OTT లో ఈ 2 తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్స్ అసలు మిస్ అవ్వొద్దు..

OTTలో ప్రత్యేకించి తెలుగు సినిమాలను మాత్రమే చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. వారి కోసమే ఈరోజు OTT లో రెండు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలు చూసేద్దాం.

OTTలో ప్రత్యేకించి తెలుగు సినిమాలను మాత్రమే చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. వారి కోసమే ఈరోజు OTT లో రెండు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలు చూసేద్దాం.

కొన్ని సినిమాలు థియేటర్ లో మిస్ అయినా కూడా ఎప్పుడు OTT లోకి వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఈ వారం OTT లో ఆరుకుపైగా తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈరోజు రెండు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. అవి మరేవో కాదు మెర్సీ కిల్లింగ్ , కర్ణ పిశాచి. వీటిలో ఒకటి క్రైమ్ థ్రిల్లర్ మరొకటి హర్రర్ థ్రిల్లర్.. కాబట్టి ప్రేక్షకులకు రెండు సినిమాలు ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి.

మెర్సీ కిల్లింగ్ సినిమా విషయానికొస్తే..

ఈ సినిమాలో సాయికుమార్ , కేరింత పార్వ‌తీశం, ఐశ్వ‌ర్య, హారిక ప్రధాన పాత్రలలో నటించారు. వెంకట రమణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఈ సినిమాను రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 21 ఆధారంగా రూపొందించారట మేకర్స్. ఈ సినిమా కథ విషయానికొస్తే.. స్వేచ్ఛ అనే అమ్మాయి ఓ అనాధ . ఆమె అనేక అవమానాలు ఎదుర్కొంటుంది. దీనితో ఆమె తన తల్లిదండ్రుల కోసం వెతకడం మొదలుపెడుతుంది. ఈ క్రమంలో మహేష్ , భారతి లు స్వేచ్ఛ జీవితంలోకి ఎంటర్ అవుతారు. స్వేచ్ఛ తండ్రిని వెత‌క‌డంలో వారిద్దరూ ఎలా సహాయపడ్డారు ? సాయికుమార్ కు స్వేచ్ఛ కు సంబంధం ఏంటి ? అసలు ఆమె తల్లిదండ్రులు ఎవరు ? చివరకు ఏమౌతుంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ చూడాల్సిందే.

క‌ర్ణ పిశాచి సినిమా విషయానికొస్తే..

హర్రర్ మూవీ లవర్స్ కు ఈ సినిమా బాగా నచ్చేస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమాకు విజయ్ మల్లాది దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమాలో ప్రణవి , రమ్య శ్రీ , నిఖిల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఓ యువకుడు లవ్ తో పాటు లైఫ్ లో కూడా ఫెయిల్ అవుతాడు . దీనితో మద్యానికి బానిస అవుతాడు. సరిగ్గా అదే టైం లో అతని పూర్వీకులకు సంబందించిన ఓ పురాతన గ్రంధం అతనికి దొరుకుతుంది. ఆ పుస్తకం కారణంగా అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? అసలు ఆ పుస్తకం అతనికి ఎందుకు దొరికింది ? దానిలో ఏముంది ? చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments