Tirupathi Rao
OTT Movie Suggestions- Best Horror Series: హారర్ చిత్రాలు, హారర్ వెబ్ సిరీస్లు ఇష్టపడే వారికి ఇది ఒక క్రేజీ సజీషన్ అవుతుంది. అందమైన అమ్మాయి కంటిచూపుతోనే ప్రాణాలు తీస్తూ ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ లో చాలానే ట్విస్టులు ఉంటాయి.
OTT Movie Suggestions- Best Horror Series: హారర్ చిత్రాలు, హారర్ వెబ్ సిరీస్లు ఇష్టపడే వారికి ఇది ఒక క్రేజీ సజీషన్ అవుతుంది. అందమైన అమ్మాయి కంటిచూపుతోనే ప్రాణాలు తీస్తూ ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ లో చాలానే ట్విస్టులు ఉంటాయి.
Tirupathi Rao
హారర్ సినిమాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వణికిపోతూ కూడా చూసేస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం రాత్రిపూట అవ్వగానే హారర్ సినిమాలు చూడటం మానేస్తారు. ఇంకొందరు పనిగట్టుకుని రాత్రుళ్లు హారర్ సినిమాలు చూస్తారు. అయితే అలాంటి వారికోసం ఒక బెస్ట్ హారర్ సిరీస్ తీసుకొచ్చాం. ఇది మీరు ఎప్పుడు చూసినా వాణికిపోతారు. ఎందుకంటే మన హీరోయిన్ ఏకంగా కంటిచూపుతో ప్రాణాలు తీస్తూ ఉంటుంది. ఆమెకు ఉన్న శక్తి ముంతి ప్రపంచం కూడా పాదాక్రాంతం అవుతుంది. అలాంటి ఒక లేడీకి తన శక్తి తెలియకపోవడం కూడా ఒక కొసమెరుపు అనచ్చు. మరి.. ఆ సినిమా ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.
సాధారణంగానే హారర్ సినిమాలు అంటే కాస్త భయంగా ఉంటాయి. అదే హాలీవుడ్ హారర్ సినిమాలు అంటే వాళ్లు వేసే మేకప్ కి కచ్చితంగా కంగారు పుడుతుంది. కానీ, ఈ సినిమాలో మాత్రం అందంతో భయపెట్టేస్తారు. అందమైన అమ్మాయిని చూస్తుండగానే ప్రాణాలు తీసేస్తుంది. ఆమె ఒక్క చూపు చూస్తే అవతలి వాళ్ల ప్రాణాలు పోవాల్సిందే. అంత భయంకరంగా, దారుణంగా, క్రూరంగా చంపుతుంది. అయితే తనకు ఉన్న శక్తుల గురించి ఆ అమ్మాయికి కూడా క్లారిటీ లేకపోవడం ఇక్కడ అసలు ట్విస్ట్. తనకు ఆ శక్తులు పూర్వీకుల నుంచి సంక్రమిస్తాయి. ఆ అమ్మాయి వారందిరోల ఎంతో స్పెషల్. అయితే ఆ శక్తుల వల్ల ఆమె జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అనేదే కథ.
ఆ అమ్మాయి కోసం ఎదురుచూసే ఒక రాక్షసుడు కూడా ఉంటాడు. ఆమె స్వభావంగా పరంగా క్రూరమైన శక్తులు ఉంటాయి. కానీ, మనిషి మాత్రం ఎంతో మంచిదే. తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండానే కొన్ని హత్యలు జరిగిపోతూ ఉంటాయి. అలాంటి తన శక్తులను కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటుంది. ఆమెలో ఉన్న చీకటి కోణాన్ని మేల్కొపాలి అని ఒకడు ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ సిరీస్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. కథ కూడా ఎన్నో మలుపులు తీరుగుతూ ఉంటుంది. ఈ హారర్ ఫాంటసీ వెబ్ సిరీస్లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ దాదాపుగా 40 నిమిషాల వరకు ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ‘మే ఫెయిర్ విట్చెస్‘. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ లో అలెగ్జాండ్రా డడ్డారియో సింగిల్ హ్యాండెడ్లీ కథ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మరి.. ఈ సిరీస్ చూడాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.