OTT Bold Movie: రెండు OTT ల్లోకి తెలుగు బో*ల్డ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

రెండు OTT ల్లోకి తెలుగు బో*ల్డ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

OTT Bold Movie: హర్రర్, కామెడీ , సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలైతే ఎంచక్కా థియేటర్ లో ఫ్యామిలీ , ఫ్రెండ్స్ తో కలిసి చూసేయొచ్చు. కానీ కొన్ని మూవీస్ ఒంటరిగా మాత్రం చూడడానికి ఇష్టపడుతుంటారు ప్రేక్షకులు . ఇప్పుడు అలాంటి ఓ సినిమానే ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అయిపోతుంది.

OTT Bold Movie: హర్రర్, కామెడీ , సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలైతే ఎంచక్కా థియేటర్ లో ఫ్యామిలీ , ఫ్రెండ్స్ తో కలిసి చూసేయొచ్చు. కానీ కొన్ని మూవీస్ ఒంటరిగా మాత్రం చూడడానికి ఇష్టపడుతుంటారు ప్రేక్షకులు . ఇప్పుడు అలాంటి ఓ సినిమానే ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అయిపోతుంది.

కొన్ని సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూస్తే బావుంటాయి. మరి కొన్ని సినిమాలు ఫ్రెండ్స్ తో కలిసి చూస్తే బావుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఒంటరిగానే చూడాలని అనుకుంటూ ఉంటారు మూవీ లవర్స్. హర్రర్ , కామెడీ , సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలైతే ఎంచక్కా థియేటర్ లో ఫ్యామిలీ , ఫ్రెండ్స్ తో కలిసి చూసేయొచ్చు . కొన్ని రొమాంటిక్ మూవీస్ అయితే పార్ట్నర్స్ తో కలిసి థియేటర్స్ లో చూసిన ఇబ్బంది అనిపించదు. కానీ కొన్ని బో*ల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రం థియేటర్స్ లో చూడడానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి అలాంటి సినిమాలను ఓటీటీ లో ఒంటరిగా చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఓటీటీ లోకి అలాంటి ఓ తెలుగు సినిమానే రాబోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో చూసేద్దాం.

ఒకటో రెండో బో*ల్డ్ సీన్స్ ఉంటే ఎలాగూ ఒకలా థియేటర్స్ లోనే చూసేస్తూ ఉంటారు ప్రేక్షకులు. కానీ లిమిట్ కు మించి ఉంటే మాత్రం అందరితో పాటు థియేటర్స్ లో చూడడం కాస్త కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి కూడా అదే అయింది. ఈ తెలుగు బో*ల్డ్ మూవీ మరేదో కాదు.. నవదీప్ నటించిన.. “లవ్ మౌళి” . ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి శిష్యుడు అవనీంద్ర డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా టీజర్ విడుదలైన అప్పుడు లభించిన స్పందన.. థియేటర్ లో సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం లభించలేదు. ఈ సినిమా జూన్ 7న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ప్రేక్షకుల నుంచి మాత్రం ఈ సినిమాకు యావరేజ్ టాక్ లభించింది. అయితే, ప్రీమియర్స్ షోస్ కు మాత్రం ఈ సినిమాకు అమ్మాయిల నుంచి విపరీతమైన స్పందన లభించిందని టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది.

సాధారణంగా ఇప్పుడు చాలా వరకు సినిమాలు రెండు రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల అవుతూ ఉన్నాయి. ఈ సినిమా కూడా అంతే.. లవ్ మౌళి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా , అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నాయి. అలాగే థియేట్రికల్ రన్ పూర్తైన 50 రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే అన్ని రోజుల వరకు ఉండదని.. దాదాపు జూన్ ఆఖరి వారంలో లేదా జూలై మొదటి వారంలోనే ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందని అంచనా. సడెన్ గా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు లేదా సైలెంట్ గా సినిమాను స్ట్రీమింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments