iDreamPost
android-app
ios-app

Gam Gam Ganesha OTT: ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’ OTT స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Published Jun 04, 2024 | 4:12 PMUpdated Jun 04, 2024 | 4:12 PM

ఇప్పుడు ఓటీటీ లో పెద్దగా సినిమాలు లేకపోవడంతో.. ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు వస్తాయా అని చూసేందుకు రెడీగా ఉన్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో తాజాగా థియేటర్ లో రిలీజ్ అయినా సినిమా ఓటీటీ లోకి రాబోయేది అప్పుడే అంటూ టాక్ వినిపిస్తుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

థియేటర్స్ లో సినిమాలను చూసినా కానీ ఆయా సినిమాలు ఓటీటీ లోకి ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా ఆనంద్ దేవర కొండ నటించిన “గం గం గణేశా” సినిమా.. మే 31 న థియేటర్ లో రిలీజ్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా కానీ ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తోనే దూసుకుపోతుంది. ఇక అదే రోజు ఈ సినిమా ఏ ఓటీటీ లోకి వస్తుంది అనే టాక్ కూడా వచ్చేసింది. అంతలోనే ఈ సినిమా ఓటీటీ లోకి రాబోయేది ఇప్పుడే అంటూ మరొక టాక్ కూడా వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

ఆనంద్ దేవర కొండ లేటెస్ట్ గా నటించిన క్రైమ్ కామెడీ మూవీ “గం గం గణేశా”. ఈ సినిమాకు ఉదయ్ బొమ్మి శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే ఆయన తెలుగులో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. అలాగే వంశీ కారుమంచి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈయన కూడా తొలిసారి టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా అరంగేట్రం చేశారు. ఇక ఈ సినిమా థియేటర్ లో విడుదలైన మొదటి వారం నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ భారీ ధరలకు సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని.. జూన్ చివరి వారంలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

కాగా ఈ సినిమాలో నయన సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్‌గా నటించారు. వారితో పాటు ఇమ్మాన్యూయెల్, బిగ్ బాస్ ప్రిన్స్ యావర్, వెన్నెల కిశోర్ కూడా కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఈ మూవీ ఓ వస్తువు చుట్టూ కొనసాగుతుంది. ఆ వస్తువు ఏంటి? అందులో ఏముంది ? చివరకు ఆ వస్తువు హీరోకు దొరికిందా లేదా ! అనే ప్లాట్ తో ఈ సినిమా కొనసాగుతుంది. ఇక ఆనంద్ దేవరకొండ విషయానికొస్తే.. అతను ఇప్పటికే ఎన్నో మంచి మంచి కథలతో ప్రేక్షలను మెప్పించి.. గత సంవత్సరం బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి