OTT Comedy Movie: డైరెక్ట్ గా OTT లోకి కీర్తి సురేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

OTT Comedy Movie: డైరెక్ట్ గా OTT లోకి కీర్తి సురేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

వెండి తెర నటి నటులంతా ఒక్కొక్కరిగా ఓటీటీ బాట పడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి టాలీవుడ్ నటి కీర్తి సురేష్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తుంది. కీర్తి సురేష్ మూవీ నేరుగా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుందట. దానికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.

వెండి తెర నటి నటులంతా ఒక్కొక్కరిగా ఓటీటీ బాట పడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి టాలీవుడ్ నటి కీర్తి సురేష్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తుంది. కీర్తి సురేష్ మూవీ నేరుగా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుందట. దానికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.

ఇప్పుడు ఓటీటీ లకు పెరుగుతున్న ఆదరణ అంతా ఇంతా కాదు.. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే.. వెండి తెరపై అలరించిన స్టార్ సెలెబ్రిటీల సినిమాలు , సిరీస్ లు సైతం నేరుగా ఓటీటీ లోకి రావడం. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి టాలీవుడ్ నటి కీర్తి సురేష్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన మూవీ డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిపోతుంది. అది కూడా ఓ కామెడీ జోనర్ లో వస్తున్న మూవీ. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ మూవీకి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

టాలీవుడ్ లో కీర్తి సురేష్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక మహానటి తర్వాత ఆమె రేంజ్ నెక్ట్ లెవెల్ కు పెరిగిపోయిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఆ తర్వాత ఇప్పుడు సినిమాల ఎంపికలో ఈ అమ్మడు చాలా జాగ్రత్తలు వహిస్తోంది.. ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేయడంపై ఫోకస్ చేస్తుంది. భోళా శంకర్ మూవీ తర్వాత కీర్తి సురేష్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఓ కామెడీ మూవీకి ఒకే చెప్పింది. ఆ సినిమా పేరు “ఉప్పు కప్పురంబు”. కాగా ఈ సినిమాలో సుహాస్ కూడా కీ రోల్ చేయనున్నాడు. ఈ కామెడీ మూవీకి అనిల్ ఐవీ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేశారట మేకర్స్. అయితే ఈ సినిమాను థియేటర్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమాను నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయనున్నారు.

కాగా తెలుగులో రూపొందిస్తున్న ఈ సినిమాను.. ఓటీటీ లో కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ లోకి రాడానికి చాలా సమయమే పట్టేలా ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఇక కీర్తి సురేష్ విషయానికొస్తే.. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ తమిళంలో మూడు సినిమాలతో బిజీగా ఉంది. ఆ సినిమాలలో ఒకటి త్వరలోనే రిలీజ్ కాబోతుంది . మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments