వారైతే ఈ సినిమాను ఆల్రెడీ చూసేసి ఉండాలి. ఒకవేళ చూడలేదు అంటే కనుక.. ఓ మంచి థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఓ మహానగరంలో జిన్ హాంగ్ అనే వ్యక్తి లాయర్ గా పని చేస్తూ.. మంచి పొజిషన్ లో ఉంటాడు. అయితే దానికంటే ముందే అతను 7 సంవత్సరాల క్రితం జరిగిన తన తల్లి హత్య కేసును.. కోర్టులో వాదించి.. చివరికి అసలు హంతకుడికి శిక్ష పడేలా చేస్తాడు. అంతా బాగానే ఉన్న సమయంలో… ఎప్పుడో చనిపోయిన తన తల్లి తిరిగి వచ్చి.. కుమారుడిని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. తల్లికి సహాయం చేసినా కానీ ఎందుకు ఆమె కొడుకుని చంపాలని అనుకుంటుందా అని అందరు షాక్ అవుతారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ కేసు గురించి స్టడీ చేసే కొద్దీ.. కొత్త కొత్త విషయాలు బయటపడతాయి. చాలా దేశాలలో ఇలాగే చనిపోయిన వారంతా తిరిగి వచ్చి.. తమ మరణానికి కారణం అయిన వారిని చంపి ప్రతీకారం తీర్చుకుని.. వెంటనే మాయమైపోతున్నారనే విషయాలు బయటపడతాయి.
అయితే, ఇదంతా పక్కన పెట్టేస్తే.. ఇక్కడ తన తల్లి కన్న కొడుకు ఆమెకు హెల్ప్ చేసినా సరే.. ఎందుకు అతనిని చంపడానికి వచ్చింది? అసలు ఏడు సంవత్సరాల క్రితం ఆమె ఎలా చనిపోయింది? చనిపోయిన వారంతా ఎందుకు తిరిగి వస్తున్నారు ? ఇవన్నీ తెలియాలంటే “రెస్క్యూరెక్టడ్ విక్టిమ్స్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా నిడివి చాలా తక్కువ సమయం ఉంటుంది, కానీ ఖచ్చితంగా క్లైమాక్స్ మాత్రం.. చూసిన వారికి ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇలాంటి కథలో మళ్ళీ మళ్ళీ రావు. కాబట్టి అసలు మిస్ చేయొద్దు. ఈ సినిమా ప్రస్తుతం.. జియో సినిమా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరు చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది కూడా చూడండి.. OTTలో బెస్ట్ కొరియన్ థ్రిల్లర్! టెన్షన్ తట్టుకోలేని వాళ్ళు అస్సలు చూడకండి!