iDreamPost
android-app
ios-app

OTT New Release: ఈ నెలలో OTT లోకి 4 మలయాళ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

  • Published Jun 08, 2024 | 6:24 PM Updated Updated Jun 08, 2024 | 6:24 PM

మలయాళ సినిమాల ఇంపాక్ట్ ప్రేక్షకుల మీద బాగానే పడుతుంది. ఒకప్పుడు ఒకటి రెండు మూడు మలయాళ సినిమాలను చూసి ఆహ ఓహో అంటూ సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అందరు ఈ సినిమాల కోసమే ఎదురుచూస్తున్నారు. మరి ఈ నెలలో రాబోయే మలయాళ సినిమాలేంటో చూసేద్దాం.

మలయాళ సినిమాల ఇంపాక్ట్ ప్రేక్షకుల మీద బాగానే పడుతుంది. ఒకప్పుడు ఒకటి రెండు మూడు మలయాళ సినిమాలను చూసి ఆహ ఓహో అంటూ సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అందరు ఈ సినిమాల కోసమే ఎదురుచూస్తున్నారు. మరి ఈ నెలలో రాబోయే మలయాళ సినిమాలేంటో చూసేద్దాం.

  • Published Jun 08, 2024 | 6:24 PMUpdated Jun 08, 2024 | 6:24 PM
OTT New Release: ఈ నెలలో OTT లోకి 4 మలయాళ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

ప్రతి వారం ఓటీటీ లోకి చాలానే సినిమాలు, సిరీస్ లు ప్రతి వారం చాలానే రిలీజ్ అవుతూ ఉన్నాయి. దీనితో ఏ రోజున ఏ సినిమాలు, సిరీస్ లు వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారన్న విషయం కూడా తెలిసిందే . అయితే మిగిలిన అన్ని సినిమాల కోసం ఎదురుచూడడం వేరు. కేవలం మలయాళ సినిమాల కోసమే ఎదురుచూడడం వేరు. మలయాళ సినిమాల ఇంపాక్ట్ ప్రేక్షకుల మీద బాగానే పడుతుంది. ఒకప్పుడు ఒకటి రెండు మూడు మలయాళ సినిమాలను చూసి ఆహ ఓహో అంటూ సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అందరు ఈ సినిమాల కోసమే ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మరి ఈ నెలలో రాబోయే మలయాళ సినిమాలేంటో ఓ లుక్ వేసేద్దాం.

ఆడుజీవితం:

పృథ్విరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్ లో నటించిన సినిమా ‘ఆడుజీవితం’ . ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. మార్చి 28న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ అదిగో ఇదిగో అంటూ ఊరించడమే కానీ ఈ సినిమా మాత్రం ఇంకా ఓటీటీ లోకి రాలేదు. కనీసం ఈ నెలలోనైన ఈ సినిమా ఓటీటీ లోకి వస్తుందో లేదో వేచి చూడాలి.

నడికర్:

టొవినో థామన్ హీరోగా తెరకెక్కిన కామెడీ డ్రామా మూవీ ‘నడికర్’. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 3న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ లా ఉందంటూ.. టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నెలలోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు మేకర్స్.

మలయాళీ ఫ్రమ్ ఇండియా:

మే 1న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. ఆ సమయంలో ఈ సినిమాకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు డిజో జాస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీలివ్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా కూడా ఈ నెలలోనే స్ట్రీమింగ్ కు రానుంది.

గురువాయూర్ అంబలనడయిల్:

మే 16 న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. విపిన్ దాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. థియేటర్ లో ఈ సినిమాకు సూపర్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా కూడా జూన్ లోనే స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇంకా ఓటీటీ పార్ట్నర్ వివరాలను మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

మరి ఈ నెలలో ఓటీటీ లోకి రానున్న ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.