లవర్ తో సె*క్స్ చేస్తుంటే అబ్బాయి చనిపోతాడు.. OTT లో భయపెట్టే ప్రేమ కథ

OTT Best Horror Romantic Thriller: ప్రేమ కథా చిత్రాలు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటాయి. కానీ కొన్ని మాత్రం భయపెడతాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటి సినిమానే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Horror Romantic Thriller: ప్రేమ కథా చిత్రాలు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటాయి. కానీ కొన్ని మాత్రం భయపెడతాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటి సినిమానే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

మూవీ లవర్స్ కు అన్ని జోనర్స్ కు సంబంధించిన సినిమాలు ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు అందరు ఇంట్రెస్టింగ్ గా చూసే సినిమాలలో ఒకటి హర్రర్ మూవీస్ అయితే.. ఇంకోటి లవ్ స్టోరీస్. ఈ రెండు జోనర్స్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ప్రతి మూవీ కూడా ప్రతి మూవీ కొత్త్తగానే ఉంటూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం కాస్త డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే.. ఇది పూర్తిగా లవ్ స్టోరీ అని చెప్పలేము. అలా అని హర్రర్ అని చెప్పలేము. ఇది భయపెట్టే ప్రేమ కథ. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. మూవీ స్టార్టింగ్ లో దేవి అనే అమ్మాయి ఎవరిని కలవడానికి బయటకు వెళ్తుంది. కొంతదూరం వెళ్లిన తర్వాత తన డ్రెస్సింగ్ అంతా పెళ్ళైన అమ్మాయిలా మార్చేస్తుంది. అక్కడ పీయూష్ అనే అబ్బాయితో కలిసి ఓ హోటల్ కు వెళ్తుంది. వాళ్లిద్దరూ లవర్స్ అని అర్థమైపోతుంది. ఆమె కోచింగ్ కోసం అని సిటీ కి వస్తుంది. అక్కడే పీయూష్ తో పరిచయం అయ్యి.. అది ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో వారిద్దరూ ఫిజికల్ గా ఇంటిమేట్ అవ్వడం కోసం అని రూమ్ లో కలుస్తారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ పోలీస్ రైడ్ జరగడంతో.. పీయూష్ సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. దీనితో అతనిని హాస్పిటల్ లో అడ్మిట్ చేసి.. దేవిని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్తారు.

కట్ చేస్తే ఇక్కడ మిశ్రా అనే ఓ వ్యాపారి స్టోరీ చూపిస్తారు. మిశ్రా గంగానది ఒడ్డున శవాలు కాల్చడానికి అవసరం అయ్యే సామాగ్రి అమ్ముతూ ఉంటాడు. ఇతను దేవి తండ్రి. ఈ కేసు విషయం తెలిసి ఆమెపై కోప్పడి ఇంటికి తీసుకుని వస్తాడు. ఇక్కడ దీపక్ అనే అబ్బాయి కథను పార్లల్ గా చూపిస్తూ ఉంటారు. మరోవైపు హాస్పిటల్ లో పీయూష్ చనిపోతాడు. ఇక పోలీసులు మూడు లక్షలు ఇస్తే కానీ దేవిని ఈ కేసు నుంచి బయటకు తీసుకొస్తానని.. లేదంటే మీడియా వరకు ఈ విషయం వెళ్తుందని బెదిరిస్తాడు. దీనితో మిశ్రా డబ్బు వేటలో ఉంటాడు. ఇక దీపక్ ఏమో షాలు అనే ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇక మిశ్రా తన కూతురును కాపాడుకోడం కోసం కష్టపడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ? మిశ్రా డబ్బు సమకూర్చడా లేదా ? అతనికి ఎవరు సహాయం చేస్తారు ? దీపక్ కు మిశ్రాకు సంబంధం ఏంటి ? దేవి తన తండ్రి కష్టాన్ని ఎలా తీరుస్తుంది ? ఈ కథ ఎలా కొనసాగింది ? చివరకు ఏమౌతుంది ? ఇవన్నీ తెలియాలంటే “మసాన్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. OTTలో బెస్ట్ లవ్ స్టోరీ.. యూత్ తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది!

Show comments