OTTలోకి భారతీయుడు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?

కమల్ హాసన్ ఇండియన్ 2 థియేటర్లలో సందడి చేస్తుంది. జులై 12 న విడుదలైన ఈ మూవీ మిశ్రమ స్పందన లభిస్తుంది. ఇదిలా ఉంటే.. భారతీయుడు 2 చూడాలంటే ఇండియన్ మూవీ చూడాల్సిందే. ఇది ఓటీటీలోకి రాబోతుంది.

కమల్ హాసన్ ఇండియన్ 2 థియేటర్లలో సందడి చేస్తుంది. జులై 12 న విడుదలైన ఈ మూవీ మిశ్రమ స్పందన లభిస్తుంది. ఇదిలా ఉంటే.. భారతీయుడు 2 చూడాలంటే ఇండియన్ మూవీ చూడాల్సిందే. ఇది ఓటీటీలోకి రాబోతుంది.

అవినీతి, లంచం, ఇతర సామాజిక అంశాలపై సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి వాటిపై సినిమాలు తీస్తే ఎవరు చూస్తారు. కానీ వాటితోనే హిట్స్ కొట్టాడు కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్. జెంటిల్ మ్యాన్ మొదలుకుని, ఇటీవల వచ్చిన భారతీయుడు 2 వరకు ఇలాంటి అంశాల చుట్టూనే కొన్ని సినిమాలను తెరకెక్కించాడు. అవినీతి వల్ల అన్యాయానికి గురైన ఓ వ్యక్తి లేదా కుటుంబంలోని ఒకరు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడుతుంటారు. ఆయన సినిమాల్లో కథే బలం. స్టార్ హీరోలు ఆ కథకు సమన్యాయం చేస్తుంటారు. అటువంటి కేటగిరిలో వచ్చిన మూవీ భారతీయుడు. 1996లో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టింది. కమల్ హాసన్ ఇందులో డ్యూయల్ రోల్ పోషించాడు.

మనీషా కొయిరాలా, ఉర్మిళా మండోద్కర్, మనీషా కొయిరాలా, సుకన్య, కస్తూరి మెయిన్ లీడ్స్. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కొట్టింది. క్లాసిక్ మూవీగా భారతీయుడు నిలిచిపోయింది అనడంలో సందేహం లేదు. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు.. ఈ సినిమాకు హైలెట్. ‘పచ్చని చిలుకలు తోడుంటే.. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా, అదిరేటి డ్రెస్సు మేమేస్తే, తెప్పలెళ్లిపోయాక.. మాయ మశ్చింద్రా.. మచ్చను చూడ వచ్చావా’ సాంగ్స్ అప్పట్లో చార్ట్ బస్టర్స్. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎం రత్నం ఈ సినిమాను రూపొందించాడు. అప్పట్లో రూ. 15 కోట్లను వసూలు చేసింది భారతీయుడు. ఈ సినిమా విడుదలైన సుమారు 28 ఏళ్లకు భారతీయుడు 2 వచ్చింది. జులై 12 నుండి థియేటర్లలో సందడి చేస్తుంది.

తెలుగులో భారతీయుడు 2, తమిళంలో ఇండియన్‌ 2, హిందీలో హిందుస్థానీ 2 పేరుతో జులై 12న విడుదలైంది. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంటుంది. కమల్ హాసన్ మరోసారి తనదైన నటనతో మెస్మరైజ్ చేశాడని అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో క్లాసిక్ మూవీ అయిన భారతీయుడును ఓటీటీలోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ. భారతీయుడు చూడకుంటే.. భారతీయుడు 2 చూడలేరు. ఈ నేపథ్యంలో ఓటీటీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకురానుంది. జులై 15న ఇండియన్‌ మొదటి భాగాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. అంటే సోమవారం నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. భారతీయుడు 2 చూడాలనుకుంటే.. తొలి భాగం చూడాల్సిందే. మరెందుకు ఆలస్యం చూసి రాగానే చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ ట్విస్టే ఏంటంటే..? తెలుగులో యూట్యూబ్ లో సినిమా అందుబాటులో ఉండటం గమనార్హం.

Show comments