OTT Telugu Movies: ఒకే OTT లో 16 తెలుగు సినిమాలు, 4 సిరీస్ లు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

ఇప్పుడు ఎక్కడ విన్నా .. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు ఓటీటీ గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు ఓటీటీ లోకి వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్.

ఇప్పుడు ఎక్కడ విన్నా .. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు ఓటీటీ గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు ఓటీటీ లోకి వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్.

ఈ వారం ఓటీటీ లోకి వచ్చే సినిమాలు ఇవే.. ఈ వారం ఈ సినిమాలను అసలు మిస్ కాకండి.. ఈ సినిమాను చూశారా అంటూ.. ఇలా ప్రతి వారం ప్రతి రోజు ఓటీటీ కి సంబంధించిన ఎదో ఒక అప్ డేట్ ను చూస్తూనే ఉన్నాము. ఇక మూవీ లవర్స్ కూడా వారం ముందు నుంచే ఈ వీకెండ్ ఏ ఏ సినిమాలను చూడాలనే ప్లాన్స్ వేస్తూనే ఉన్నారు. అయితే ప్రతి వారం ఓటీటీ లోకి ఎన్ని సినిమాలు వస్తాయి అనే లిస్ట్ రాగానే.. ముందుగా అందరు వాటిలో సెర్చ్ చేసేది తెలుగు సినిమాల కోసమే. ప్రస్తుతం తెలుగు సినిమాలకు బాగానే ఆదరణ లభిస్తుందని చెప్పి తీరాల్సిందే. గత కొన్ని వారాలుగా ప్రతి వారం ఎదో ఒక తెలుగు సిరీస్ , సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు కేవలం తెలుగు సినిమాల కోసం ఎదురుచూసే వారికి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పి తీరాలి. ఎందుకో చూసేద్దాం.

ప్రస్తుతం ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం అనేక ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సిద్ధంగా ఉన్నాయి. వాటిలో తెలుగు సినిమాలను , సిరీస్ లను ఎక్కువగా స్ట్రీమింగ్ చేస్తున్న ప్లాట్ ఫార్మ్ ఆహా , ఈటీవీ విన్. ఇప్పటికే ఈ రెండు ప్లాట్ ఫార్మ్స్ నుంచి నేరుగా వచ్చిన ఎన్నో సినిమాలు , సిరీస్ లు ట్రెండింగ్ లో నిలిచాయి. ఇక ఇప్పుడు వీటిలో ఈటీవీ విన్ ప్లాట్ ఫార్మ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈటీవీ విన్ ఒరిజినల్స్ పేరుతో.. కొన్ని సినిమాలను , సిరీస్ లను రిలీజ్ చేస్తుంది. ఈ కంటెంట్ ను ప్రతి ఒక్కరు బాగానే ఆదరిస్తున్నారు. ఇప్పటికే ఈటీవీ విన్ నుంచి వచ్చిన 90’స్ సిరీస్ కు ఎలాంటి రెస్పాన్స్ లభించిందో తెలిసిందే. ఇక ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయినా శశి మధనం సిరీస్ కు కూడా బాగానే ఆదరణ లభిస్తుంది. అయితే తాజాగా జరిగిన ఈ సిరీస్ సక్సెస్ మీట్ లో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ ప్రకటించింది ఈ సంస్థ.

అదేంటంటే.. ప్రస్తుతం ఓటీటీ లో తెలుగు కంటెంట్ కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. సంవత్సరానికి 16 సినిమాలతో పాటు.. 4 వెబ్ సిరీస్ లను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ప్రకటించింది ఈ సంస్థ. దీనితో మూవీ లవర్స్ ఖుషి అయిపోతున్నారు. అసలే ఓటీటీ లో ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు వస్తాయా అనే ఎదురుచూస్తూ ఉంటున్నారు. మరి ఈసారి ఒకే ఓటీటీ లో ఏకంగా 16 సినిమాలు , 4 సిరీస్ లంటే.. ఇక మూవీ లవర్స్ కు పండగే. మరి ఎలాంటి సినిమాలు రానున్నాయి అనే విషయాలపై మరిన్ని అప్ డేట్స్ రావాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments